త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cm Revanth Reddy | మినిస్ట‌ర్స్‌తో క‌లిసి పూలే సినిమా చూసిన సీఏం రేవంత్ రెడ్డి

జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవితాల ఆధారంగా రూపొందిన పూలే సినిమాను సోమ‌వారం హైద‌రాబాద్‌లో సీఏం రేవంత్ రెడ్డి ప్ర‌త్యేకంగా వీక్షించారు. ఈ ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లో ముఖ్య‌మంత్రితో పాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్ పాల్గొన్నారు.

N

Entertainment | Published On Jan 6, 2026, 10.05 am IST

Cm Revanth Reddy |  మినిస్ట‌ర్స్‌తో క‌లిసి పూలే సినిమా చూసిన సీఏం రేవంత్ రెడ్డి
Advertisement

Cm Revanth Reddy | కుల నిర్మూలన కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే దంపతులు అస‌మాన‌ పోరాటం చేశారని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే జీవితాల ఆధారంగా రూపొందిన పూలే సినిమాను సోమ‌వారం హైద‌రాబాద్‌లో ప్ర‌త్యేకంగా రేవంత్ రెడ్డి వీక్షించారు. ముఖ్య‌మంత్రితో పాటు డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు వివేక్ వెంకట స్వామి, శ్రీధర్ బాబు, పొన్నంప్రభాకర్, వాకిటి శ్రీహరి కూడా సినిమాను చూశారు. ఈ సినిమా చూసేందుకుసీఏంతో పాటు మినిస్ట‌ర్లు ఆర్టీసీ బ‌స్‌లో ప్ర‌సాద్ ల్యాబ్స్‌కు వ‌చ్చారు.సినిమా ప్ర‌ద‌ర్శ‌న అనంత‌రం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మహిళా విద్య కోసం పూలే దంప‌తులు ఎదుర్కొన్న సవాళ్లను సినిమాలో కళ్లకు కట్టినట్లు ద‌ర్శ‌కుడు చూపించార‌ని అన్నారు.పూలే దంపతుల సామాజిక సేవా గుణం, వారి జీవితాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని సీఏం కొనియాడారు.

అద్భుత‌మైన సందేశం...

పూలే సినిమా భారతీయ సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తుంద‌ని డిప్యూటీ సీఏం బ‌ట్టి విక్ర‌మార్క అన్నారు. మహిళా అభ్యున్నతి కోసం, ఆనాటి సమాజంలో ఉన్న కులవివక్ష ఇతర ఇబ్బందులను తట్టుకుని సమసమాజం కోసం పూలే దంపతులు అలుపెరుగ‌ని కృషిచేశార‌ని డిప్యూటీ సీఏం తెలిపారు. పూలే దంపుతుల‌ వేసిన పునాదుల మీద సాగుతూ వారి ఆశయాలను, లక్ష్యాలను సాధించడంలో మా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కృషి చేస్తుంద‌ని చెప్పారు. పూలే దంప‌తుల పోరాటానికి సజీవ దృశ్యంలా ఈ సినిమా ఉంద‌ని మామిడి హ‌రికీష్ణ చెప్పారు. పేద‌వారికి విద్యావంతుల‌ను చేయ‌డ‌మే కాకుండా మహిళా వివక్షను, దురాచారాలను రూపు మాపేందుకు కృషి చేస్తూ సమాజం కోసం జ్యోతిరావు పూలే, సావిత్రీబాయి పూలే తమ జీవితాలను అంకితం చేశార‌ని కాంగ్రెస్ నేత వీహెచ్ పేర్కొన్నారు. రెండు గంటలకు పైగా సమయం వెచ్చించి పూలే సినిమాన ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి చూడటం సంతోషంగా ఉంద‌ని నిర్మాత పొన్నం ర‌విచంద్ర అన్నారు.

 

Advertisement

తాజావార్తలు

Advertisement