Casting Couch | చిన్మయి చెప్పింది నిజమే – టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్‌పై తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్స్
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చిన్మయి చెప్పిన మాటలు నిజమేనని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. చిరంజీవి కూతురికి సమస్యలు ఎదురవ్వనంత మాత్రానా ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు అని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.
Entertainment | Published On Jan 31, 2026, 6.31 pm IST
Casting Couch | టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ లేదంటూ ఇటీవల మన శంకర వరప్రసాద్‌గారు సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి అన్నారు. మన స్ట్రిక్ట్‌గా ఉంటే ఎవరూ అడ్వాంటేజ్ తీసుకోరని చిరంజీవి పేర్కొన్నారు. మెగాస్టార్ వ్యాఖ్యలను సింగర్ చిన్మయి తప్పు పట్టింది. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ సమస్య చాలా ఉందని, కమిట్‌మెంట్‌కు ఒప్పుకున్న వారికే తెలుగు ఇండస్ట్రీలో అవకాశాలు దక్కుతున్నాయని అన్నది. కమిట్‌మెంట్ అనే పదాన్ని అడ్డుపెట్టుకొని మహిళలను వేధింపులకు గురిచేస్తున్నారంటూ సుదీర్ఘ పోస్ట్ పెట్టింది. చిన్మయి పోస్ట్ వైరల్‌గా మారింది. ఆమెకు పలువురు నెటిజన్లు సపోర్ట్‌గా నిలవగా...చాలా మంది విమర్శలు గుప్పించారు. తాజాగా చిన్మయి కామెంట్లను సీనియర్ డైరెక్టర్ తమ్మారెడ్డి భరద్వాజ సపోర్ట్ చేశారు. చిన్మయి చెప్పింది నిజమేనని అన్నారు. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు, క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఉన్నది ముమ్మాటికి నిజమేనని అన్నారు.
250 సినిమాలు తీస్తే...
"టాలీవుడ్‌లో ప్రతి ఏటా 250 వరకు సినిమాలు వస్తే అందులో 30 నుంచి 40 వరకు అమ్మాయిలను వాడుకోవడానికే తీస్తున్నారు. లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి కొందరు ఇండస్ట్రీ పెద్దల్లో ఉంది. అలాంటి వారి వల్ల ఇండస్ట్రీ మొత్తానికి చెడ్డపేరు వస్తుంది" అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
చిరంజీవి కూతురికి లేనంత మాత్రానా...
"చిరంజీవి కూతురు సుస్మిత ప్రొడ్యూసర్‌గా సినిమాలు చేస్తుంది కాబట్టి ఆమెకు టాలీవుడ్‌లో ఎలాంటి సమస్యలు ఎదురై ఉండకపోవచ్చు. కానీ ఆర్టిస్టులుగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి పరిస్థితి వేరుగా ఉంటుంది. చిరంజీవి కూతురికి క్యాస్టింగ్ కౌచ్ ఎదురవ్వనంత మాత్రానా ఇండస్ట్రీ మొత్తం అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు" అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. టాలీవుడ్‌లో చాలా మంది నిర్మాతలకు దేని కోసం సినిమాలు తీస్తున్నారో వాళ్లకే తెలియదని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.
టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ ఉందని చిన్మయి చేసిన వ్యాఖ్యలు నిజమేనని, ఒకరిద్దరు ఇండస్ట్రీ పెద్దల వల్ల క్యాస్టింగ్ కౌచ్ భూతం టాలీవుడ్‌ను వదిలిపెట్టడం లేదని అన్నారు. ఆయన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి.గతంలో క్యాస్టింగ్ కౌచ్‌పై పలు సందర్భాల్లో తమ్మారెడ్డి భరద్వాజ రియాక్ట్ అయ్యారు. అవకాశాల కోసం లొంగిపోవాల్సిన అవసరం లేదని అన్నారు. కానీ కొందరు అమ్మాయిలు అవకాశాల కోసం రాజీ పడుతున్నారని గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



