KTR | జై తెలంగాణ అని నినదిస్తే.. బానిసల గుండెలు అదరాలి
KTR | ఇవాళ తెలంగాణకు జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా అనలేని బానిసలు నాయకత్వం వహిస్తున్నారు.. ఆ బానిసల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వందలాది మంది ప్రాణాలను బలితీసుకున్న ద్రోహులకు దడ పుట్టాలని ఆయన అన్నారు.
అలుగునూరు చౌరస్తాలో దీక్షా దివస్‌లో కేటీఆర్ వ్యాఖ్య
KTR | త్రినేత్ర న్యూస్ : ఇవాళ తెలంగాణకు జై తెలంగాణ అని మనస్ఫూర్తిగా అనలేని బానిసలు నాయకత్వం వహిస్తున్నారు.. ఆ బానిసల గుండెలు అదిరేలా జై తెలంగాణ అని నినదించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. వందలాది మంది ప్రాణాలను బలితీసుకున్న ద్రోహులకు దడ పుట్టాలని ఆయన అన్నారు. దీక్షా దివస్ సందర్భంగా అలుగునూరు చౌరస్తాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
పోటెత్తిన పోరు బిడ్డలకు ఉద్యమాభి వందనాలు.. ఈ జిల్లాలు మమూలు జిల్లా కాదు.. ఇది సింహగర్జన చేసిన కొదమ సింహాల జిల్లా. ఉద్యమానికి ఊపిరి వదిలిన ఖిల్లా. ప్రతి ఏడాది దసరా చేసుకుంటాం. దసరాకు ప్రత్యేకత ఉంది. ఆ విధంగా తెలంగాణ ఉద్యమానికి ఒక కథ ఉంది. పాముల కోరలు పీకిన చీమలదండు కథ ఇది.. గద్దల తలలు నరికిన కాకుల కథ ఇది.. మదపుటేనుగులను బంధించిన గడ్డిపోచల కథ ఇది.. ఒక బక్కపలచని యోథుడు తన జాతి బానిస సంకెళ్లు తెంచిన కథ ఇది. పుడమికే పూనకాలు తెప్పించే భూమి పుత్రుల ఉద్యమ కథ ఇది. శిథిలాల నుంచి శిఖరాలను అధిరోహించిన అద్భుత కథ మన తెలంగాణ జాతి కథ. ఇది మమూలు కథ కాదు అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో.. ఆ నినాదం నిప్పు రవ్వ అయింది..
మరి మన దగ్గరున్న ఆయుధం తెలంగాణ ఆత్మహగౌరవం, పౌరుషం. ఆ పౌరుషాన్ని పదునుపెట్టడానికే ఈ దీక్ష దివస్. తెలంగాణకు ఊపిరి ఇచ్చిన రోజు. ఆ రోజు ఇదే కరీంనగర్ గడ్డపై అగ్నిపర్వతం బద్ధలైంది. భూకంపం పుట్టించారు. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే నినాదం నిప్పు రవ్వ అయింది. నా గుండెల నిండా కొంత సంతోషం, బాధ, ఉద్వేగం ఉన్నది. నవంబర్ 28న 2009లో దినమంతా అయ్యప్ప స్వాములు వస్తే పడిపూజ చేసినం తెలంగాణ భవన్‌లో. ఆ తర్వాత ఆశీర్వదించారు.. మీ సంకల్పం నెరవేరుతదని చెప్పారని కేటీఆర్ గుర్తు చేశారు.
ఆ రోజురాత్రి నిద్ర లేదు ఎవ్వరికి..
ఇక ఆ రోజు రాత్రి కేసీఆర్‌ను అరెస్టు చేస్తారు దీక్షకు పోనివ్వరు అని వార్తలు వచ్చాయి. ఆ రోజురాత్రి నిద్ర లేదు ఎవ్వరికి.. తీగలగుట్టపల్లిలో వెయ్యి మంది మేల్కోనే ఉన్నారు. 400 కార్లలో దీక్ష స్థలి ఉన్న సిద్దిపేట వైపు వెళ్తున్నాం.. వందల మంది పోలీసులు బయల్దేరారు. పోతుంటే పోలీసోళ్లు మొత్తానికి కేసీఆర్‌ను రాంగ్‌రూట్‌లో మళ్లించారు. మేం కూడా ఫాలో అయ్యాం కానీ బారికేడ్లతో మమ్మల్ని ఆపేశారు. అలుగునూరు చౌరస్తా వద్ద కేసీఆర్ కారు ఆపేసి అరెస్టు చేస్తున్నామని చెప్పారు. అరెస్టు చేస్తామంటే ఎలా.. రాష్ట్రపతికి, ప్రధానికి, తెలంగాణ దోకా గురించి లోకమంతా చెప్పిన.. గాంధేయ పద్ధతిలో నిరాహార దీక్ష చేస్తామంటే ఎట్ల ఆపుతారని రోడ్డు మీదనే బైఠాయించారు. నేను ఉరుక్కుంట వచ్చేలోపు కేసీఆర్‌ను అరెస్టు చేసి తీసుకుని పోతున్నారు. జయశంకర్ సార్ మిగిలిపోయిండు. కేసీఆర్ వెంటనే మేం పోయినం వరంగల్ వైపు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ వలవల ఏడ్చిండు
ఆ పదకొండు రోజులు ప్రజాస్వామిక ఉద్యమాల చరిత్రలో ఉజ్వలమైన సన్నివేశాలు అవి. ముక్కోటి గొంతుకలు ఒక్కటై నాలుగు దిక్కులు ఏకమై పంచభూతాలు పంతం పట్టి ప్రభంజమైంది పోరాటం. మహారుషిలా తప్పస్సు చేస్తుంటూ అగ్ని గుండమై భగభగమండింది. యూనివర్సిటీలు యుద్ధ భూములయ్యాయి. రైతులు, విద్యార్థులు, లాయర్లు, డాక్టర్లు, కార్మికులు, ఉద్యోగులు, ఆడబిడ్డలు ఎన్నారైలతో సహా ఉద్యమించారు. మా తెలంగాణ మాకు ఇస్తావా లేదా అని.. బరిగీసి కొట్లాడారు. స్వరాష్ట్ర పోరాటాన్ని కేసీఆర్ నాయకత్వంలో చూశాం. ఉద్యమం పతాకశీర్షికకు పోయింది. శ్రీకాంతాచారి అమరుడయ్యాడు. కానిస్టేబుల్ కిష్టయ్య బలిదానం చూసి కేసీఆర్ వలవల ఏడ్చిండు. పిల్లలు చావొద్దని కేసీఆర్ బతిమిలాడిండు. మీరు సచ్చిపోతే తెలంగాణ ఆగమైతది.. ప్రజలు మేల్కొన్నారని చెబితే.. నా దీక్ష విరమించను అని కేసీఆర్ మొండి ప్రతిజ్ఞ చేశారు అని కేటీఆర్ తెలిపారు.
మీ నాన్న బ్రెయిన్ డెడ్ అయితడు.. 24 గంటల్లో..
నిమ్స్‌లో నా దగ్గరకు ఓ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వచ్చి.. మీ నాన్న బ్రెయిన్ డెడ్ అయితడు.. 24 గంటల్లో.. ఢిల్లీలో ఎవడు పట్టించుకోవడం లేదు.. 48 గంటల్లో చనిపోతడు అని బెదిరించిండు నేను షాక్ అయిన. కేసీఆర్ మొండివాడు ఆయన వినడు అని పక్కు పోయినా.. మా అమ్మ దగ్గరకు వెళ్లి మీ భర్త పోతడు మీ పిల్లలు అనాథలైతరు అని చెప్పిండు. నేను సచ్చిన సరే వెనక్కితగ్గను అని చావునోట్లో తలపెట్టి ఆ సత్యగ్రహాన్ని 11 రోజుల పాటు నడిపించిండు కేసీఆర్. ఢిల్లీ దిగివచ్చింది. డిసెంబర్ 9 అర్ధరాత్రి చిందంబరం ప్రకటన చదువుతుంటే ఉద్వేగం కనిపించింది. కేసీఆర్ నిరాహార దీక్ష వల్ల తెలంగాణకు ఊపిరి వచ్చింది. ఐదు దశాబ్దాల పాటు పోరాడిన తెలంగాణకు తొలిసారి ఒక్క విజయం లభించింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Home Guard Suicide | రైల్వే ట్రాక్‌పై ఛత్రినాక హోంగార్డు ఆత్మహత్య.. మూడు ముక్కలైన బాడీ.. ఈ ఘోరం ఎలా జరిగిందంటే!
నవంబర్ 29, 2026

