Deepika Padukone | రాకా కోసం దీపికా పదుకొనే రెమ్యూనరేషన్.. టాలీవుడ్ హిస్టరీలోనే హయ్యెస్ట్
అల్లు అర్జున్ రాకా మూవీ కోసం దీపికా పదుకొనే తీసుకున్న రెమ్యూనరేషన్ టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ తెలుగు సినిమాకుగాను అత్యధిక రెమ్యూనరేషన్ అందుకున్న హీరోయిన్‌గా రాకాతో దీపికా పదుకొనే రికార్డ్ క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Apr 10, 2026, 2.46 pm IST
Deepika Padukone | అల్లు అర్జున్, అట్లీ దర్శకత్వంలో రూపొందుతోన్న పాన్ వరల్డ్ మూవీకి రాకా అనే టైటిల్‌ను ఖరారు చేశారు. అల్లు అర్జున్ బర్త్‌డే సందర్భంగా ఇటీవలే ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్‌లో గుండుతో విచిత్రమైన ఆకారంలో ఐకాన్ స్టార్ కనిపించడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తించింది. పోస్టర్‌తోనే సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి.
సైన్స్ ఫిక్షన్ యాక్షన్ మూవీ...
దాదాపు 1300 కోట్ల బడ్జెట్‌తో సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు అట్లీ రాకా మూవీని తెరకెక్కిస్తోన్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్‌కు జోడీగా దీపికా పదుకొనే హీరోయిన్‌గా నటిస్తోంది. కల్కి 2898 ఏడీ తర్వాత తెలుగులో దీపికా చేస్తోన్న సెకండ్ మూవీ ఇది.
రెమ్యూనరేషన్...
కాగా రాకా కోసం దీపికా పదుకొనే తీసుకున్న రెమ్యూనరేషన్ తెలుగు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టాలీవుడ్ హిస్టరీలోనే ఓ సినిమాకుగాను హయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రాకా మూవీతో దీపికా పదుకొనే రికార్డ్ క్రియేట్ చేసినట్లు చెబుతున్నారు. బన్నీ సినిమా కోసం దీపికా 25 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించిందట. దక్షిణాదితో పాటు బాలీవుడ్‌లో దీపికాకు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె డిమాండ్ చేసినంత మొత్తాన్ని మేకర్స్ చెల్లించినట్లు సమాచారం.
కల్కి కంటే ఎక్కువే...
ప్రభాస్ కల్కి మూవీతోనే దీపికా పదుకొనే టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో సుమతిగా యాక్టింగ్ స్కోప్ ఉన్న పాత్రలో కనిపించింది. కల్కి సినిమా కోసం దీపికా 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుందట. డెబ్యూ మూవీతో పోలిస్తే రాకా కోసం ఐదు కోట్లు పెంచినట్లు చెబుతున్నారు. దీపికా కెరీర్‌లోనే కూడా ఇదే హయ్యెస్ట్ అని చెబుతున్నారు. రాకా మూవీలో యాక్షన్ ఓరియెంటెడ్ రోల్‌లో దీపికా కనిపించబోతున్నట్లు సమాచారం.
ప్రభాస్ కల్కి 2లో దీపికా పదుకొనే నటించాల్సింది. కానీ రెమ్యూనరేషన్ పెంచడంతో పాటు ఎనిమిది గంటల రూల్ కారణంగా ఆమెను సీక్వెల్ నుంచి మేకర్స్ తప్పించారు. కల్కి 2 నుంచి వైదొలిగిన కొద్ది రోజులకే రాకాను అంగీకరించింది.
కాగా రాకా కోసం అల్లు అర్జున్ 175 కోట్ల రెమ్యూనరేషన్ స్వీకరించినట్లు సమాచారం. ఈ సినిమాలో దీపికా పదుకొనేతో పాటు జాన్వీ కపూర్, రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రాకాతో పాటు హిందీలో షారుఖ్‌ఖాన్‌తో కింగ్ సినిమా చేస్తోంది . డిసెంబర్‌లో కింగ్ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



