త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ram Charan Peddi | హై ఫీవ‌ర్‌తో రై రై సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్న రామ్‌చ‌ర‌ణ్ – డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌

పెద్ది మూవీ నుంచి రై రై రారా సాంగ్‌ను సోమ‌వారం మేక‌ర్స్ రిలీజ్ చేశారు. ఈ పాట‌లో రామ్‌చ‌ర‌ణ్ స్టెప్పులు, ఆయ‌న గ్రేస్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. హై ఫీవ‌ర్‌తోనే ఈ సాంగ్ షూట్‌లో రామ్‌చ‌ర‌ణ్ పాల్గొన్నాడ‌ట‌. ఈ విష‌యాన్ని డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా స్వ‌యంగా వెల్ల‌డించాడు.

N

Entertainment | Published On Mar 3, 2026, 4.19 pm IST

Ram Charan Peddi | హై ఫీవ‌ర్‌తో రై రై సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్న రామ్‌చ‌ర‌ణ్ – డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్‌
Advertisement

Ram Charan Peddi |  మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోగా న‌టిస్తున్న లేటెస్ట్ మూవీ పెద్ది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన ప్ర‌మోష‌న‌ల్ కంటెంట్‌తో పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో పెద్దిపై భారీగా బ‌జ్ ఏర్ప‌డింది. పెద్ది నుంచి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ సింగిల్ చికిరి పెద్ద హిట్ట‌య్యింది. రెండు వంద‌ల మిలియ‌న్ల‌కుపైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది. తాజాగా పెద్ది నుంచి రై రై రారా అనే సెకండ్ సింగిల్‌ను మేక‌ర్స్ సోమ‌వారం రిలీజ్ చేశారు. ఈ పాట‌ను ఆస్కార్ విన్న‌ర్ ఏఆర్ రెహ‌మాన్ స్వ‌యంగా ఆల‌పించారు.  అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు. ప్ర‌స్తుతం ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. రైరై సాంగ్‌లో రామ్‌చ‌ర‌ణ్ డ్యాన్స్‌, ఆయ‌న గ్రేస్‌, స్టైల్‌కు ఫ్యాన్స్ ఫిదా అవుతోన్నారు. ఎంతో క‌ఠిన‌మైన డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను ఈ పాట‌లో చ‌ర‌ణ్ ఈజీగా చేసేశాడు.

చిరంజీవి ట్వీట్‌...

రై రై సాంగ్‌లో చ‌ర‌ణ్ డ్యాన్స్‌కు ఫ్యాన్స్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇంప్రెస్ అయ్యాడు. త‌న‌యుడిపై ప్ర‌శంస‌లు కురిపించారు. ఎన‌ర్జీ, ఎమోష‌న్‌తో పాటు సినిమాటిక్ బ్రిలియ‌న్స్ తో విజువ‌ల్ ఫీస్ట్‌లా రై రై పాట ఉందంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. పాట‌లోని స్టెప్పుల్లో రామ్‌చ‌ర‌ణ్ గ్రేస్‌, స్పీడు చూస్తుంటే గ‌ర్వంగా ఉందంటూ త‌న ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.

హై ఫీవ‌ర్‌తో...

చిరంజీవి ట్వీట్‌తో పెద్ది టీమ్ ఖుషి అవుతోంది. చిరంజీవి ట్వీట్‌పై డైరెక్ట‌ర్ బుచ్చిబాబు సానా రిప్లై ఇచ్చారు. హై ఫీవ‌ర్‌తోనే రామ్‌చ‌ర‌ణ్ రై రై సాంగ్ షూటింగ్‌లో పాల్గొన్న‌ట్లు చెప్పాడు. "ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. సాంగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు రామ్ చ‌ర‌ణ్‌కు హై ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్నారు. మేము షూటింగ్ ఆపేద్దామన్నా రామ్ చ‌ర‌ణ్ విన‌లేదు. "లేదు చేద్దాం” అన్నారు. అంత జ్వరం లో కూడా ముఖంపై చిరునవ్వుతో, ఎంతో గ్రేస్‌తో డాన్స్ చేశారు. ఆ డెడికేషన్, ఆ అటిట్యూడ్ అన్నీ మీ నుంచి వచ్చినవే సార్" అంటూ చిరంజీవి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు బుచ్చిబాబు సానా. డైరెక్ట‌ర్ ట్వీట్ వైర‌ల్ అవుతోంది.

జాన్వీక‌పూర్ హీరోయిన్‌...

పెద్ది మూవీలో జాన్వీక‌పూర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌న్న‌డ అగ్ర హీరో శివ‌రాజ్‌కుమార్‌తో పాటు జ‌గ‌ప‌తిబాబు, దివ్యేందు శ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. దాదాపు నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో వృద్ధి సినిమాస్‌తో క‌లిసి మైత్రీ మూవీ మేక‌ర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది.

 

 

 

Advertisement
Advertisement