KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
KTR | ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తూ.. మరోవైపు తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టడం సరికాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దేశీ ఇటిక్యాల గ్రామ శివార్లలోని పంట పొలాలను కేటీఆర్ పరిశీలించారు.
KTR | త్రినేత్ర న్యూస్ : ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తూ.. మరోవైపు తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టడం సరికాదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలోని దేశీ ఇటిక్యాల గ్రామ శివార్లలోని పంట పొలాలను కేటీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి ప్రస్తుత పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా కేటీఆర్ రైతులతో మాట్లాడుతూ.. “కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు అందించి పంటలను కాపాడాల్సిన ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ఎల్‌నినో పేరుతో కరువు పరిస్థితులను చెప్పుకుంటున్నారు.. కానీ ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు. కృష్ణా, గోదావరి నదుల్లో నీటి లభ్యత ఉన్నప్పటికీ తెలంగాణ రైతుల పంట పొలాలకు నీళ్లు అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ఒకవైపు ఆంధ్రప్రదేశ్‌కు నీటిని విడుదల చేస్తూ, మరోవైపు తెలంగాణ రైతుల పొలాలను ఎండబెట్టడం సరికాదు. పాలమూరు ప్రాంత రైతుల పంటలను కాపాడేందుకు వెంటనే పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీటిని ఎత్తిపోసి కాలువలకు విడుదల చేయాలి. పత్తి, మొక్కజొన్న పంటలు ఎండిపోతున్న రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి. రైతులు ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తారు. వారి పంటలు కళ్లముందే ఎండిపోతుంటే చూస్తూ ఊరుకోం. రైతులకు సాగునీరు అందించే వరకు బీఆర్‌ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుంది.” అని కేటీఆర్ స్పష్టం చేశారు.
తాజావార్తలు
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?
- ●Parvesh Verma Slap Video | రోడ్డు నాణ్యతపై నిలదీసినందుకు రెచ్చిపోయిన మంత్రి: లైవ్ తీస్తున్న వ్యక్తిని లాగిపెట్టి కొట్టిన పర్వేశ్ వర్మ.. వీడియో వైరల్

Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన

Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు




