Sreeleela | ఫ్లాపుల ఎఫెక్ట్ – తెలుగు సినిమా కోసం రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన శ్రీలీల
స్టార్ హీరోల సినిమాలో అవకాశాలు వస్తోన్న శ్రీలీలకు అదృష్టం మాత్రం కలిసిరావడం లేదు. ధనుష్ ఓం మూవీ కూడా ధమాకా బ్యూటీకి నిరాశనే మిగిల్చింది. తాజాగా శ్రీలీల తెలుగులో ఎట్టకేలకు ఓ ఛాన్స్ దక్కించుకున్నట్లు సమాచారం. ఈ సినిమా కోసం తన రెమ్యూనరేషన్‌ను సగానికిపైగా తగ్గించుకున్నట్లు వార్తలొస్తున్నాయి.
Entertainment | Published On Nov 29, 2026, 4.59 pm IST
Sreeleela | అందం, అభినయం ఉన్న శ్రీలీలకు అదృష్టం మాత్రం కలిసి రావడం లేదు. గ్లామర్ రోల్స్‌కు మాత్రమే కాకుండా పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ పాత్రలకు న్యాయం చేయగలదని నిరూపించుకుంది. డ్యాన్సుల్లో యంగ్ హీరోయిన్లలో శ్రీలీలతో పోటీపడేవారు లేరు. సినిమాల కోసం ఎంత కష్టపడాలో అంత పడుతుంది. కానీ విజయాలు మాత్రం దక్కడం లేదు.
ధనుష్ ఓం మూవీ...
ధనుష్ (Dhanush ) ఓం సినిమాతో శ్రీలీల హిట్టు అందుకోవడం ఖాయమని అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు భావించాయి. కానీ ఈ బెంగళూరు బ్యూటీకి లక్కు కలిసిరాలేదు. నేషనల్ అవార్డ్ విన్నర్ రాజ్‌కుమార్ పెరియసామీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల పాత్రపై దారుణంగా విమర్శలొచ్చాయి.ఈ సినిమాకు ఆమె రోల్ బిగ్గెస్ట్ మైనస్ అంటూ ట్రోల్ చేశారు. కమర్షియల్‌గా ఆశించిన స్థాయిలో ఈ సినిమాకు కలెక్షన్లు రావడం లేదు. బ్యాక్ టూ బ్యాక్ డిజాస్టర్లతో ఇప్పటికే టాలీవుడ్‌కు దూరమైంది. తమిళంలో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. పరాశక్తి తర్వాత ఓం సినిమాతో రెండో ఫ్లాప్‌ను తన ఖాతాలో వేసుకుంది.
నితిన్ హీరోగా...
ఈ ఫ్లాపుల ఎఫెక్ట్‌తో శ్రీలీల (Sreeleela) రెమ్యూనరేషన్‌లో భారీగా కోత పడినట్లు సమాచారం. తెలుగులో ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న శ్రీలీల ఓ బంపరాఫర్ అందుకున్నట్లు తెలిసింది. నితిన్ హీరోగా రామ్ అబ్బరాజు దర్శకత్వంలో ఫన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఓ మూవీ తెరకెక్కబోతుంది. ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా ఛాన్స్ దక్కించుకున్నట్లు చెబుతున్నారు.
కాంప్రమైజ్...
ఈ సినిమా కోసం శ్రీలీల తన రెమ్యూనరేషన్‌ను (Remuneration) సగానికి తగ్గించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు నాలుగు నుంచి ఏడు కోట్ల మధ్య పారితోషికం స్వీకరిస్తోంది శ్రీలీల. కానీ నితిన్ సినిమా కోసం మాత్రం కోటిన్నర మాత్రమే తీసుకోవాలని ఈ ధమాకా బ్యూటీ నిర్ణయించుకున్నట్లు వినికిడి. కథ బాగా నచ్చడంతో సినిమాను వదులుకోకూడదని పారితోషికం విషయంలో కాంప్రమైజ్ అయినట్లుచెబుతోన్నారు. వచ్చిన ఒక్క అవకాశం మిస్సవుతుందనే ఆలోచనతోనే రెమ్యూనరేషన్ తగ్గించుకుందని రూమర్లు వస్తోన్నాయి. డిసెంబర్‌లో నితిన్ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన రానుంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్‌లో వస్తోన్న మూడో సినిమా ఇది. గతంలో రాబిన్‌హుడ్, ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాల్లో వీరిద్దరు జంటగా నటించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●MP Eatala Rajender | ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా ఉంటా.. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల ఫైర్
- ●Sharad Pawar | ముంబైకి ఇండియా కూటమి నేతల పరుగు.. డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?
- ●Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!
- ●Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు
- ●Abbas | ఒకేసారి మూడు సినిమాలు - టాలీవుడ్లోకి ప్రేమదేశం అబ్బాస్ రీఎంట్రీ
- ●MK Stalin | కట్టబొమ్మన్, ఎట్టప్పన్, డీలిమిటేషన్: రాహుల్‌కి స్టాలిన్ స్ట్రాంగ్ కౌంటర్.. తమిళ చరిత్రలోని ఆ ఇద్దరి కథేంటో తెలుసా?

MP Eatala Rajender | ఫాక్స్ సాగర్ బాధితులకు అండగా ఉంటా.. హైడ్రా కూల్చివేతలపై ఎంపీ ఈటల ఫైర్

Sharad Pawar | ముంబైకి ఇండియా కూటమి నేతల పరుగు.. డీలిమిటేషన్ బిల్లుపై శరద్ పవార్ తన నిర్ణయాన్ని మార్చుకుంటారా?

Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!

Jensen Huang | ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్‌కు అమెరికా కాంగ్రెస్ ఉచ్చు





