No UPI Day | అక్టోబర్ 2న ‘నో UPI డే’.. మొబైల్ రిటైలర్ల నిరసన
No UPI Day | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐ (UPI)పై మొబైల్ రిటైలర్లు గళమెత్తుతున్నారు. రూ.2,000కు పైబడిన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 2న ‘నో UPI డే’ పాటించాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) పిలుపునిచ్చింది.
- గాంధీ జయంతి రోజు QR కోడ్‌లకు నల్ల వస్త్రాలు
- యూపీఐ లావాదేవీలపై ఛార్జీకి వ్యతిరేకం
- చిన్న రిటైలర్లపై రూ.12,000 వరకు భారం పడొచ్చని AIMRA అంచనా
No UPI Day | డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కీలకమైన యూపీఐ (UPI)పై మొబైల్ రిటైలర్లు గళమెత్తుతున్నారు. రూ.2,000కు పైబడిన లావాదేవీలపై 0.4 శాతం మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విధించడాన్ని నిరసిస్తూ అక్టోబర్ 2న ‘నో UPI డే’ పాటించాలని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (AIMRA) పిలుపునిచ్చింది. గాంధీ జయంతి రోజున దేశవ్యాప్తంగా మొబైల్ దుకాణాల్లో ఏర్పాటు చేసిన యూపీఐ క్యూఆర్ (UPI QR) కోడ్‌లను నల్ల వస్త్రాలతో కప్పి.. యూపీఏ పేమెంట్స్‌ను స్వీకరించకుండా నిరసన తెలపాలని నిర్ణయించింది.
రూ.2వేల ఛార్జీపైనే..
మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ వివరాల ప్రకారం.. అక్టోబర్ 15 నుంచి రూ.2,000కు పైబడిన యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్ అమల్లోకి రానుంది. అయితే, వ్యక్తి నుంచి వ్యక్తికి జరిగే (P2P) యూపీఐ లావాదేవీలకు ఈ ఛార్జీ వర్తించదు. చిన్న మొత్తాల చెల్లింపులపైనా ఫీజు ఉండదు. వ్యాపార చెల్లింపులపై ఎండీఆర్ విధించడం వల్ల ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నడిచే మొబైల్ రిటైల్ వ్యాపారాలపై నేరుగా ఆర్థిక భారం పడుతుందని అసోసియేషన్ (AIMRA) చెబుతోంది. ఈ అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు అసోసియేషన్ ఇప్పటికే వినతిపత్రం సమర్పించింది.
చిన్న వ్యాపారులపై ప్రభావమెంత?
యూపీఐ ద్వారా నెలకు రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు లావాదేవీలు నిర్వహించే చిన్న మొబైల్ రిటైలర్లపై ఈ ఛార్జీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అసోసియేషన్ అంచనా వేస్తోంది. నెలకు రూ.5 లక్షల యూపీఐ టర్నోవర్ ఉన్న రిటైలర్‌కు సుమారు రూ.2,000 వరకు అదనపు భారం పడొచ్చని అంచనా. రూ.30 లక్షల యూపీఐ టర్నోవర్ ఉన్న రిటైలర్‌కు ఈ భారం రూ.12వేల వరకు ఉండొచ్చని పేర్కొంది. దేశవ్యాప్తంగా చిన్న మొబైల్ రిటైలర్లపై నెలకు సుమారు రూ.40 కోట్ల భారం పడొచ్చని తెలిపింది. ఏడాది మొత్తానికి ఈ ప్రభావం రూ.500 కోట్ల వరకు ఉండొచ్చని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ అంచనా వేసింది. చిన్న దుకాణాల లాభాల్లో గణనీయమైన భాగాన్ని ఎండీఐ చార్జీలు హరించే అవకాశం ఉందని రిటైలర్ల సంఘం ఆందోళన వ్యక్తం చేస్తోంది.
యూపీఐకి వ్యతిరేకం కాదు..
తమ నిరసన యూపీఐకి గానీ, డిజిటల్ ఇండియాకు గానీ వ్యతిరేకం కాదని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహిస్తున్న సమయంలో.. వాటిని స్వీకరించే వ్యాపారులపై అదనపు ఆర్థిక భారం పడకూడదన్నదే తమ అభ్యంతరమని తెలిపింది. అసోసియేషన్ ఉపాధ్యక్షుడు, ఢిల్లీ-ఎన్‌సీఆర్ అధ్యక్షుడు తర్వీందర్ సింగ్ మాట్లాడుతూ.. డిజిటల్ ఇండియా లక్ష్యం నెరవేరాలంటే రిటైల్ వ్యవస్థ మొత్తానికి డిజిటల్ చెల్లింపులు అందుబాటులో, భరించగలిగే విధంగా ఉండాలని పేర్కొన్నారు. బిజినెస్ యూపీఐ చెల్లింపులపై ప్రస్తుతం ఉన్న జీరో ఎండీఆర్ విధానాన్ని కొనసాగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. డిజిటల్ చెల్లింపులను స్వీకరించడం వ్యాపారులకు భారంగా మారకూడదని అసోసియేషన్ కోరుతోంది. అక్టోబర్ 2న చేపట్టనున్న ‘నో యూపీఐ డే’ ద్వారా తమ అభ్యంతరాన్ని కేంద్ర ప్రభుత్వం, సంబంధిత వర్గాల దృష్టికి తీసుకెళ్లాలని రిటైలర్లు భావిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్
- ●Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్
- ●John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు
- ●MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
- ●KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

Komatireddy Rajagopal Reddy | అయ్యా! నీ వల్లే మాకు కండ్ల ఆపరేషన్లు.. పెద్ద కొడుకులెక్క సూస్కుంటున్నవ్

Iran US conflict | శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్: అమెరికాకు తీవ్ర నష్టం తప్పదంటూ ఇరాన్ ఆర్మీ వార్నింగ్

John Wesley | బ్యాంక్ ఉద్యోగుల సమ్మెకు సీపీఐ(ఎం) మద్దతు

MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!





