PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2030 ఆసియా గేమ్స్‌లో పాల్గొనే విషయంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్పటివరకు తన ఫిట్‌నెస్, సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2030 ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపింది.
PV Sindhu | భారత స్టార్ షట్లర్ పీవీ సింధు 2030 ఆసియా గేమ్స్‌లో పాల్గొనే విషయంపై కీలక అప్‌డేట్ ఇచ్చింది. అప్పటివరకు తన ఫిట్‌నెస్, సామర్థ్యాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసింది. ఫిట్‌గా ఉంటే 2030 ఆసియా గేమ్స్‌లో బరిలోకి దిగేందుకు కచ్చితంగా ప్రయత్నిస్తానని తెలిపింది. అయితే ప్రస్తుతానికి భవిష్యత్‌పై తొందరపడి నిర్ణయం తీసుకోకుండా.. ఒక్కో ఏడాది, ఒక్కో టోర్నీ చొప్పున ముందుకు సాగడంపైనే దృష్టి పెడుతున్నట్లు చెప్పింది. తన భవిష్యత్ ప్రణాళికలపై సింధు మాట్లాడుతూ.. ‘నాకు సామర్థ్యం ఉంటే కచ్చితంగా ఆడేందుకు ప్రయత్నిస్తా. గాయాలకు దూరంగా ఉండాలి. ప్రస్తుతం తర్వాత ఏం చేయాలన్నదే ముఖ్యం. ఒక్కో అడుగు చొప్పున ముందుకు సాగాలి’ అని పేర్కొంది. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని మరింత జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుందని, అందుకే ఏ టోర్నీల్లో ఆడాలి.. వేటికి దూరంగా ఉండాలన్నది కూడా ముఖ్యమని తెలిపింది. ‘ఒక్కో ఏడాదిపై దృష్టి పెట్టడం ముఖ్యం. ఇక మీరు 20 ఏళ్ల వయసులో లేరు. శరీరాన్ని, ఇతర అంశాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ టోర్నీల్లో ఆడాలి.. వేటికి దూరంగా ఉండాలో ఎంచుకోవాలి’ అని సింధు చెప్పింది.
ఆ ప్రేమే నడిపిస్తోంది..
తన కెరీర్‌ను కొనసాగించడానికి కారణం పతకాలు కాదని.. ఆటపై ఉన్న ప్రేమ, మక్కువేనని సింధు తెలిపింది. ‘నాకు ఆటపై మక్కువ, ప్రేమ ఉంది. నేను ఎన్ని పతకాలు గెలిచినా అదే నన్ను ముందుకు నడిపిస్తోంది. చివరికి ఆటను ప్రేమించాలి. ఆటపై ఆసక్తి, ఆడాలనే కోరిక లేకపోతే కొనసాగడం కష్టం. నాలో ఇప్పటికీ ఆ సామర్థ్యం ఉందని తెలుసు. నేను ఆటను ఆస్వాదిస్తున్నా’ అని పేర్కొంది. ఇటీవల ఆసియా గేమ్స్‌లో మహిళల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో సింధు చైనా ప్రపంచ నాలుగో ర్యాంకర్ చెన్ యుఫీ చేతిలో ఓడింది. తొలి గేమ్‌ను 21-11తో గెలిచిన సింధు.. తర్వాతి రెండు గేమ్‌లను 18-21, 10-21తో కోల్పోయింది. దీంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది. ప్రస్తుతం యూరోపియన్ సర్క్యూట్‌లో ఆడేందుకు సింధు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడంతోపాటు సరైన టోర్నీల్లో పాల్గొనేలా దృష్టి సారించనుంది. 2030 ఆసియా గేమ్స్‌లో సింధు పాల్గొంటుందా లేదా అన్నది ప్రస్తుతానికి క్లారిటీ లేదు. ఫిట్‌నెస్, ప్రదర్శన ఆధారంగానే భవిష్యత్ నిర్ణయాలు తీసుకోనున్నట్లు సింధు చేసిన వ్యాఖ్యలు స్పష్టం చేశాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్
- ●G Chinna Reddy | యూపీఎస్సీ తరహాలో గ్రూప్-1 నియామకాలు చేపట్టాలి
- ●Pooja Hegde | ఎన్టీఆర్ గాడ్ ఆఫ్ వార్‌కు హీరోయిన్ దొరికిందా? - దేవసేనగా బుట్టబొమ్మ

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు

Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?

Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్





