త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Avatar 3 | అవ‌తార్ 3 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – రికార్డులు అనుకుంటే… సీన్ రివ‌ర్స్‌!

Avatar 3 | జేమ్స్ కామెరూన్ విజువ‌ల్ వండ‌ర్ అవ‌తార్ 3 (Avatar 3)తొలిరోజు బాక్సాఫీస్ వ‌ద్ద డిస‌పాయింట్ చేసింది. ఇండియా వైడ్‌గా శుక్ర‌వారం రోజు ఈ సినిమా 19 కోట్ల నెట్ క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే రాబ‌ట్టింది. తెలుగు వెర్ష‌న్‌కు 3.75 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. అవ‌తార్ 2లో స‌గం కూడా అవ‌తార్ 3 రాబ‌ట్ట‌లేక‌పోయింది.

N

Entertainment | Published On Dec 20, 2025, 6.19 pm IST

Avatar 3 | అవ‌తార్ 3 ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ – రికార్డులు అనుకుంటే… సీన్ రివ‌ర్స్‌!
Advertisement

Avatar 3 |  జేమ్స్ కామెరూన్ (James Cameron) అవ‌తార్ 3 భారీ అంచ‌నాల న‌డుమ శుక్ర‌వారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా సినీ ల‌వ‌ర్స్ ముందుకొచ్చింది. ఈ విజువ‌ల్ వండ‌ర్ కోసం అభిమానుల‌తో పాటు సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా ఎదురుచూశాయి. అవ‌తార్, అవ‌తార్ 2 బిగ్గెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌తో మూడో పార్ట్ ఎలా ఉండ‌బోతుందో? డైరెక్ట‌ర్ జేమ్స్ కామెరూన్ ఎలాంటి అద్భుతాల్ని సృష్టించాడోన‌నే ఎగ్జైట్‌మెంట్ అంద‌రిలో క‌నిపించింది. భారీ ఎక్స్‌పెక్టేష‌న్స్ న‌డుమ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన అవ‌తార్ 3 మొద‌టిరోజే డిస‌పాయింట్ చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.
విజువ‌ల్స్‌, గ్రాఫిక్స్ ప‌రంగా బాగున్నా స్టోరీ, ఎమోష‌న్స్ విష‌యంలో అవ‌తార్‌, అవ‌తార్ 2 స్థాయిలో అవ‌తార్ ఫైర్ అండ్ యాష్ లేదంటూ విమ‌ర్శ‌లొస్తున్నాయి. ఈ నెగెటివ్ టాక్ ఎఫెక్ట్ క‌లెక్ష‌న్స్‌పై భారీగానే ప‌డింది. ఇండియా వైడ్‌గా ఫ‌స్ట్ డే అవ‌తార్ 3 మూవీ 40 కోట్ల‌కుపైగా గ్రాస్‌, పంతొమ్మిది కోట్ల వ‌ర‌కు నెట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా పూర్తిగా తేలిపోయింది. శుక్ర‌వారం రోజు అతి క‌ష్టంగా అవ‌తార్ 3కి తెలుగులో 3.75 కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి.
అవ‌తార్ 2 ఫ‌స్ట్ డే ఇండియాలో 40 కోట్ల‌కుపైగా నెట్ క‌లెక్ష‌న్స్‌తో రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అవ‌తార్ 2....14 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌తో ర‌చ్చ చేసింది. అవ‌తార్ 2కు ద‌రిదాపుల్లో కూడా మూడో పార్ట్ నిల‌వ‌లేక‌పోవ‌డం ట్రేడ్ వ‌ర్గాల‌ను విస్మ‌య‌ప‌రుస్తోంది.
శుక్ర‌వారం రోజు అవ‌తార్ 3 కంటే ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ ఎక్కువ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ధురంధ‌ర్ సినిమా 22.50 కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. ధురంధ‌ర్ రిలీజై ప‌దిహేను రోజులు అయ్యింది. అయినా ఆ సినిమాకు అవ‌తార్ 3 పోటీ ఇవ్వ‌లేక‌పోయింది. శ‌నివారం రోజు అవ‌తార్ 3 క‌లెక్ష‌న్స్ మ‌రింత త‌గ్గే అవ‌కాశం ఉన్న‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి. వ‌ర‌ల్డ్ వైడ్‌గా అవ‌తార్ 3 కి మొద‌టిరోజు 500 కోట్లు వ‌చ్చాయి. దాదాపు 3300 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందడం గ‌మ‌నార్హం.
క‌థ విష‌యంలో అవ‌తార్ 2, అవ‌తార్ 3 ఒకేలా ఉన్నాయ‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. క‌ల్న‌ల్ క్వారిచ్‌తో జ‌రిగిన యుద్ధంలో జేక్ స‌ల్లీ, నేత్రి త‌మ పెద్ద కొడుకును కోల్పోతారు. ఈ బాధ నుంచి తేరుకుంటున్న త‌రుణంలోనే చ‌నిపోయాడ‌నుకున్న క్వారిచ్ మ‌ళ్లీ తిరిగొస్తాడు. వ‌రంగ్ అనే ఓ తెగ నాయ‌కురాలితో క‌లిసి జేక్ స‌ల్లీ, నేత్రిల‌పై రివేంజ్ తీర్చుకోవాల‌ని అనుకుంటాడు. క‌ల్న‌క్ క్వారిచ్ కుట్ర‌ల‌ను జేక్ స‌ల్లీ, నేత్రి ఎలా ఎదుర్కొన్నారు. త‌మ పిల్ల‌ల‌ను ఎలా కాపాడుకున్నార‌నే పాయింట్‌తో అవ‌తార్ 3 రూపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement