త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samantha | స‌మంత మాస్ ర్యాంపేజ్ – యాభై కోట్ల క్ల‌బ్‌లో మా ఇంటి బంగారం – నాలుగు రోజుల్లో వ‌చ్చిన లాభాలు ఎంతంటే?

మా ఇంటి బంగారం మూవీతో స‌మంత జాక్‌పాట్ కొట్టేసింది. నాలుగు రోజుల్లోనే ఈ క్రైమ్ కామెడీ మూవీ యాభై కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్మాత‌ల‌కు మా ఇంటి బంగారం 12 కోట్ల‌కుపైగా లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

N

Entertainment | Published On Jun 23, 2026, 8.12 pm IST

Samantha | స‌మంత మాస్ ర్యాంపేజ్ – యాభై కోట్ల క్ల‌బ్‌లో మా ఇంటి బంగారం – నాలుగు రోజుల్లో వ‌చ్చిన లాభాలు ఎంతంటే?
Advertisement

Samantha | స‌మంత మా ఇంటి బంగారం బాక్సాఫీస్ వ‌ద్ద కాసుల వ‌ర్షం కురిపిస్తోంది. రిలీజైన నాలుగు రోజుల్లోనే యాభై కోట్ల క్ల‌బ్‌లోకి అడుగుపెట్టింది. తెలుగులో వ‌చ్చిన‌ లేడీ ఓరియెంటెడ్ మూవీస్‌లో హ‌య్యెస్ట్ ఓపెనింగ్స్ రాబ‌ట్టిన సినిమాగా స‌రికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ప‌దిన్న‌ర కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో రిలీజైన ఈ సినిమా రెండు రోజుల్లోనే ప్రాఫిట్స్‌లోకి అడుగుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు నిర్మాత‌ల‌కు 12 కోట్ల‌కుపైగా లాభాల‌ను తెచ్చిపెట్టిన‌ట్లు ట్రేడ్ వ‌ర్గాలు చెబుతోన్నాయి.

కొత్త రిలీజ్‌లు లేవు...

సోమ‌వారం రోజు కూడా మా ఇంటి బంగారం భారీగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. వ‌ర‌ల్డ్ వైడ్‌గా 5.60 కోట్ల గ్రాస్‌...2.67 కోట్ల‌కుపైగా షేర్ క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. రిలీజ్ రోజుతో స‌మానంగా నాలుగో రోజు వ‌సూళ్ల‌ను సాధించింది. ఈ వారం కొత్త రిలీజ్‌లు లేక‌పోవ‌డం స‌మంత సినిమాకు మ‌రింత క‌లిసి వ‌చ్చే అవ‌కాశం క‌నిపిస్తోంది. మ‌రో వారం ప‌ది రోజుల వ‌ర‌కు మా ఇంటి బంగారానికి పెద్ద‌గా పోటీ ఉండ‌క‌పోవ‌చ్చు. దాంతో థియేట్రిక‌ల్ ర‌న్‌లోనే ఇర‌వై నుంచి ఇర‌వై ఐదు కోట్ల వ‌ర‌కు స‌మంత‌, రాజ్ నిడిమోరుల‌కు ఈ సినిమా లాభాల‌ను తెచ్చిపెట్టే అవ‌కాశం ఉంద‌ని ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నా వేస్తోన్నాయి.ఇప్ప‌టికే ఓటీటీ హ‌క్కుల రూపంలో భారీగానే గిట్టుబాటు అయ్యింది. మొత్తానికి మా ఇంటి బంగారంతో స‌మంత జాక్‌పాట్ కొట్టింద‌ని చెబుతున్నారు.

న‌క్స‌లైట్‌గా...

చిత్తూరు బ్యాక్‌డ్రాప్‌లో క్రైమ్ కామెడీగారూపొందిన మా ఇంటి బంగారం సినిమాకు నందిని రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది. దిగంత్‌, గుల్ష‌న్ దేవ‌య్య, శ్రీముఖి కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ సినిమాలో న‌క్స‌లైట్‌గా, గొప్పింటి కోడ‌లిగా డిఫ‌రెంట్ వేరియేష‌న్స్‌తో కూడిన పాత్ర‌లో చ‌క్క‌టి న‌ట‌న‌ను క‌న‌బ‌రిచింది స‌మంత‌. స‌మంత‌పై వ‌చ్చిన యాక్ష‌న్ ఎపిసోడ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ సినిమాకు సంతోష్ నారాయ‌ణ‌న్ మ్యూజిక్ అందించాడు. భ‌ర్త రాజ్ నిడిమోరుతో క‌లిసి స‌మంత మా ఇంటి బంగారం సినిమాను నిర్మించింది.

 

Advertisement
Advertisement