Avatar 3 Review | కళ్లలో నీళ్లు తిరిగాయి – అవతార్ 3పై సుకుమార్ రివ్యూ
అవతార్ 3కి మూవీకి మెర్విక్ డైరెక్టర్ సుకుమార్ రివ్యూ ఇచ్చాడు. అవతార్ సినిమా చూస్తూ పండోరా ప్రపంచంలోకి వెళ్లిపోయానని అన్నారు. కొన్ని సీన్లకు కళ్లలో నీళ్లు తిరిగాయని చెప్పారు. సుకుమార్ రివ్యూ వైరల్ అవుతోంది.
Entertainment | Published On Dec 18, 2025, 3.32 pm IST
సుకుమార్
Avatar 3 Review | జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన అవతార్, అవతార్ 2 వరల్డ్ వైడ్‌గా సినీ లవర్స్‌ను మెప్పించాయి. విజువల్స్, గ్రాఫిక్స్, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో కొత్త బెంచ్‌మార్క్‌ను సెట్ చేశాయి. అవతార్ సినిమాలకు ఆడియెన్స్ మాత్రమే కాకుండా దిగ్గజ సినీ దర్శకులు కూడా ఫ్యాన్స్‌గా మారారు. అవతార్, అవతార్ 2 సినిమాలు ఇండియాలోనూ బాక్సాఫీస్ వద్ద భారీగా వసూళ్లను రాబట్టాయి.
తాజాగా అవతార్ ఫ్రాంచైజ్‌లో మూడో పార్ట్ రాబోతుంది. అవతార్ ఫైర్ అండ్ యాష్ పేరుతో తెరకెక్కుతున్న ఈ మూడో పార్ట్ డిసెంబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రిలీజ్‌కు ముందే అవతార్ ఫైర్ అండ్ యాష్ సినిమాను రాజామౌళి, సుకుమార్‌తో పాటు పలువురు టాలీవుడ్ దర్శకులు వీక్షించారు. అవతార్ ఫైర్ అండ్ యాష్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఓ వీడియో ద్వారా అభిమానులతో పంచుకున్నారు సుకుమార్. పుష్ప డైరెక్టర్ ఇచ్చిన రివ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పండోర వరల్డ్‌లోకి వెళ్లిపోయా...
![]()
Avatar: Fire and Ash poster showing a close-up of a Na’vi warrior’s fiery eye, ash-covered face, and intense battle atmosphere
సైన్స్ ఫిక్షన్ సినిమాను కుటుంబమంతా కలిసి చూసేలా తెరకెక్కించడం అంటే కష్టమైన విషయమని సుకుమార్ అన్నారు. "మూడు గంటల ఇరవై నిమిషాలు ఎంగేజింగ్‌గా ఉంది. నేను ఒక్కడినే అవతార్ 3 చూశా. కానీ ఒంటరిగా చూశాననే ఫీల్ ఎక్కడ రాలేదు. పండోర వరల్డ్‌లోకి వెళ్లిపోయారు. నా చుట్టూ ఎవరున్నారన్నది గమనించలేదు. పక్కా బ్లాక్‌బాస్టర్ మూవీ. తెలుగు సినిమాల్లో ఉన్నంత ఎమోషన్ అవతార్ 3లో కనిపించింది. జేక్స్, నెట్రితో ఇతర పాత్రల తాలూకు ఎమోషన్స్‌కు కళ్లల్లో నీళ్లు తిరగాయి. పక్కా థియేటర్లలోనే చూడాల్సిన సినిమా ఇది" అని సుకుమార్ అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అవతార్ 3 మూవీ తొలిరోజు ఇండియాలో 30 - 35 కోట్ల మధ్య ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. తెలుగు వెర్షన్‌కు మొదటిరోజు ఐదు కోట్ల వరకు కలెక్షన్స్ రావచ్చునని అంచనా వేస్తున్నారు. 400 మిలియన్లు (ఇండియన్ కరెన్సీలో 3300 కోట్ల) బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందినట్లు ప్రచారం జరుగుతోంది.
క్వారిచ్ దాడుల నుంచి తమ ఫ్యామిలీని జేక్ సల్లీ, నేట్రి కాపాడుకోవడంతో రెండో పార్ట్ ముగిసింది. అక్కడి నుంచే ఫైర్ అండ్ యాష్ కథ మొదలవుతుంది. యాష్ గ్యాంగ్ దాడుల కారణంగా సల్లీ, నేట్రి కుటుంబం చెల్లచెదురు అవుతుంది. ఆ దాడులను జేక్ సల్లీ, నేట్రి ఎలా ఎదుర్కొన్నారు అనే అంశాలతో మూడో పార్ట్ రూపొందింది.
సంబంధిత వార్తలు

Peddi Movie | పెద్ది వచ్చేస్తున్నాడు.. థియేటర్లలో మెగా పవర్ స్టార్ మాస్ జాతర ఎప్పుడంటే?
మే 1, 2026

Avatar 3 | అవతార్ 3 ఫస్ట్ డే కలెక్షన్స్ – రికార్డులు అనుకుంటే… సీన్ రివర్స్!
డిసెంబర్ 20, 2025

బన్నీ నెక్స్ట్ మూవీ ఎవరితో? – అల్లు అర్జున్ కోసం వెయిటింగ్లో ఉన్న టాప్ డైరెక్టర్లు వీళ్లే!
డిసెంబర్ 4, 2025
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



