త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Suicide | చిట్టి డ‌బ్బుల విష‌యంలో గొడ‌వ‌.. పిల్ల‌ల‌తో క‌లిసి బావిలో దూకిన తల్లి

Suicide | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండ‌గ వేళ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. చిట్టి డ‌బ్బుల విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముగ్గురి నిండు ప్రాణాల మీద‌కు తెచ్చింది.

S

Telangana | Published On Oct 10, 2026, 7.17 pm IST

Suicide | చిట్టి డ‌బ్బుల విష‌యంలో గొడ‌వ‌.. పిల్ల‌ల‌తో క‌లిసి బావిలో దూకిన తల్లి
Advertisement
  • క్ష‌ణికావేశంలో ముగ్గురి నిండు ప్రాణాలు బ‌లి
  • పండ‌గ వేళ మ‌హ‌బూబాబాద్ జిల్లాలో విషాద ఛాయ‌లు

Suicide | త్రినేత్ర న్యూస్‌: బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండ‌గ వేళ మహబూబాబాద్ జిల్లాలో తీవ్ర‌ విషాదం చోటుచేసుకుంది. చిట్టి డ‌బ్బుల విష‌యంలో భార్యాభ‌ర్త‌ల మ‌ధ్య త‌లెత్తిన వివాదం ముగ్గురి నిండు ప్రాణాల మీద‌కు తెచ్చింది. క్ష‌ణికావేశంలో ఇద్ద‌రు పిల్ల‌ల‌తో క‌లిసి భార్య వ్య‌వ‌సాయ బావిలో దూకి ఆత్మహత్య‌కు ఒడిగ‌ట్టింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోవ‌డంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

వివ‌రాల్లోకి వెళ్తే.. మహబూబాబాద్ జిల్లా కురవి మండ‌లం లింగ్యాతండాకు చెందిన బానోత్ అనూష(35) కు త‌న భ‌ర్త‌తో ఓ చిట్టి డ‌బ్బుల విష‌యంలో గొడ‌వ‌లు జ‌రుగుతున్నాయి. శ‌నివారం మ‌రోసారి గొడ‌వ జ‌ర‌గ‌డంతో తీవ్ర మ‌న‌స్థాపానికి గురై క్ష‌నికావేశానికి లోనైంది. త‌న కుమారుడు విశాల్ కృష్ణ (9), కుమార్తె వ‌ర్షిణి (5)తో క‌లిసి వెళ్లి వ్య‌వ‌సాయ బావిలో దూకేసింది. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థలానికి చేరుకొని మృత‌దేహాల‌ను బ‌య‌ట‌కు తీసేందుకు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని పూర్తి వివ‌రాల కోసం ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు.

బ‌తుక‌మ్మ పండ‌గ సంద‌ర్భంగా ఆ ఇంట ఆనందాలు వెల్లివిరియాల్సిన వేళ.. ఇలా విషాదం జ‌ర‌గడంతో జీర్ణించుకోలేక‌పోతున్నామ‌ని బంధువులు, గ్రామ‌స్థులు తీవ్ర‌ ఆవేద‌న వెలిబుచ్చారు. ఒక్క క్ష‌ణం ఆలోచించి పుట్టింటికి వెళ్లిపోయినా ముగ్గురు బ‌తికి బ‌య‌ట‌ప‌డేవార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా ఇలా ప్రాణాలు తీసుకోవ‌ద్ద‌ని.. ఆలోచిస్తే స‌మ‌స్య‌కు ప‌రిష్కారం దొరుకుతుంద‌ని పేర్కొంటున్నారు.

Advertisement
Advertisement