త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

oscars 2026 | ఆస్కార్‌ వేడుకలో కోట శ్రీనివాస‌రావు, ధ‌ర్మేంద్ర‌కు నివాళి

తెలుగు న‌టుడు కోట శ్రీనివాస‌రావుతో పాటు బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర‌కు ఆస్కార్ వేడుక‌లో నివాళులు అర్పించారు. ఇన్ మెమోరియంలో కార్య‌క్ర‌మంలో భాగంగా గ‌త ఏడాది క‌న్నుమూసిన ఇండియన్ లెజెండరీ యాక్టర్లు కోట శ్రీనివాస‌రావు, ధ‌ర్మేంద్ర‌తో పాటు మ‌నోజ్‌కుమార్ , స‌రోజా దేవి సేవ‌ల‌ను ఆస్కార్ క‌మిటీ స్మ‌రించుకుంది.

N

Entertainment | Published On Mar 16, 2026, 4.33 pm IST

oscars 2026 | ఆస్కార్‌ వేడుకలో కోట శ్రీనివాస‌రావు, ధ‌ర్మేంద్ర‌కు నివాళి
Advertisement

oscars 2026 | ఆస్కార్ వేడుకలో తెలుగు దిగ్గ‌జ న‌టుడు కోట శ్రీనివాస‌రావుతో పాటు బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్ ధ‌ర్మేంద్ర‌కు నివాళులు అర్పించారు. ప్ర‌తి ఏటా ఆస్కార్ వేడుక‌లో ఇన్ మెమోరియం పేరుతో అవార్డుల‌ను ప్ర‌దానం చేసే ఏడాది కాలంలో చ‌నిపోయిన వారికి నివాళులు అర్పించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తోంది. సినిమా రంగానికి వారు చేసిన సేవల‌ను స్మ‌రించుకుంటూ వీడియోలు, ఫొటోల‌ను టెలికాస్ట్ చేస్తుంటారు. ఇన్ మెమోరియంతోనే ఆస్కార్ వేడుక‌ల‌ను మొద‌లుపెడ‌తారు.

హాలీవుడ్ నటులతో పాటు...

98వ ఆస్కార్ వేడుక‌లో హాలీవుడ్ యాక్ట‌ర్ల‌తో పాటు టాలీవుడ్ దిగ్గ‌జ న‌టుడు కోట శ్రీనివాస‌రావు, బాలీవుడ్ లెజెండ‌రీ యాక్ట‌ర్లు ధ‌ర్మేంద్ర‌, మ‌నోజ్‌కుమార్‌, న‌టి బీ స‌రోజా దేవికి నివాళులు అర్పించారు. 2025 - 26 మ‌ధ్య‌కాలంలో చ‌నిపోయిన హాలీవుడ్ న‌టులు, టెక్నీషియ‌న్ల‌తో పాటు కోట శ్రీనివాస‌రావు, ధ‌ర్మేంద్ర‌, స‌రోజాదేవి, మ‌నోజ్‌కుమార్ ఫొటోల‌ను అకాడ‌మీ క‌మిటీ త‌న వెబ్‌సైట్‌లో పొందుప‌రిచింది. సినీ రంగానికి వారు చేసిన సేవ‌కు ద‌క్కిన గౌర‌వ‌మిద‌ని నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తోన్నారు.గ‌తంలో ఆస్కార్ వేదిక‌గా శ్రీదేవి, భాను అత‌యాల‌కు మాత్ర‌మే నివాళులు అర్పించారు. వారి త‌ర్వాత మ‌ళ్లీ చాలా ఏళ్ల‌కు ఇండియ‌న్ లెజెండ్స్‌ను ఆస్కార్ క‌మిటీ స‌ముచితంగా గౌర‌వించింది.

 

Advertisement
Advertisement