త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dc Heroine | చేనేతకారుడిగా టాలీవుడ్ హీరో … లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోయిన్‌తో రొమాన్స్‌

లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా న‌టించిన డీసీతో ఫేమ‌స్ అయ్యింది సంజ‌న ఏకే. ఈ సినిమాలో బార్ డ్యాన్స‌ర్‌తో బోల్డ్ రోల్‌లో క‌నిపించిన ఈ బ్యూటీ తెలుగులోకి అడుగుపెట్ట‌బోతుంది. సుహాస్‌తో ఓ సినిమా చేస్తోంది. ఈ సినిమాకు హైండ్ అండ్ సిల్క్ అనే టైటిల్‌ను ఖ‌రారు చేశారు. ఇందులో చేనేత‌కారుడిగా సుహాస్ క‌నిపించ‌బోతున్నారు.

N

Entertainment | Published On Oct 12, 2026, 5.29 pm IST

Dc Heroine | చేనేతకారుడిగా టాలీవుడ్ హీరో … లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోయిన్‌తో రొమాన్స్‌
Advertisement

Dc Heroine | ఇటీవ‌లే మండాడి మూవీతో కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు సుహాస్‌. స్పోర్ట్స్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీ వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సొంతం చేసుకుంది. త‌మిళ క‌మెడియ‌న్ సూరి హీరోగా న‌టించిన మండాడిలో సుహాస్ విల‌న్‌గా క‌నిపించాడు. రా అండ్ ర‌స్టిక్ యాక్టింగ్‌తో మెప్పించాడు.

హైడ్ అండ్ సిల్క్‌...

మండాడి త‌ర్వాత హీరోగా కొత్త సినిమాను అనౌన్స్‌చేశాడు సుహాస్‌. ఈ సినిమాకు హైడ్ అండ్ సిల్క్ అనే పేరును ఖ‌రారు చేశారు. ఓ వీడియో ద్వారా ఈ సినిమా టైటిల్‌ను రివీల్ చేశారు. ఇందులో చేనేత‌కారుడిగా మ‌గ్గంపై చీర‌నేస్తూ సుహాస్ క‌నిపించాడు. "చీర‌నేయ‌డం అన్న‌ది ప‌ని కాదు..అదొక క‌ళ‌...ప్ర‌తి మెతుకు మీద తినేవాడి పేరు రాసి ఉన్న‌ట్లు..నేసే ప్ర‌తి చీర మీద ఒక అమ్మాయి పేరు రాసి ఉంటుంది. నేసేట‌ప్పుడే ఆ చీర అమ్మాయిని ఎంచుకుంటుంది. ఆ అమ్మాయి క‌ట్టుకున్న‌ప్పుడే ఆ చీర‌కు అస‌లైన అందం" అంటూ త‌నికెళ్ల‌భ‌ర‌ణి వాయిస్ ఓవ‌ర్‌తో ఈ వీడియో ఆస‌క్తిక‌రంగా సాగింది.
తాను నేసిన మొద‌టి చీర క‌ట్ట‌బోయే అమ్మాయి ఎవ‌ర‌న్న‌ది చూడాల‌ని సుహాస్ అనుకోవ‌డంతో ఈ వీడియోలోకి హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది.

లోకేష్ క‌న‌గ‌రాజ్‌...

లోకేష్ క‌న‌గ‌రాజ్ హీరోగా న‌టించిన డీసీతో ఫేమ‌స్ అయిన సంజ‌న ఏకే ....హైడ్ అండ్ సిల్క్ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతుంది. రాజేంద్ర బాల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమా త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. అమ్రిత్ రామ్‌నాథ్ మ్యూజిక్ అందిస్తున్నాడు.

డీసీతో ఫేమ‌స్‌...

డీసీ మూవీలో బార్ డ్యాన్స‌ర్‌గా బోల్డ్ రోల్‌లో సంజ‌న క‌నిపించింది. ఆమె న‌ట‌న‌కు ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. డీసీ కంటే ముందు ల‌బ్బ‌రు పందు, ప‌రిమ‌ళ అండ్ కోతో పాటు త‌మిళంలో మ‌రికొన్ని సినిమాలు చేసింది సంజ‌న‌.

Advertisement
Advertisement