Netflix | హైదరాబాద్‌లో నెట్‌ఫ్లిక్స్ ఆఫీస్.. 12న ప్రారంభించనున్న సీఎం రేవంత్
Netflix | ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం, వీఎఫ్‌ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ (Netflix) హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నది. నగరంలోని హైటెక్ సిటీలో క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్ ఏలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనుంది.
Entertainment | Published On Mar 7, 2026, 10.31 am IST
Netflix | త్రినేత్ర.న్యూస్: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం, వీఎఫ్‌ఎక్స్ అండ్ వర్చువల్ ప్రొడక్షన్ హౌజ్ నెట్‌ఫ్లిక్స్ స్టూడియోస్ (Netflix) హైదరాబాద్‌లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నది. నగరంలోని హైటెక్ సిటీలో క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ బ్లాక్ ఏలో 30వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నెలకొల్పనుంది. ఈ నెల 12న సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. రీజినల్ కంటెంట్‌ను పెంచడం, ప్రాజెక్ట్ మానిటరింగ్, టెక్నికల్ వర్క్‌ఫ్లోలు, పోస్ట్ ప్రొడక్షన్ కోసం వెండర్ మేనేజ్‌మెంట్ వంటి విభాగాలు ఈ కార్యాలయంలో ఉండనున్నాయి. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్ అడుగు పెట్టి పదేండ్లు పూర్తయిన సందర్భంగా ఈ విస్తరణ చేపడుతున్నది.
నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే ముంబైలో కార్యకలాపాలు నిర్వహిస్తుండగా.. భారత్‌లో ఇది రెండో కార్యాలయం కావడం గమనార్హం. ఈ విస్తరణతో హైదరాబాద్‌లో యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) రంగం మరింత పటిష్ఠం కానుందని ప్రభుత్వం భావిస్తున్నది. సృజనాత్మక, సాంకేతిక ప్రతిభ ఉన్న యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని అధికారులు తెలిపారు. అడ్వాన్స్‌డ్ స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఏవీజీసీలో నైపుణ్యాభివృద్ధికి ఊతం లభిస్తుందని చెప్పారు. హైదరాబాద్‌ను డిజిటల్ కంటెంట్ సృష్టిలో అగ్రగామిగా నిలబెట్టే దిశగా ఇది కీలక ముందడుగని చెప్పారు.
ఇవికూడా చదవండి..
5 రోజుల్లో రూ.19 లక్షల కోట్లు ఆవిరి.. బేర్ మార్కెట్ ప్రారంభమైందా..?
టెహ్రాన్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. ఎగసిపడ్డ మంటలు
మేడారం జాతరలో పరిచయం.. ముగ్గురు పిల్లలున్న హోంగార్డును పెండ్లి చేసుకున్న యువతి
సంబంధిత వార్తలు

Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్
ఆగస్టు 4, 2026

Minister Ponnam Prabhakar | పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై అభిప్రాయ సేకరణ చేపట్టిన మంత్రి పొన్నం ప్రభాకర్
ఆగస్టు 4, 2026

HMWSSB | బీ అలర్ట్.. రేపు హైదరాబాద్‌లో తాగునీటి సరఫరా బంద్
ఆగస్టు 4, 2026
తాజావార్తలు
- ●PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..
- ●Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి
- ●Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ
- ●Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి
- ●Penny Stocks | కాసుల వర్షం కురిపిస్తున్న పెన్నీ స్టాక్స్.. 6 నెలల్లో 198 శాతం లాభాలు..
- ●Harish Rao | డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌కు పూర్తి స్థాయి అధికారిని నియమించాలి.. హరీశ్ రావు డిమాండ్

PhonePe | ఫోన్ పే రూ.10 పెట్టుబడి ఫీచర్‌కు విశేష రీతిలో స్పందన.. భారీగా పెరుగుతున్న కస్టమర్లు..

Minister Uttam Kumar Reddy | రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం.. ప్రతీ గింజకూ లెక్క చెప్పాల్సిందే : మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి

Kaloji Health University | విద్యార్థులకు అలర్ట్.. ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన కాళోజీ హెల్త్ యూనివర్సిటీ

Faridabad Teacher | 30 సెకన్లలో 34 కత్తిపోట్లు.. స్కూల్ టీచర్‌పై వ్యక్తి పైశాచిక దాడి



