త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rahul Gandhi SC March | ఢిల్లీలో దద్దరిల్లిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’: సుప్రీంకోర్టుకు రాహుల్, ప్రియాంక పాదయాత్ర.. సీఈసీపై పిటిషన్ దాఖలు

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై విపక్ష ఇండియా కూటమి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాహుల్, ప్రియాంక ఆధ్వర్యంలో ఢిల్లీలో భారీ నిరసన ర్యాలీ.

J

National | Published On Oct 12, 2026, 5.15 pm IST

Rahul Gandhi SC March | ఢిల్లీలో దద్దరిల్లిన ‘మార్చ్ ఫర్ డెమోక్రసీ’: సుప్రీంకోర్టుకు రాహుల్, ప్రియాంక పాదయాత్ర.. సీఈసీపై పిటిషన్ దాఖలు

సంక్షిప్త సారాంశం

ఓట్ల చోరీ' ఆరోపణలు, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో ఇండియా కూటమి పిటిషన్ అధికారికంగా నమోదైంది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ నేతృత్వంలో కన్నాట్ ప్లేస్ నుంచి మండి హౌస్ మీదుగా సుప్రీంకోర్టు వైపు వేలాది మందితో 'మార్చ్ ఫర్ డెమోక్రసీ' ర్యాలీ సాగింది. ఒకవైపు ర్యాలీ కొనసాగుతుండగానే.. ఇండియా కూటమి లీగల్ టీమ్ నేరుగా సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఇది ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమేనని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు బీజేపీ శ్రేణులు కూడా కలిసి రావచ్చని రాహుల్ పిలుపునిచ్చారు.

Advertisement

Rahul Gandhi SC March | త్రినేత్ర న్యూస్ : దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి పోరుబాట పట్టింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా.. ఎన్నికల ప్రక్రియలో జరిగినట్లు చెబుతున్న ‘ఓట్ల చోరీ’పై విపక్ష నేతలు సోమవారం భారీ నిరసన కవాతు నిర్వహించారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నేహా బోరా సహా కూటమి ఎంపీలందరూ కలిసి కన్నాట్ ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వైపు వేలాది మంది కార్యకర్తలతో 'చలో ఢిల్లీ - మార్చ్ ఫర్ డెమోక్రసీ' పేరిట పాదయాత్ర చేపట్టారు.

ఈ నిరసన ర్యాలీ రోడ్లపై సాగుతున్న సమయంలోనే.. ఇండియా కూటమి న్యాయ బృందం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సీఈసీ జ్ఞానేష్ కుమార్‌పై దాఖలు చేసిన పిటిషన్ సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అధికారికంగా నమోదైంది.

INDIA Bloc Marches to Supreme Court Rahul Gandhi Files Petition Against CEC

కన్నాట్ ప్లేస్ నుంచి మండి హౌస్ వరకు జనసంద్రం

బారాఖంబా రోడ్డు జంక్షన్ వద్ద ప్రారంభమైన ఈ మార్చ్ చూస్తుండగానే భారీ ప్రజాసమీకరణగా మారింది. కన్నాట్ ప్లేస్, మండి హౌస్ మార్గాలన్నీ నిరసనకారులతో నిండిపోయాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సెంట్రల్ ఢిల్లీలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, భద్రతా కారణాలతో తాత్కాలికంగా మూసివేసిన ఆరు మెట్రో స్టేషన్ల గేట్లను అధికారులు తిరిగి తెరిచారు.

INDIA Bloc Marches to Supreme Court Rahul Gandhi Files Petition Against CEC

ర్యాలీని ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. ఈ పోరాటం ఒక్క రోజుతో ఆగదని తేల్చిచెప్పారు. "ఇది రాజ్యాంగ పరిరక్షణ కోసం, దేశ భవిష్యత్తు కోసం జరుగుతున్న పోరాటం. దీనికి ఎన్ని రోజులైనా, ఎన్ని ఏళ్లయినా తగ్గేదే లేదు" అని స్పష్టం చేశారు. రాజ్యాంగం ప్రమాదంలో పడిందని భావించే బీజేపీ వాళ్లు కూడా ఈ మార్చ్‌లో భాగస్వాములు కావచ్చని రాహుల్ పిలుపునిచ్చారు.

'ఆయన రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారు'

ఈ వివాదంపై అంతకుముందు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో మాట్లాడిన రాహుల్.. సీఈసీ తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "జ్ఞానేష్ కుమార్ రాత్రిళ్లు నిద్రపోలేకపోతున్నారని మాకు తెలుసు. తప్పు ఆయనొక్కడిదే కాదు.. దాని వెనుక ఉన్న అసలు శక్తులపైనే మా యుద్ధం. వెంటనే పదవికి రాజీనామా చేసి అప్రూవర్‌గా మారండి" అంటూ అల్టిమేటం జారీ చేశారు. ప్రభుత్వంలో పనిచేస్తున్న దాదాపు 200 మంది అధికారులు తమతో సంప్రదింపుల్లో ఉన్నారన్న సంచలన విషయాన్ని కూడా ఆయన పునరుద్ఘాటించారు.

INDIA Bloc Marches to Supreme Court Rahul Gandhi Files Petition Against CEC

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియలో తోటి ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి దాదాపు 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాలతో ఈ వివాదం తారస్థాయికి చేరింది. కాగా, జంతర్ మంతర్ వద్ద నిరసనల రద్దుపై దాఖలైన పిటిషన్లతో పాటు ఇతర అంశాలను ఢిల్లీ హైకోర్టు అక్టోబర్ 13న విచారించనుంది.

Advertisement
Advertisement