త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Padma Awards | ధ‌ర్మేంద్ర‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ – తెలుగు న‌టుల‌కు పద్మశ్రీ

రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ అవార్డుల‌ను అనౌన్స్‌చేసింది. బాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు ధ‌ర్మేంద్ర‌కు మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ‌విభూష‌ణ్ అవార్డును ప్ర‌క‌టించారు. మ‌మ్ముట్టికి ప‌ద్మ‌భూష‌ణ్ ద‌క్కింది. తెలుగు న‌టులు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీమోహ‌న్‌కు ప‌ద్మ‌శ్రీ వ‌రించాయి.

N

Entertainment | Published On Jan 25, 2026, 7.13 pm IST

Padma Awards | ధ‌ర్మేంద్ర‌కు ప‌ద్మ‌విభూష‌ణ్ – తెలుగు న‌టుల‌కు పద్మశ్రీ
Advertisement

Padma Awards |  రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా కేంద్ర ప్ర‌భుత్వం ప‌ద్మ‌అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.  మొత్తం 131  మందికి అవార్డులు అనౌన్స్చేశారు. ఈ ఏడాది ప‌లువురు న‌టుల‌కు అవార్డులు ద‌క్కాయి. బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్‌ ధ‌ర్మేంద్ర‌కు మ‌ర‌ణానంత‌రం ప‌ద్మ‌విభూష‌ణ్ పుర‌స్కారం ద‌క్కింది. సినీ రంగానికి ధ‌ర్మేంద్ర చేసిన సుదీర్ఘ సేవ‌ల‌కు గాను ఆర్ట్ విభాగంలో ఆయ‌న‌కు ప‌ద్మ‌విభూష‌ణ్‌ను ప్ర‌క‌టించారు. ధ‌ర్మేంద్రకు 2012లో ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు అందుకున్నారు. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ధ‌ర్మేంద్ర అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో క‌న్నుమూశారు.

మ‌మ్ముట్టికి ప‌ద్మ‌భూష‌ణ్‌..

మ‌ల‌యాళ న‌టుడు మ‌మ్ముట్టికి ప‌ద్మ‌భూష‌ణ్ అవార్డు ద‌క్కింది. ఈ సారి మ‌ల‌యాళం ఇండ‌స్ట్రీ నుంచి కేవ‌లం మ‌మ్ముట్టికి మాత్ర‌మే ప‌ద్మ  పురస్కారం వ‌రిచింది. మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీలో వైవిధ్య‌త‌కు చిరునామాగా నిలుస్తోన్నారు మ‌మ్ముట్టి. యాభై ఏళ్ల సినీ ప్ర‌యాణంలో ఇప్ప‌టివ‌ర‌కు 425కుపైగా సినిమాలు చేశారు. మ‌మ్ముట్టితో పాటు బాలీవుడ్ సింగ‌ర్ అల్కా యాజ్ఞిక్ ను ప‌ద్మ‌భూష‌ణ్‌తో ప్ర‌భుత్వం స‌త్క‌రించింది.

టాలీవుడ్‌ నుండి...

టాలీవుడ్ నుంచి ఈ సారి ఇద్ద‌రు న‌టుల‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డులు ద‌క్కాయి. సీనియ‌ర్ యాక్ట‌ర్లు రాజేంద్ర‌ప్ర‌సాద్‌తో పాటు ముర‌ళీమోహ‌న్‌కు కేంద్రం ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది. హీరోగానే కాకుండా స‌హాయ‌న‌టులుగా ఎన్నో సినిమాల్లో అస‌మాన న‌ట‌న‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు రాజేంద్ర‌ప్ర‌సాద్‌, ముర‌ళీమోహ‌న్‌. 1977లో వ‌చ్చిన స్నేహం సినిమాతో రాజేంద్ర‌ప్ర‌సాద్ యాక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. న‌ల‌భై తొమ్మిది ఏళ్లుగా సినిమాలు చేస్తున్నారు. కోలీవుడ్ యాక్ట‌ర్ మాధ‌వ‌న్‌తో పాటు బాలీవుడ్ న‌టుడు అనిల్ కుమార్ ర‌స్తోగీ, గుజ‌రాతీ న‌టుడు అర‌వింద్ వైద్య‌ల‌కు ప‌ద్మ‌శ్రీ అవార్డుల‌ను వ‌రించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement