Minister Srinivas Goud | సమ్మర్ వస్తున్నది..సరిపడా బీర్లు కావాలంట: శ్రీనివాస్ గౌడ్
Minister Srinivas Goud | ‘ఎండాకాలం వస్తుంది. మూడు నెలల సమయం మాత్రమే ఉంది. డిమాండ్ బాగా ఉంటుంది. బీర్ల స్టాక్‌ను ఎక్కువగా పెంచండి. అందుకు కావాల్సి ముడి సరుకు ఉందా?’ అంటూ డిస్టిలరీల కంపెనీలకు చెందిన గోడౌన్ల వద్దకు అధికారులే వెళ్లడం విడ్డూరంగా ఉంది. - మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్
సంక్షిప్త సారాంశం
ప్రభుత్వ అధికారులే స్వయంగా బీర్ల తయారీ కంపెనీలకు వెళ్లి స్టాక్ పెంచాలని అనడం.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తే.. బహుశా ఇదే మొదటి సారి అవుతుంది. ఇలాంటి సందర్భాలు కూడా గతంలో జరిగినట్టు నాకు ఎక్కడా కనబడలేదు. కాంగ్రెస్ సర్కారు ...అధికారులను పంపి, బీర్లకు, విస్కీ బాగా తయారు చేయండని చెబుతున్నది
తెలంగాణలో ఇదో విచిత్రం
అధికారులే కంపెనీలకు వెళ్లి స్టాక్ పెంచాలని చెబుతున్నారు
ఈ మాత్రం శ్రద్ధ రైతులపై పెడితే బావుండేది
Minister Srinivas Goud | ‘ఎండాకాలం వస్తుంది. మూడు నెలల సమయం మాత్రమే ఉంది. డిమాండ్ బాగా ఉంటుంది. బీర్ల స్టాక్‌ను ఎక్కువగా పెంచండి. అందుకు కావాల్సి ముడి సరుకు ఉందా?’ అంటూ డిస్టిలరీ కంపెనీలు చెందిన గోడౌన్లను సందర్శించిన ఎక్సైస్ శాఖ ఉన్నతాధికారులు తీరు విడ్డూరంగా ఉందని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులే స్వయంగా బీర్ల తయారీ కంపెనీలకు వెళ్లి స్టాక్ పెంచాలని అనడం.. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి చూస్తే.. బహుశా ఇదే మొదటి సారి అవుతుందన్నారు. ఇలాంటి సందర్భాలు కూడా గతంలో జరిగినట్టు తనకు ఎక్కడా కనబడలేదన్నారు. కాంగ్రెస్ సర్కారు అధికారులను పంపి, బీర్లకు, విస్కీ బాగా తయారు చేయండని చెబుతున్నారు కానీ, ఒక పక్క వర్షాలు బాగా పడడం గురించి, పంటలకు కావాల్సి యూరియా గురించి కానీ, దాన్యం కోసం కావాల్సిన బస్తాలు అందుబాటులో ఉంచడంపై కాంగ్రెస్ సర్కారు దృష్టి పెడితే బాగుండేదన్నారు. రైతులకు కావాల్సిన యూరియాపై, పేద పిల్లలు చదువుకుంటున్న గురుకుల హాస్టళ్లను సందర్శించకుండా, వర్షాలు పడుతుంటే జూరాల వంటి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ఫ్లో అంచనాలు వేయకుండా, సర్కారు చోద్యం చూస్తుందని మండిపడ్డారు.
అధిక ధరలకు మద్యం విక్రయాలు..
రాష్ట్రంలో మరో పక్క ఖమ్మం, కొత్తగూడెం, గద్వాల, వరంగల్ అర్భన్, వరంగల్ రూరల్ వంటి పలు జిల్లాలలో ఎంఆర్‌పీ ధరల కంటే ఎక్కువ మొత్తంలో మద్యం విక్రయాలు జరుగుతున్నా.. ఈ సర్కారు పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బెల్టు షాపులలో, కల్తీ మద్యం ఏరులై పారుతున్నా, అంతర్రాష్ట్రాలకు చెందిన మద్యం విక్రయాలు జోరుగా జరుగుతున్నా.. పట్టించుకోని కాంగ్రెస్ ప్రభుత్వం, బీర్లు, బార్ల కోసం వెంపర్లాడుతున్నారని, కేవలం ఎక్సైస్ శాఖ ద్వారానే అధిక రాబడి కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వసతులు కొరవడినా, రోగులకు సరిపడా మందులు లభించకపోయినా, రాష్ట్రంలో వెల్‌నెస్ సెంటర్లు అయోమయంలో పడినా సర్కారుకు దృష్టి లేదని ఆరోపించారు.
నిబంధనలు ఉల్లంఘించినా పట్టింపు లేదు..
రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన మద్యం షాపులు నిబంధనలు ఉల్లంఘించినా, వైన్ షాపుల వాళ్లు జనతాబార్లు నడిపిస్తున్నా, వాటిని నియంత్రించకుండా సర్కారు నిర్లక్ష్యం చేస్తుందని విమర్శించారు. క్షేత్ర స్థాయిలో ఇతర శాఖ సమస్యల పరిష్కారం కోసం ఆయా శాఖ అధికారులను పంపి, అధ్యయనం చేపించాల్సిన కాంగ్రెస్ సర్కారు కేవలం, బీర్లు, విస్కిల స్టాక్‌ల పైనా దృష్టి పెట్టడం సిగ్గుచేటన్నారు. మిగతా ప్రజా సమస్యలు పరిష్కరించకపోయితే ఇక ఊరుకునేది లేదని ఈ సందర్భంగా మాజీ మంత్రి శ్రీనివాసగౌడ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సంబంధిత వార్తలు

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026

CM Revanth Reddy | కేటీఆర్ జడ్జి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఐవో.. బండి భగీరథ్ కేసుపై సీఎం రేవంత్ కామెంట్స్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