Sonia Gandhi Movie | సోనియా సినిమాకు దర్శకుడిని ఎంపిక చేసిన జగ్గారెడ్డి.. ఆయన ఎవరంటే!
నవంబర్ 29, 2026

MLA Jagadish Reddy | కేసీఆర్ లేకపోతే తెలంగాణ రాష్ట్రమే లేదు..
నవంబర్ 29, 2026
తాజావార్తలు
- ●Delimitation Bill 2026 | స్టాలిన్‌తో సోనియా, రాహుల్, మమత కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ
- ●CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో సానియా మీర్జా భేటీ
- ●Shah Rukh Khan | నిమిషానికి యాభై లక్షల సంపాదన.. షారుఖ్ రేంజ్ వేరే లెవెల్
- ●Hemant Soren | కాంగ్రెస్‌కు మరో కోలుకోలేని దెబ్బ.. డీఎంకే బాటలోనే హేమంత్ సొరెన్? ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది?
- ●Sreeleela | ఫ్లాపుల ఎఫెక్ట్ - తెలుగు సినిమా కోసం రెమ్యూనరేషన్ సగానికి తగ్గించిన శ్రీలీల
- ●Mandya Girl Suicide | మావాన్ని ప్రేమించి పెళ్లి చేసుకోకుంటే బతకవ్.. బాలికకు స్నేహితుల వార్నింగ్.. తర్వాత ఏం చేశారంటే!

Delimitation Bill 2026 | స్టాలిన్‌తో సోనియా, రాహుల్, మమత కీలక భేటీ.. డీలిమిటేషన్ బిల్లుపై ఉత్కంఠ

CM Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డితో సానియా మీర్జా భేటీ

Shah Rukh Khan | నిమిషానికి యాభై లక్షల సంపాదన.. షారుఖ్ రేంజ్ వేరే లెవెల్

Hemant Soren | కాంగ్రెస్‌కు మరో కోలుకోలేని దెబ్బ.. డీఎంకే బాటలోనే హేమంత్ సొరెన్? ఇండియా కూటమిలో ఏం జరుగుతోంది?



