త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dhurandhar 2 | షాకింగ్ ర‌న్‌టైమ్‌తో ధురంధ‌ర్ 2 రిలీజ్ – సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న మీమ్స్‌

బాలీవుడ్ మూవీ ధురంధ‌ర్ 2 ర‌న్‌టైమ్‌పై సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ వైర‌ల్ అవుతోన్నాయి. ఈ సినిమాను మూడు గంట‌ల న‌ల‌భై తొమ్మిది నిమిషాల ర‌న్‌టైమ్‌తో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఇండియాలోనే లాంగెస్ట్ ర‌న్‌టైమ్ మూవీస్‌లో ఒక‌టిగా ధురంధ‌ర్ 2 నిలిచింది.

N

Entertainment | Published On Mar 17, 2026, 5.33 pm IST

Dhurandhar 2 | షాకింగ్ ర‌న్‌టైమ్‌తో ధురంధ‌ర్ 2 రిలీజ్ – సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోన్న మీమ్స్‌
Advertisement

Dhurandhar 2 | ర‌ణ‌వీర్‌సింగ్ హీరోగా న‌టించిన బాలీవుడ్ మూవీ ధురంధ‌ర్ 2 పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో భారీ స్థాయిలో మార్చి 19న రిలీజ్ కాబోతుంది. ధురంధ‌ర్ మూవీకి సీక్వెల్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ మంగ‌ళ‌వారం నాటికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా 136 కోట్ల‌ను దాటాయి. ఇండియాలోనే హ‌య్యెస్ట్ అడ్వాన్స్ బుకింగ్స్ జ‌రిగిన సినిమాల్లో ఒక‌టిగా రికార్డ్ క్రియేట్ చేసింది. తొలిరోజు ఈ సినిమా ఇండియ‌న్ బాక్సాఫీస్ రికార్డుల‌న్నీ బ‌ద్ద‌లుకొట్ట‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు.

సెన్సార్ కంప్లీట్‌...

ధురంధ‌ర్ 2 సెన్సార్ పూర్త‌య్యింది. మూడు గంట‌ల న‌ల‌భై తొమ్మిది నిమిషాల ర‌న్‌టైమ్‌తో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇండియాలోనే లాంగెస్ట్ ర‌న్‌టైమ్ మూవీస్‌లో ఒక‌టిగా ప్రేక్ష‌క‌ల ముందుకొస్తోంది. కాగా ఈ సినిమా ర‌న్‌టైమ్‌పై సోష‌ల్ మీడియాలో ఫ‌న్నీ మీమ్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

ల‌గేజీతో...

నైట్ షో బుక్ చేసుకున్న‌వారంతా సూట్‌కేస్‌ల‌లో ల‌గేజీ, బెడ్‌షీట్‌ల‌తో థియేట‌ర్ల‌కు వెళుతోన్న‌ట్లుగా ఈ వీడియోల‌లో క‌నిపిస్తోంది. పాప్‌కార్న్‌, స్నాక్స్ పెద్ద పెద్ద డ‌బ్బాల‌లో ప్యాక్ చేసుకొని ఈ థియేట‌ర్‌కు వెళ్లాల్సిందేన‌ని ఓ యూజ‌ర్ కామెంట్ పెట్టాడు. నైట్ షో కంప్లీట్ చేసుకొని ఇంటికి వ‌చ్చే స‌రికి ఉద‌యం అవుతుంద‌ని మ‌రో నెటిజ‌న్ పేర్కొన్నారు. ఈ ఫ‌న్నీ మీమ్స్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి.

1400 కోట్ల క‌లెక్ష‌న్స్‌...

ధురంధ‌ర్ 2 మూవీకి ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. సంజ‌య్ ద‌త్‌, అర్జున్ రాంపాల్, మాధ‌వ‌న్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ సినిమాలో సారా అర్జున్ హీరోయిన్‌గా న‌టిస్తోంది.
ధురంధ‌ర్ పార్ట్ వ‌న్ మూవీ 1400 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. బాలీవుడ్ హిస్ట‌రీలోనే హ‌య్యెస్ట్ క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాగా నిలిచింది.
ఆప‌రేష‌న్ ధురంధ‌ర్ పేరుతో భార‌త ఇంటెలిజెన్స్ బ్యూరో చేప‌ట్టిన ఓ సీక్రెట్ మిష‌న్ నేప‌థ్యంలో స్పై యాక్ష‌న్ డ్రామాగా ద‌ర్శ‌కుడు ఆదిత్య ధ‌ర్ ఈ సినిమాను తెర‌కెక్కించారు. ధురంధ‌ర్‌లో హ‌మ్జా అనే క్యారెక్ట‌ర్‌లో ర‌ణ‌వీర్‌సింగ్ క‌నిపించారు. సీక్వెల్‌లో మాత్రం డ్యూయ‌ల్ షేడ్‌లో అత‌డి క్యారెక్ట‌ర్ ఉండ‌బోతున్న‌ట్లు ట్రైల‌ర్‌లో చూపించారు.

 

View this post on Instagram

 

A post shared by Selwyn D’souza (@sellydsouzaaa)

Advertisement

తాజావార్తలు

Advertisement