TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా రక్తదాన శిబిరం
TCSS | తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో నవంబర్ 1న Bloodbank@ One Punggol లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.
International | Published On Nov 3, 2026, 7.57 pm IST
దాదాపు 50 మందికి పైగా స్వచ్ఛందంగా రక్తదానం
TCSS | త్రినేత్ర న్యూస్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో నవంబర్ 1న Bloodbank@ One Punggol లో నిర్వహించిన రక్తదాన శిబిరం విజయవంతమైంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ శిబిరంలో దాదాపు 50 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

రక్తదానానికి అర్హులైన పలువురు ముందుకు వచ్చి ఈ సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. అవసరమైన వారికి రక్తాన్ని అందించాలనే లక్ష్యంతో TCSS ఈ శిబిరాన్ని నిర్వహించింది.

ఈ సందర్భంగా పలువురు రక్తదాతలు మాట్లాడుతూ.. “TCSS నిర్వహించిన రక్తదాన శిబిరంలో భాగస్వాములవడం మాకు ఎంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహించి, సమాజ సేవలో మమ్మల్ని భాగస్వాములను చేసిన TCSSకు హృదయపూర్వక కృతజ్ఞతలు. ఇలాంటి సేవా కార్యక్రమాలను TCSS నిరంతరం కొనసాగించాలని, మరింతమంది రక్తదాతలు ముందుకు రావాలని ఆకాంక్షిస్తున్నాం” అని అన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన నిర్వాహకులు, స్వచ్ఛంద కార్యకర్తలకు వారు అభినందనలు తెలిపారు.

కార్యక్రమాన్ని విజయవంతం చేసిన రక్తదాతలకు, సహకరించిన వాలంటీర్లకు, మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికీ మరియు శిబిరానికి సహకరించిన సింగపూర్ హెల్త్ సైన్సెస్ అథారిటీ (HSA) సిబ్బందికి సొసైటీ అధ్యక్షులు నల్ల భాస్కర్ గుప్త, ప్రధాన కార్యదర్శి బొందుగుల రాము, కోశాధికారి శశిధర్ రెడ్డి ఎర్రమరెడ్డి, ఉపాధ్యక్షులు బసిక ప్రశాంత్ రెడ్డి, జూలూరి సంతోష్ కుమార్, మిర్యాల సునీత రెడ్డి, సంతోష్ వర్మ మాదారపు, విక్రమ్ చిట్ల, సంస్థాగత కార్యదర్శి కాసర్ల శ్రీనివాస రావు, ప్రాంతీయ కార్యదర్శులు నంగునూరి వెంకట రమణ, నడికట్ల భాస్కర్, మహేష్ చెట్టిపెల్లి, కల్వ లక్ష్మణ్ రాజు, శివ ప్రసాద్ ఆవుల, కార్యవర్గ సభ్యులు బొడ్ల రోజా రమణి, రవి కృష్ణ విజ్జాపూర్, పెరుకు శివ రామ్ ప్రసాద్, విజయ మోహన్ వెంగళ, సతీష్ పెసరు, చల్లా కృష్ణ, మణికంఠ రెడ్డి, భాస్కర్ రావు పులిగిళ్ల, ప్రవీణ్ మామిడాల, తోట రాజేంద్ర ప్రసాద్, యసరావేణి విజయ కుమార్, మల్లారెడ్డి కల్లెం, సుకేందర్ నీలం తదితరులు కృతజ్ఞతలు తెలిపారు.
సంబంధిత వార్తలు

Hyderabad Mega Blood Donation Camp | రేపే హైదరాబాద్లో మహా రక్తదాన యజ్ఞం: 37 కేంద్రాల్లో శిబిరాలు.. ఒక్క రక్తపు బొట్టు ముగ్గురి ప్రాణాలకు ఊపిరి!
అక్టోబర్ 28, 2026

Bathukamma Celebrations | సింగపూర్లో వైభవంగా బతుకమ్మ వేడుకలు.. టీసీఎస్ఎస్ బృందానికి హరీశ్ రావు అభినందన
అక్టోబర్ 19, 2026

PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం
సెప్టెంబర్ 17, 2026
తాజావార్తలు
- ●Minister Adluri | గురుకులాలకు సరుకుల సరఫరాలో జాప్యంపై మంత్రి ఫైర్
- ●Dil Raju | టాక్సిక్ సినిమాతో లాభాలు వచ్చాయి - పాన్ ఇండియన్ భ్రమలు వీడాలి - దిల్రాజు కామెంట్స్ వైరల్
- ●Padmavathi Temple | వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు
- ●Traffic Restrictions | ఎన్టీఆర్ స్టేడియం వద్ద 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
- ●Sanjay Jaju | రబీ సాగు ప్రణాళికను తయారు చేయండి.. నీటిని బట్టే పంటల ఎంపిక ఉండాలి
- ●Security Lapse | సీఎం విజయ్ భద్రతలో భారీ లోపం.. కాన్వాయ్ దాటి దూసుకొచ్చిన వ్యక్తి..!

Minister Adluri | గురుకులాలకు సరుకుల సరఫరాలో జాప్యంపై మంత్రి ఫైర్

Dil Raju | టాక్సిక్ సినిమాతో లాభాలు వచ్చాయి - పాన్ ఇండియన్ భ్రమలు వీడాలి - దిల్రాజు కామెంట్స్ వైరల్

Padmavathi Temple | వైభవంగా పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు

Traffic Restrictions | ఎన్టీఆర్ స్టేడియం వద్ద 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు



