త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adhurs Sequel | అదుర్స్ 2పై డైరెక్టర్ వినాయ‌క్ క్లారిటీ – జ‌నాలు చిరాకు ప‌డ‌తారంటూ కామెంట్స్‌

ఎన్టీఆర్ అదుర్స్ 2 మూవీపై డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. ఈ సినిమాకు సీక్వెల్ తీయ‌డం కంటే సైలెంట్‌గా ఉండ‌ట‌మే మంచిద‌ని అన్నారు. ఒక‌వేళ బ‌ల‌వంతంగా పార్ట్ 2 తీసినా ఆడ‌ద‌ని వినాయ‌క్ పేర్కొన్నారు.

N

Entertainment | Published On Mar 24, 2026, 5.36 pm IST

Adhurs Sequel | అదుర్స్ 2పై డైరెక్టర్ వినాయ‌క్ క్లారిటీ – జ‌నాలు చిరాకు ప‌డ‌తారంటూ కామెంట్స్‌
Advertisement

Adhurs Sequel |  ఎన్టీఆర్ కెరీర్‌లో సూప‌ర్ హిట్ సినిమాల్లో అదుర్స్ ఒక‌టి. మాస్ హీరోగా ఇమేజ్‌ను తెచ్చుకున్న ఎన్టీఆర్....కామెడీతోనూ అద‌ర‌గొట్ట‌గ‌ల‌డ‌ని ఈ మూవీ నిరూపించింది. చారి పాత్ర‌లో ఎన్టీఆర్ మ్యాన‌రిజ‌మ్స్‌, పంచ్ డైలాగ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నాయి. అదుర్స్ క‌మ‌ర్షియ‌ల్‌గా నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది. అదుర్స్ మూవీకి వీవీ వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. కోన వెంక‌ట్ క‌థ‌ను అందించిన ఈ మూవీలో న‌య‌న‌తార‌, శీల హీరోయిన్లుగా న‌టించారు. ఇందులో ఎన్టీఆర్ డ్యూయ‌ల్ రోల్‌లో క‌నిపించాడు.

అదుర్స్ 2....

కాగా అదుర్స్ మూవీకి సీక్వెల్ రాబోతున్న‌ట్లు గ‌త‌ కొద్ది రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదుర్స్ 2 క‌థ సిద్ధం చేస్తున్న‌ట్లు ఇటీవ‌ల రైట‌ర్ కోన వెంక‌ట్ ప్ర‌క‌టించారు. త్వ‌ర‌లోనే ఎన్టీఆర్‌ను క‌లిసి క‌థ వినిపిస్తాన‌ని అన్నారు.
తాజాగా అదుర్స్ 2పై డైరెక్ట‌ర్ వీవీ వినాయ‌క్ ఓ ఇంటర్వ్యూలో రియాక్ట్ అయ్యారు. "అదుర్స్ క‌థకు ప్రాప‌ర్ ఎండింగ్ ఇచ్చేశాం. అందులో సీక్వెల్ తీసేందుకు ఏమి మిగలలేదు. ఒక‌వేళ బలవంతంగా పార్ట్ 2 తీసినా ఆ మ్యాజిక్ రిపీట్ చేస్తుంద‌నే న‌మ్మ‌కం లేదు. అదుర్స్ సీక్వెల్ తీయ‌డం కంటే దానిని ఒకే పార్ట్‌తో అలాగే వదిలేయడం బెటర్" అని వీవీ వినాయ‌క్ అన్నారు.

రీఎంట్రీపై...

డైరెక్ట‌ర్‌గా త‌న రీఎంట్రీపై కూడా వినాయ‌క్ స్పందించారు. "సినిమాలు తీసేందుకు కొత్త ఐడియాలు లేనప్పుడు సైలెంట్‌గా ఉండ‌ట‌మే మంచిది. అప్పుడెప్పుడో సుమోలు ఎగరేశామ‌ని ఇప్పుడు కూడా అవే కథలు రాసి సినిమాలు తీస్తే ఆడియెన్స్ చూడ‌రు. నాతో ప‌నిచేసిన హీరోలంద‌రితో ఇప్ప‌టికీ మంచి అనుబంధ‌ముంది. వారి ద‌గ్గ‌ర‌కు వెళ్లి సినిమా చేద్దాం అంటే మొహమాటానికి ఒప్పుకుంటారు కానీ అలా చేయను" అని వినాయ‌క్ అన్నారు. మంచి క‌థ దొర‌క‌డ‌మే కాకుండా ఆ పాయింట్‌తో సినిమా చేయ‌చ్చ‌నే న‌మ్మ‌కంతో త‌న‌తో పాటు హీరోకు క‌లిగిన రోజు రీఎంట్రీ గురించి ఆలోచిస్తాన‌ని అన్నారు. వినాయ‌క్ చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.
ఆది సినిమాతో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు వినాయ‌క్‌. ఆ త‌ర్వాత దిల్‌, ల‌క్ష్మి, బ‌న్నీ, అదుర్స్‌, ఖైదీ నంబ‌ర్ 150తో పాటు ప‌లు విజ‌య‌వంత‌మైన సినిమాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

 

 

Advertisement

తాజావార్తలు

Advertisement