త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abbas | ఒకేసారి మూడు సినిమాలు – టాలీవుడ్‌లోకి ప్రేమ‌దేశం అబ్బాస్ రీఎంట్రీ

ప్రేమ‌దేశం ఫేమ్ అబ్బాస్ సుదీర్ఘ విరామం త‌ర్వాత టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఒకే సారి మూడు సినిమాలు అంగీక‌రించాడు. వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మ‌ల్టీస్టార‌ర్ మూవీ జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న, నీరో సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని అబ్బాస్ స్వ‌యంగా ప్ర‌క‌టించారు.

N

Entertainment | Published On Nov 29, 2026, 3.47 pm IST

Abbas | ఒకేసారి మూడు సినిమాలు – టాలీవుడ్‌లోకి ప్రేమ‌దేశం అబ్బాస్ రీఎంట్రీ
Advertisement

Abbas | ప్రేమ‌దేశం సినిమాతో యూత్‌కు ఫేవ‌రేట్ హీరోగా మారిపోయారు అబ్బాస్‌.  ల‌వ‌ర్‌బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు. ప్రేమ‌దేశం హిట్‌తో అబ్బాస్‌కు త‌మిళంతో పాటు తెలుగులో టాప్ బ్యాన‌ర్లు, అగ్ర ద‌ర్శ‌కుల సినిమాల్లో అవ‌కాశాలు వ‌చ్చాయి. రాజ‌హంస‌, ప్రియా ఓ ప్రియాతో తెలుగులో హీరోగా చాలానే సినిమాలు చేశాడు. కానీ క‌థ‌ల ఎంపిక‌లో త‌ప్ప‌ట‌డుగుల కార‌ణంగా ప్రేమ‌దేశం సినిమాతో అబ్బాస్‌కు వ‌చ్చిన ఫేమ్ , క్రేజ్ ఎక్కువ కాలం నిల‌వ‌లేదు. ప‌రాజ‌యాల కార‌ణంగా హీరో నుంచి క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ రేంజ్‌కు ప‌డిపోయాడు. స్టార్ హీరోల సినిమాల్లో చిన్న చిన్న పాత్ర‌లు చేసిన అబ్బాస్ స‌డెన్‌గా ఇండ‌స్ట్రీ పెట్టి విదేశాల‌కు వెళ్లిపోయాడు.

హ్యాపీరాజ్‌...

దాదాపు ప‌న్నెండేళ్ల‌పాటు సినిమాల‌కు దూరంగా ఉన్న అబ్బాస్ ఇటీవ‌లే హ్యాపీరాజ్ అనే త‌మిళ  మూవీతో మ‌ళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టాడు. తాజాగా టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు. ఒకేసారి మూడు సినిమాలు అంగీక‌రించాడు. వెంక‌టేష్‌, అనిల్ రావిపూడి మ‌ల్టీస్టార‌ర్ మూవీ జ‌న‌వ‌రి 12 విడుద‌ల‌తో పాటు విజ‌య్ దేవ‌ర‌కొండ రౌడీ జ‌నార్ధ‌న, నీరో సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ విష‌యాన్ని ఓ ఇంట‌ర్వ్యూలో స్వ‌యంగా అబ్బాస్ ప్ర‌క‌టించాడు.

ఇఫిలో స్క్రీనింగ్‌....

ఈ మూడు సినిమాలో వ‌చ్చే ఏడాది థియేట‌ర్ల‌లోకి రాబోతున్నాయి. మ‌ల‌యాళంలో హాఫ్ పేరుతో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా చేస్తున్నాడు అబ్బాస్‌. ఇటీవల ఇఫిలో ఈ సినిమా స్క్రీనింగ్ అయ్యింది.

 

Advertisement
Advertisement