Christopher Nolan | తొలిసారిగా భారత్‌కు క్రిస్టోఫర్ నోలన్.. వచ్చే నెలలో ముంబయిలో ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్
Christopher Nolan | హాలీవుడ్ సినీ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా భారత్‌కు రానున్నారు. ఆయన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్ కార్యక్రమం కోసం జులైలో ముంబయికి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది.
Entertainment | Published On Jun 17, 2026, 8.25 pm IST
Christopher Nolan | హాలీవుడ్ సినీ అభిమానులకు గుడ్‌న్యూస్. ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ తొలిసారిగా భారత్‌కు రానున్నారు. ఆయన తాజా చిత్రం ‘ది ఒడిస్సీ’ ప్రీమియర్ కార్యక్రమం కోసం జులైలో ముంబయికి రానున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ ప్రకటించింది. ఈ వేడుకకు నోలన్‌తో పాటు చిత్రంలో కీలక పాత్రలు పోషించిన మ్యాట్ డామన్, టామ్ హాలండ్, నిర్మాత ఎమ్మా థామస్ హాజరుకానున్నారు. నోలన్ తెరకెక్కించిన సినిమా ప్రీమియర్‌ను అధికారికంగా భారత్‌లో నిర్వహించడం ఇదే తొలిసారి. వచ్చే నెల 17న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగంగా లండన్, పారిస్, న్యూయార్క్ వంటి ప్రధాన నగరాలతో పాటు ముంబయికి సైతం చోటు కల్పించడం భారతీయ సినీ మార్కెట్‌కు పెరుగుతున్న ప్రాధాన్యతకు నిదర్శనంగా భావిస్తున్నారు. ప్రాచీన గ్రీకు కవి హోమర్ రచించిన ‘ఒడిస్సీ’ ఇతిహాసం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.
ట్రోయ్ యుద్ధం అనంతరం తన స్వదేశానికి చేరుకునేందుకు ఒడిస్సియస్ చేసిన సుదీర్ఘ ప్రయాణం ఈ కథకు ప్రధానాంశంగా ఉండనుంది. సాంకేతికంగా కూడా ఈ చిత్రం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. అత్యాధునిక ఐమ్యాక్స్ ఫిల్మ్ సాంకేతికతతో పూర్తిగా ఐమ్యాక్స్ కెమెరాల ద్వారా చిత్రీకరించిన తొలి ఫీచర్ చిత్రంగా ఇది నిలవనుంది. ముంబయిలోని ఫీనిక్స్ పల్లాడియం హాల్‌లో ఐమ్యాక్స్ థియేటర్‌లో ప్రీమియర్ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ చిత్రంలో మ్యాట్ డామన్, టామ్ హాలండ్‌లతో పాటు ఆన్ హాతవే, రాబర్ట్ ప్యాటిన్సన్, లుపిటా న్యోంగో, జెండాయా, చార్లీజ్ థెరాన్ తదితర ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నోలన్, ఎమ్మా థామస్ తమ నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే దేశంలోని పలు థియేటర్లలో ‘ది ఒడిస్సీ’ ఐమ్యాక్స్ వెర్షన్‌కు అడ్వాన్స్‌డ్ టికెట్ బుకింగ్‌లు ప్రారంభమయ్యాయి.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం
- ●Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!
- ●UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?
- ●T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర
- ●Kavitha | రాజకీయం అంటే బూతులేనా..? కోస్గి సభలో కాంగ్రెస్ ప్రభుత్వంపై కవిత ఫైర్..
- ●Maithili Thakur | రోల్స్ రాయిస్‌లో ఎమ్మెల్యే.. ట్రోలింగ్‌పై కంగనా ఫైర్..

Khairatabad ganesh | ఖైరతాబాద్ గణేశ్.. నిన్న ఒక్కరోజే 4 లక్షల మంది దర్శనం

Horoscope | సెప్టెంబర్ 21 రాశిఫలాలు.. ఈ రాశి వారికి సహోద్యోగులతో సవాళ్లు..!

UPI Transaction Charges 2026 | నాడు 'జీరో'.. నేడు ఫీజు బాదుడు.. ఉచితం అంటూ అలవాటు చేసి.. ఇప్పుడు యూపీఐకీ రుసుమా?

T20 Cricket | స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో చరిత్ర




