Rashmika Mandanna | రెండు రోజుల్లోనే 53 కోట్లు – నెగెటివ్ టాక్‌తో కుమ్మేస్తోన్న రష్మిక మందన్న బాలీవుడ్ రొమాంటిక్ మూవీ
రష్మిక మందన్న బాలీవుడ్ మూవీ కాక్‌టెయిల్ 2 రెండో రోజుల్లోనే 53 కోట్ల వసూళ్లను సాధించింది. ఈ బాలీవుడ్ రొమాంటిక్ మూవీకి తొలిరోజు 25 కోట్ల వసూళ్లు రాగా...సెకండ్ డే 29 కోట్లతో బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఈ సినిమాలో షాహిద్‌కపూర్, కృతిసనన్, రష్మిక మందన్న హీరోహీరోయిన్లుగా నటించారు.
Entertainment | Published On Jun 21, 2026, 7.16 pm IST
Rashmika Mandanna | రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ కాక్ టెయిల్ 2 కాసుల వర్షం కురిపిస్తోంది. రెండు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 53 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. ఈ సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చిన ఆ ఎఫెక్ట్ కలెక్షన్స్‌పై ఏ మాత్రం కనిపించడం లేదు. తొలి రోజు కాక్ టెయిల్ 2 సినిమాకు ఇరవై ఐదు కోట్ల కలెక్షన్స్ రాగా...రెండో రోజు మరింత పెరిగాయి. 28 కోట్ల వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద కుమ్మేసింది. ఆదివారం రోజు ఈ బాలీవుడ్ రొమాంటిక్ మూవీ 30 కోట్లకుపైనే కలెక్షన్స్‌ను దక్కించుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియా వైడ్‌గా కాక్‌టెయిల్ 2 మూవీ పదివేలకు పైగా స్క్రీన్స్‌లో రిలీజైంది. మొదటిరోజుతో పోలిస్తే రెండో రోజు ఆక్యుపెన్సీ రేటు కూడా పెరిగింది. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో ఈ హిందీ సినిమా రూపొందింది.
ట్రయాంగిల్ లవ్‌స్టోరీ...
కాక్‌టెయిల్ 2 మూవీలో షాహిద్‌కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ హీరోహీరోయిన్లుగా నటించారు. రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్‌స్టోరీగా దర్శకుడు హోమీ అద్జానియా ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమాలోని విజువల్స్, కృతిసనన్ గ్లామర్ సీన్లు బాగున్నాయంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వస్తున్నాయి.
రష్మికపై విమర్శలు
కాక్‌టెయిల్ 2లో రష్మిక మందన్న క్యారెక్టర్‌పై దారుణంగా విమర్శలొస్తున్నాయి. ఆమె హిందీ డైలాగ్స్‌లో దక్షిణాది యాస కనిపించిందని, డబ్బింగ్ అస్సలు బాగాలేదని అంటున్నారు. అంతే కాకుండా రష్మిక పాత్ర సరైన ప్రాధాన్యత లేదని, స్క్రీన్ టైమ్ కూడా చాలా తక్కువగా ఉందంటూ కామెంట్లు పెడుతున్నారు. హిందీ సినిమాలకు రష్మిక సెట్ కాదంటూ ట్రోల్ చేస్తున్నారు. కృతి సనన్‌ను డామినేట్ చేస్తుందనే భయంతోనే ఎడిటింగ్‌లో రష్మిక సీన్లను లేపేశారట. ఈ విషయంలో హర్ట్ అయిన రష్మిక రిలీజ్ తర్వాత ప్రమోషన్స్‌కు దూరం ఉంటుందని టాక్ నడుస్తోంది. రష్మిక యాక్టింగ్‌తో పాటు కాక్‌టెయిల్ 2 కథ సహజత్వానికి దూరంగా లాజిక్‌లెస్‌గా ఉందని, ఫోర్స్‌డ్ కామెడీతో బోర్ ఫీలింగ్ కలిగించిందంటూ చెబుతున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Samantha vs Rashmika Mandanna | మా ఇంటి బంగారం వర్సెస్ కాక్ టెయిల్ 2 – కలెక్షన్స్‌లో సమంతను బీట్ చేసిన రష్మిక బాలీవుడ్ మూవీ
జూన్ 20, 2026

Rashmika Mandanna | నక్సలైట్‌గా నేషనల్ క్రష్ – ఊహించని జానర్లో రష్మిక తెలుగు మూవీ
జూన్ 18, 2026

Rashmika Mandanna | బాలీవుడ్ మూవీకి సినిమాటోగ్రాఫర్‌గా రష్మిక మందన్న – ఫొటోలు వైరల్
జూన్ 16, 2026
తాజావార్తలు
- ●BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!
- ●Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
- ●US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్
- ●TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ
- ●Prabhas | బాహుబలి మూవీపై వెబ్‌సిరీస్ - ఎవరికి తెలియని సీక్రెట్స్ చెప్పబోతున్న ప్రభాస్, అనుష్క
- ●KTR | మీకు పట్టాలిచ్చే బాధ్యత మాది.. హనుమాన్ నగర్ బస్తీవాసులకు కేటీఆర్ భరోసా

BMW Crash Mumbai | 250 KMPH స్పీడ్, చెల్లాచెదురుగా బాడీ పార్ట్స్.. ముంబై సమీపంలో ముక్కలైన లగ్జరీ BMW కారు, బర్త్‌డే నాడే ఇద్దరి మృతి!

Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో - హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్

US Iran Peace Talks | పాత వైరానికి స్వస్తి.. అమెరికా-ఇరాన్ మధ్య చారిత్రక చర్చలు! "మిడిల్ ఈస్ట్‌లో కొత్త అధ్యాయం" అన్న జేడీ వాన్స్

TG Heavy Rains | తెలంగాణలో రాగల నాలుగురోజులు భారీ వర్షాలు.. ఎల్లో హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ



