Prabhas | ప్రభాస్… ఓ లెజెండ్ – స్పిరిట్ సినిమాపై ధురంధర్ 2 డైరెక్టర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్
ప్రభాస్ స్పిరిట్ మూవీపై ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. స్పిరిట్ మూవీని థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రభాస్‌ను లెజెండ్‌గా పేర్కొంటూ ఆదిత్య ధర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Entertainment | Published On Apr 10, 2026, 6.48 pm IST
Prabhas | రణవీర్‌సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 2 మూవీ బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. ఇరవై రెండు రోజుల్లోనే 1680 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ధురంధర్ 2పై టాలీవుడ్ స్టార్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రణవీర్‌సింగ్ యాక్టింగ్, డైరెక్టర్ ఆదిత్య ధర్ టేకింగ్ అద్భుతమంటూ చెబుతోన్నారు. ఇటీవలే ధురంధర్ 2 మూవీని డైరెక్టర్ సందీప్ వంగాతో కలిసి రెబెల్ స్టార్ ప్రభాస్ వీక్షించారు. ధురంధర్ 2 ప్రాపగండా మూవీ అంటూ బాలీవుడ్ లో కొందరు చేస్తున్న విమర్శలపై డైరెక్టర్ సందీప్ వంగా సెటైరికల్‌గా పోస్ట్ పెట్టారు. ప్రాపగండా మూవీస్ చేసే వాళ్లే నిజాలను నిర్భయంగా చెప్పే ధురంధర్ 2 లాంటి సినిమాలపై విష ప్రచారం చేస్తుంటారని తన పోస్ట్‌లో సందీప్ వంగా పేర్కొన్నాడు.
ఆదిత్య ధర్ రియాక్షన్....
సందీప్ వంగా పోస్ట్‌పై ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ రియాక్ట్ అయ్యారు. "ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండే తీరు అంటే తనకు ఎంతో ఇష్టమంటూ సందీప్ వంగాను ఉద్దేశించి ఆదిత్య ధర్ పేర్కొన్నారు. వివాదాలు, నెగెటివిటీని పట్టించుకోకుండా నిజాయితీగా అనుకున్న కథలను చెప్పడమే కాకుండా మీ సినిమాలను మీరు ప్రమోట్ చేసుకునే విధానం ఎల్లప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తుందని" అన్నారు. అంతే కాకుండా ప్రభాస్, సందీప్ వంగా అప్‌కమింగ్ మూవీ స్పిరిట్‌పై ఆదిత్య ధర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. "స్పిరిట్ సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈ సినిమా పెద్ద విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కొరుకుంటున్నాను" అని అన్నారు. తన ట్వీట్‌లో ప్రభాస్‌ను లెజెండ్ అంటూ ఆదిత్య ధర్ సంబోధించారు. ఆదిత్య ధర్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
పాన్ ఇండియా షేక్
ప్రభాస్‌తో ఓ సినిమా చేయాలంటూ ఆదిత్య ధర్ పోస్ట్‌కు నెటిజన్లు రిప్లై ఇస్తున్నారు. మీ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా వస్తే పాన్ ఇండియా మొత్తం షేక్ కావడం ఖాయమంటూ కామెంట్స్ పెడుతున్నారు.
కాగా ప్రభాస్, సందీప్ వంగా కాంబినేషన్‌లో రూపొందుతోన్న స్పిరిట్ మూవీ షూటింగ్ గత ఏడాది డిసెంబర్‌లో మొదలైంది. హై ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో త్రిప్తి డిమ్రి హీరోయిన్‌గా నటిస్తోంది. 2027 మార్చి 5న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Tripti Dimri | ప్రభాస్ స్పిరిట్ అప్డేట్ – సెట్స్‌లోకి అడుగుపెట్టబోతున్న హాట్ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



