లోడ్ అవుతోంది...


Raja Saab Collections | ప్రభాస్ రాజాసాబ్ సంక్రాంతి కానుకగా ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీకి మారుతి దర్శకత్వం వహించాడు. భారీ అంచనాల నడుమ థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. తొలి రోజు 112 కోట్లతో బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. కానీ నెగెటివ్ టాక్‌తో రెండో రోజు నుంచి కలెక్షన్స్ తగ్గుముఖం పడుతూ వచ్చాయి. మూడు రోజుల్లో వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా 183 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. అఫీషియల్ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో 14 కోట్ల వరకు గ్రాస్, ఎనిమిది కోట్లకుపైగా షేర్ కలెక్షన్స్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. ఇప్పటివరకు ఈ సినిమా 47 శాతం వరకు మాత్రమే రికవరీ సాధించింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 110 కోట్లకుపైనే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉందట. తొలిరోజుతో పోలిస్తే ఆదివారం రోజు డెబ్బై అయిదు శాతానికిపైగా కలెక్షన్స్ పడిపోయాయి.
సోమవారం రోజు మన శంకర వరప్రసాద్‌గారు రిలీజ్ అయ్యింది. చిరంజీవి సినిమా ఎఫెక్ట్ రాజాసాబ్‌పై గట్టిగానే పడనుందని అంటున్నారు. ఆదివారంతో పోలిస్తే సోమవారం ప్రభాస్ సినిమా కలెక్షన్స్ మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు. సోమవారం రోజు ఏపీలోని కొన్ని చోట్ల మార్నింగ్ షోకు ఆడియెన్స్ లేకపోవడంతో రాజాసాబ్ థియేటర్లను మన శంకర వరప్రసాద్‌కు కేటాయించినట్లు సమాచారం.
దాంతో రాజాసాబ్ బ్రేక్ ఈవెన్ కావడం అనుమానమేనని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. నిర్మాతలకు వంద కోట్ల వరకు ఈ సినిమా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
హారర్ ఫాంటసీగా డైరెక్టర్ మారుతి ఈ సినిమాను రూపొందించారు. కాన్సెప్ట్ బాగున్నా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ వర్కవుట్ కాకపోవడంతో సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రభాస్ లుక్ విషయంలో విమర్శలు వస్తున్నాయి.
రాజాసాబ్ మూవీలో మాళవికా మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. సంజయ్ దత్, జరీనా వహాబ్ కీలక పాత్రలు పోషించారు. తమన్ మ్యూజిక్ అందించాడు.

జనవరి 12, 2026

జనవరి 11, 2026

జనవరి 10, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam