త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Brother and Sister Die in Road Accident | ద‌స‌రాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండ‌గా ప్ర‌మాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్

Brother and Sister Die in Road Accident | బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండ‌గల వేళ పెద్ద అంబ‌ర్‌పేట‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ద‌స‌రా పండ‌గ‌క‌ని త‌న చెల్లిని, చిన్నారి కోడ‌లిని స్కూటీపై తీసుకొస్తుండ‌గా కారు రూపంలో మృత్యువు క‌బ‌ళించింది.

S

Telangana | Published On Oct 18, 2026, 4.48 pm IST

Brother and Sister Die in Road Accident | ద‌స‌రాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండ‌గా ప్ర‌మాదం.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్
Advertisement

Brother and Sister Die in Road Accident | త్రినేత్ర న్యూస్: బ‌తుక‌మ్మ, ద‌స‌రా పండ‌గల వేళ పెద్ద అంబ‌ర్‌పేట‌లో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ద‌స‌రా పండ‌గ‌క‌ని త‌న చెల్లిని, చిన్నారి కోడ‌లిని స్కూటీపై తీసుకొస్తుండ‌గా కారు రూపంలో మృత్యువు క‌బ‌ళించింది. ఘ‌ట‌నా స్థ‌లంలోనే అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవ‌డంతో బాధిత కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

హైద‌రాబాద్ పెద్ద అంబ‌ర్‌పేట‌కు చెందిన న‌వీన్ త‌న చెల్లి రేఖ‌ను, కోడ‌లిని శంషాబాద్ నుంచి పుట్టింటికి స్కూటీపై తీసుకొస్తున్నాడు. ఇంకొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుతార‌నుకున్న స‌మ‌యంలో గుర్తు తెలియ‌ని కారు వేగంగా వ‌చ్చి స్కూటీని బ‌లంగా ఢీకొట్టింది. దీంతో న‌వీన్, రేఖ ఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయ‌ప‌డిని చిన్నారి కోడ‌లిని స్థానికులు చికిత్స నిమిత్తం స‌మీపంలో ఉన్న ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.

ఈ ఘ‌ట‌న‌పై సమాచారం అందుకున్న హయాత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు న‌మోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పండుగ పూట పుట్టింటికి వెళ్తున్న అన్నాచెల్లెళ్లు ఇద్దరూ మార్గమధ్యలోనే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. బాధిత కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు చూప‌రుల‌ను కంట‌త‌డి పెట్టిస్తున్నాయి.

Advertisement
Advertisement