MA Baby | ఈసీపై కత్తులు నూరుతున్న ప్రతిపక్షాలు..! కేజ్రీవాల్‌తో ఎంఏ బేబీ కీలక భేటీ..!
MA Baby | ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఈడీ చర్యలు తదితర అంశాలపై ప్రతిపక్షాల ఉమ్మడి కార్యాచరణకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు.
MA Baby | ఎన్నికల సంఘం పనితీరు, ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR), ఈడీ చర్యలు తదితర అంశాలపై ప్రతిపక్షాల ఉమ్మడి కార్యాచరణకు సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎంఏ బేబీ కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. ఎన్నికల సంఘంలో సర్ ప్రక్రియపై అంతర్గత విభేదాలు తలెత్తడం, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ నిర్ణయాలపై తోటి కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి 14 సందర్భాల్లో లిఖితపూర్వక అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన నివేదికలపై సమావేశంలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ పరిణామాలు ఈసీ విశ్వసనీయత, ప్రజాస్వామ్య వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని బేబీ పేర్కొన్నారు. ఈసీలో అంతర్గత చర్చల్లో భిన్నాభిప్రాయాలు సహజమేనని, నిర్ణయాలు చట్ట పరిధిలోనే ఉన్నాయని ఎన్నికల సంఘం చెప్పింది.
ప్రతిపక్షాల ఏకతాటిపైకి..
ఈ అంశంపై సెప్టెంబర్ 23న ఇండియా కూటమి నేతలతో పాటు ఎన్డీఏలో లేని పలు పార్టీలకు బేబీ లేఖ రాశారు. ఉమ్మడి వైఖరితో ముందుకు రావాలని కోరారు. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీతో ఫోన్‌లో మాట్లాడగా.. కలిసి కార్యాచరణకు ఆమె అంగీకరించినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్, బీజేడీ, డీఎంకే, తమిళగ వెట్రి కళగం తదితర పార్టీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. కేరళలో ఎల్‌డీఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టనున్న నిరసనల్లో పాల్గొనాలని కేజ్రీవాల్‌ను బేబీ ఆహ్వానించారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, రాష్ట్రాల హక్కులు, సమాఖ్య వ్యవస్థను దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని వామపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు పినరయి విజయన్‌పై ఈడీ చర్యలను రాజకీయ కక్ష సాధింపులో భాగంగా వామపక్షాలు అభివర్ణిస్తున్నాయి. దీనిపై దేశవ్యాప్త నిరసనలకు సిద్ధమవుతున్నాయి.
30న ఇండియా కూటమి భేటీ
ఎన్నికల సంఘం వ్యవహారం, సర్ ప్రక్రియపై తాత్కాలిక నిలుపుదల, తదుపరి కార్యాచరణపై చర్చించేందుకు సెప్టెంబర్ 30న న్యూఢిల్లీలో ఇండియా కూటమి కీలక సమావేశం జరగనుంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇందుకు సంబంధించిన కొత్త నోటీసును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టేందుకు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. న్యాయ నిపుణులు ప్రస్తుతం దాన్ని పరిశీలిస్తున్నట్లుగా తెలుస్తోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్
- ●Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది
- ●PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!
- ●Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా గేమ్స్ స్క్వాష్‌లో భారత్‌కు మూడు పతకాలు
- ●Theenmar Mallanna | ఓ పెద్దాయన.. ఎవుసం ఎట్లుందే?

KTR | తెలంగాణ పొలాలను ఎండబెట్టడం సరికాదు : కేటీఆర్

Aadarsha Kutumbam | ముగ్గురు ముద్దుగుమ్మలతో వెంకీమామ ఆటపాట - ఆదర్శ కుటుంబం ఫస్ట్ సింగిల్ వచ్చేసింది

PV Sindhu | 2030 ఆసియా గేమ్స్‌లో సింధు ఆడుతుందా?.. స్టార్ షట్లర్ ఏమందంటే!

Ibrahimpatnam | రేపు ఇబ్రహీంపట్నంలో ఫార్మా బాధిత రైతుల నిరసన




