లోడ్ అవుతోంది...


Raja Saab Leaked | ఐ బొమ్మకు అడ్డుకట్ట వేసిన సినిమాల పైరసీ మాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రభాస్ రాజాసాబ్ మూవీ పైరసీ బారిన పడింది. థియేటర్లలో రిలీజై మూడు రోజులు కూడా కాకముందే ఈ సినిమా హెచ్‌డీ ప్రింట్ ఆన్‌లైన్‌లో లీకయ్యింది.లీక్‌డ్ ప్రింట్‌ను ఏకంగా ఓ రెస్టారెంట్‌లో ఓపెన్‌గానే స్క్రీనింగ్ చేశారు. అమెరికాలోని ఒహియో రాష్ట్రంలోని డబ్లిన్ నగరంలోని ఓ నార్త్ ఇండియన్ రెస్టారెంట్‌లో రాజాసాబ్ పైరసీ ప్రింట్‌ను టీవీలో వేసి మరి కస్టమర్లకు చూపించింది.ఈ సినిమా లీక్‌డ్ ప్రింట్‌ను రెస్టారెంట్‌లో స్క్రీనింగ్ చేస్తున్న వీడియోను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రాజాసాబ్ పైరసీపై ప్రభాస్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. పైరసీ చేయడమే తప్పు అంటే ఇలా బహిరంగంగా ప్రదర్శించడం ఇంకా దారుణమని అంటున్నారు. రెస్టారెంట్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పైరసీని అడ్డుకోవడంలో మేకర్స్ విఫలమయ్యారంటూ నిర్మాణ సంస్థను సైతం ట్రోల్ చేస్తున్నారు.
పైరసీకి పాల్పడుతూ టాలీవుడ్‌కు వందల కోట్ల నష్టం కలిగిస్తున్న ఐ బొమ్మ రవిని ఇటీవల పోలీసులు అరెస్ట్ చేశారు. రవి అరెస్ట్ అయినా పైరసీ మాత్రం ఆగడం లేదు. రాజాసాబ్‌తో పాటు ఇటీవల రిలీజైన మరికొన్ని సినిమాలు కూడా పైరసీకి గురయ్యాయి.
ప్రభాస్ రాజాసాబ్ మూవీ సంక్రాంతి కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్ కామెడీ కథాంశంతో రూపొందిన ఈ మూవీ మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నిధి అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు 400 కోట్ల బడ్జెట్‌తో టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు.
🚨 SHOCKING PIRACY
A restaurant in Ohio was caught streaming a pirated print of #TheRajaSaab on Day 1 in the USA.
It’s theft that kills overseas revenues and sabotages films from the inside.
Piracy = slow death of cinema. 🎬#TheRajaSaab #Prabhas pic.twitter.com/dQspCt1ghE
— Rathnam News (@RathnamNews) January 10, 2026

జనవరి 12, 2026

జనవరి 11, 2026

జనవరి 10, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam