ACB Trap | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన గాంధీనగర్ ఎస్ఐ
ACB Trap | స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవంటూ ఓ కేసులో రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Flash news | Published On Jun 23, 2026, 7.43 pm IST
ACB Trap | స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో ఎలాంటి వేధింపులు ఉండవంటూ ఓ కేసులో రూ.లక్ష లంచం డిమాండ్ చేసిన గాంధీనగర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐని అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి నుంచి తొలి విడతగా రూ.50 వేల లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు వల పన్ని అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌లో సబ్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నవీ నర్సింహులు ఓ కేసులో ఫిర్యాదుదారుడికి స్టేషన్ బెయిల్ మంజూరు చేయడంతో పాటు భవిష్యత్తులో ఇబ్బందులు కలగకుండా చూస్తానంటూ రూ.లక్ష డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
ఫిర్యాదు మేరకు పక్కా ప్రణాళిక రూపొందించిన ఏసీబీ సిటీ రేంజ్-1 అధికారులు మంగళవారం సాయంత్రం వలవేసి పట్టుకున్నారు. ఈ క్రమంలో ఎస్ఐ నర్సింహులు ఫిర్యాదుదారుడి నుంచి తొలి విడతగా రూ.50వేల నగదు స్వీకరిస్తుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆయన వద్ద నుంచి లంచం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. విధి నిర్వహణలో అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమ లబ్ధి పొందేందుకు ప్రయత్నించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి నాంపల్లిలోని ప్రత్యేక ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నట్లు వెల్లడించారు. కేసుకు సంబంధించిన దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారుడి వివరాలను గోప్యంగా ఉంచినట్లు ఏసీబీ పేర్కొంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేసినా వెంటనే ఏసీబీ టోల్‌ఫ్రీ నంబర్ 1064కు సమాచారం అందించాలని ప్రజలకు సూచించింది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Trisha | స్పెషల్ ఫొటోతో సీఎం విజయ్‌కి విషెస్ చెప్పిన త్రిష - బ్రేకప్ రూమర్లపై చెన్నై క్వీన్ రియాక్షన్ అదుర్స్
- ●Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి
- ●Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?
- ●Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు
- ●Ketan Agarwal Murder Case | అవును.. నేనే లోయలోకి తోసి చంపేశా.. తప్పు ఒప్పుకున్న పుణే యువతి సియా
- ●Himayat Sagar | హిమాయత్ సాగర్‌కు పోటెత్తిన వరద.. అప్రమత్తమైన జలమండలి

Trisha | స్పెషల్ ఫొటోతో సీఎం విజయ్‌కి విషెస్ చెప్పిన త్రిష - బ్రేకప్ రూమర్లపై చెన్నై క్వీన్ రియాక్షన్ అదుర్స్

Telangana Secretariat Job Fraud | సచివాలయంలో జాబ్.. 'తెల్ల చొక్కా'తో వస్తేనే ఇంటర్వ్యూ! ఎస్పీఎఫ్ పోలీసులకు అడ్డంగా బుక్కైన నకిలీ అధికారి

Samantha | సమంత మాస్ ర్యాంపేజ్ - యాభై కోట్ల క్లబ్లో మా ఇంటి బంగారం - నాలుగు రోజుల్లో వచ్చిన లాభాలు ఎంతంటే?

Harish Rao | మళ్లీ సీఎంగా కేసీఆర్‌నే ప్రజలు కోరుకుంటున్న : హరీశ్‌రావు






