త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Virat Kohli | వడోదర వన్డేలో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌.. సనత్‌ జయసూర్య రికార్డుకు చేరువగా..!

Virat Kohli | వడోదర వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత ఘన విజయం సాధించింది. ఆరు వికెట్లు నష్టపోయి మరో ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు.

P

Sports | Published On Jan 13, 2026, 10.05 pm IST

Virat Kohli | వడోదర వన్డేలో రికార్డులు బద్దలు కొట్టిన విరాట్‌.. సనత్‌ జయసూర్య రికార్డుకు చేరువగా..!
Advertisement

Virat Kohli | వడోదర వేదికగా భారత్‌-న్యూజిలాండ్‌ మధ్య మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భాగంగా తొలి వన్డేలో భారత ఘన విజయం సాధించింది. ఆరు వికెట్లు నష్టపోయి మరో ఓవర్‌ మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా విజయంలో సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ విరాట్‌ కోహ్లీ కీలకపాత్ర పోషించాడు. 91 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఓ సిక్సర్‌ సహాయంతో 93 పరుగులు చేశాడు. దాంతో టీమిండియా మరోసారి 300 పరుగులకుపైగా టార్గెట్‌ను ఛేదించి మ్యాచ్‌లో నెగ్గింది. 300 ప్లస్‌ రన్స్‌ టార్గెట్‌ చేధనలో ప్రపంచంలోనే నమ్మకమైన బ్యాట్స్‌మెన్‌గా విరాట్‌ మరోసారి నిరూపించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియాను విజయపథంలో నడిపించడంతో పాటు తన పేరిట మరో రికార్డును నమోదు చేసుకున్నాడు.

సనత్‌ జయసూర్య రికార్డుకు చేరువగా..

వన్డే క్రికెట్‌లో 300+ పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం కష్టమైందే. కానీ, విరాట్‌ కోహ్లీ అరుదైన ఈ విభాగంలో అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌పై 93 పరుగుల ఇన్నింగ్స్‌తో సరికొత్త రికార్డును నెలకొల్పాడు. 300 ప్లస్‌ పరుగుల లక్ష్య చేధనలో 12 ఇన్నింగ్స్‌లో 1091 పరుగులు చేశాడు. ఇందులో ఏడు సెంచరీలు, రెండు హాఫ్‌ సెంచరీలున్నాయి. 121.22 సగటు, 125 స్ట్రయిక్‌ రేట్‌తో పరుగులు సాధించి ప్రత్యేక జాబితాలో నిలిచాడు. ఈ మ్యాచ్‌లో అద్భుతమైన బ్యాటింగ్‌తో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డును అందుకున్నాడు. అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డులు అందుకున్న మూడో ఆటగాడిగా నిలిచాడు. ప్రస్తుతం ఈ జాబితాలో దిగ్గజ బ్యాట్‌మెన్స్‌ సచిన్‌ టెండూల్కర్‌ సనత్‌ జయసూర్య ముందున్నారు. ప్రస్తుతం కోహ్లీ 45 అవార్డులతో అత్యధిక ప్లేయర్‌ ఆఫ్‌ ది అందుకున్న ప్లేయర్‌గా మూడో స్థానంలో ఉండగా.. 48 అవార్డులతో జయసూర్య ఉన్నాడు. జయసూర్య రికార్డుకు మూడు అవార్డుల దూరంలో ఉన్నాడు. ప్రస్తుతం విరాట్‌ ఫామ్‌ను చూస్తే త్వరలోనే ఈ రికార్డును సైతం బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఇక సచిన్‌ 62 అవార్డులతో ఎవరికీ అందనంత ఎత్తులో ఉన్నాడు.

వరుసగా 50 ప్లస్‌ స్కోర్‌ చేసిన ప్లేయర్‌గా..

విరాట్‌ బలం నిలకడగా పరుగులు సాధించడమే. న్యూజిలాండ్‌తో తొలి వన్డేలో మరో రికార్డును సైతం తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే క్రికెట్‌లో వరుసగా ఐదు, అంతకంటే ఎక్కువసార్లు 50 ప్లస్‌ స్కోర్‌ సాధించిన రికార్డు విరాట్‌ కోహ్లీ పేరిట ఉన్నది. క్వింటన్‌ డికాక్‌, విలియమ్సన్‌, బాబర్‌ వంటి ఆటగాళ్లు రెండుసార్లు మాత్రమే ఈ ఘనతను సాధించారు. ఐదుకంటే ఎక్కువ సార్లు వరుసగా హాఫ్‌ సెంచరీలు సాధించడం విరాట్‌ నిలకడగా బ్యాటింగ్‌ చేయడాన్ని స్పష్టం చేస్తుంది. విరాట్‌ ఆడిన ఇన్నింగ్స్‌తో టీమిండియా ఓ రికార్డును సాధించింది. వన్డేల్లో అత్యధికంగా 20 సార్లు 300 ప్లస్‌ స్కోర్‌ను ఛేజ్‌ చేసిన జట్టుగా ఘనత సాధించింది. ఇంగ్లండ్‌ (15), ఆస్ట్రేలియా (14) జట్లు ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారత జట్టు మిడిలార్డర్‌లో స్థిరత్వం, నిలకడగా రాణించడమే దానికి ప్రధాన కారణం.

న్యూజిలాండ్‌ విజయాలకు బ్రేక్‌..

గతేడాది చాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత జరిగిన వన్డేల్లో న్యూజిలాండ్‌ వరుసగా తొమ్మిది మ్యాచులు గెలిచింది. అయితే, ఈ విజయ యాత్రకు భారత్‌ బ్రేకులు వేసింది. 2023 నుంచి భారత జట్టు కివీస్‌పై నిలకడగా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఇది న్యూజిలాండ్‌పై భారత్‌కు వరుసగా ఎనిమిదో వన్డే విజయం కావడం విశేషం. స్వదేశంలో 2017 నుంచి న్యూజిలాండ్‌పై భారత్ వరుసగా ఎనిమిది వన్డేలలో ఓటమి లేకుండా వరుస విజయాలతో దూసుకెళ్తోంది. ఇక న్యూజిలాండ్‌పై భారత్ సాధించిన రెండో అత్యధిక విజయవంతమైన ఛేజింగ్. ఇంతకుముందు 2010లో బెంగళూరులో భారత్ సాధించిన 316 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement