త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Congress Party | 12న కాంగ్రెస్ మ‌హా నిర‌స‌న‌.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు పిలుపు

Congress Party | స‌ర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పోరుబాట పట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇండియా కూట‌మి( INDIA Bloc ) ఆధ్వ‌ర్యంలో మ‌రో భారీ నిర‌స‌న‌కు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది.

S

Telangana | Published On Oct 10, 2026, 7.20 pm IST

Congress Party | 12న కాంగ్రెస్ మ‌హా నిర‌స‌న‌.. ఢిల్లీకి రావాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల‌కు పిలుపు
Advertisement

Congress Party | త్రినేత్ర న్యూస్ : స‌ర్‌కు వ్య‌తిరేకంగా కాంగ్రెస్ పార్టీ( Congress Party ) పోరుబాట పట్టిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఇండియా కూట‌మి( INDIA Bloc ) ఆధ్వ‌ర్యంలో మ‌రో భారీ నిర‌స‌న‌కు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మైంది. అక్టోబ‌ర్ 12న ఢిల్లీ వేదిక‌గా కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీరును ఎండ‌గ‌డుతూ ఆందోళ‌న చేయాల‌ని నిర్ణ‌యించింది. ఈ నేప‌థ్యంలో ఏఐసీసీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కేసీ వేణుగోపాల్ తెలంగాణ‌ కాంగ్రెస్ నాయ‌క‌త్వానికి కీల‌క ఆదేశాలు జారీ చేశారు.

అక్టోబ‌ర్ 11 రాత్రి లేదా 12వ తేదీ ఉద‌యానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ, సీడీసీసీ అధ్య‌క్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, సీనియ‌ర్ నేత‌లంద‌రూ ఢిల్లీకి రావాల‌ని పిలుపునిచ్చారు. ఈ మేర‌కు టీ పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేశ్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ ప్ర‌జాప్ర‌తినిధుల‌కు సూచ‌న చేశారు. ఈ పిలుపును అత్యంత ప్రాధాన్య‌త అంశంగా ప‌రిగ‌ణించాల‌ని పీసీసీ చీఫ్ విజ్ఞ‌ప్తి చేశారు.

Advertisement
Advertisement