త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | మూసీ భూసేక‌ర‌ణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు

Revanth Reddy | మూసీ ప్రాజెక్టు కోసం భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని.. ల్యాండ్ పూలింగ్‌లో ఎటువంటి చిక్కులు రాకుండా చూడాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న‌తాధికారులను ఆదేశించారు. మూసీ ఫేజ్‌-2కు అతి త్వ‌ర‌లో టెండ‌ర్లు పిల‌వాల‌ని సూచించారు.

S

Telangana | Published On Aug 25, 2026, 5.47 pm IST

Revanth Reddy | మూసీ భూసేక‌ర‌ణలో వేగం పెంచండి.. చిక్కులు రావొద్దు
Advertisement
  • ఫేజ్-2కు త్వరగా టెండర్లు పిలవాలి
  • అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపై మున్సిపల్ కమిషనర్లు దృష్టి పెట్టాలి
  • మూసీపై ఉన్నతాధికారుతో నిర్వ‌హించిన స‌మీక్ష‌లో సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం

Revanth Reddy | త్రినేత్ర‌.న్యూస్‌: మూసీ ప్రాజెక్టు కోసం భూ సేక‌ర‌ణ‌ను వేగ‌వంతం చేయాల‌ని.. ల్యాండ్ పూలింగ్‌లో ఎటువంటి చిక్కులు రాకుండా చూడాల‌ని సీఎం రేవంత్‌రెడ్డి ఉన్న‌తాధికారులను ఆదేశించారు. మూసీ ఫేజ్‌-2కు అతి త్వ‌ర‌లో టెండ‌ర్లు పిల‌వాల‌ని సూచించారు. అతి త‌క్కువ వ‌డ్డీకి వ‌చ్చే రుణాల‌పై మున్సిప‌ల్ క‌మిష‌న‌ర్లు దృష్టి పెట్టాల‌న్నారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి పెవిలియన్‌లో మూసీపై ఉన్న‌తాధికారుల‌తో క‌లిసి మంగ‌ళ‌వారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స‌మీక్షించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ప‌లు సూచ‌న‌లు చేశారు.

మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆల‌య టెండ‌ర్లు పిల‌వండి..

మూసీ ప్రాజెక్ట్ కోసం భూ సేకరణను వేగవంతం చేయాలి. ల్యాండ్ పూలింగ్‌పై స్పష్టమైన విధానం రూపొందించుకోవాలి. ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్, అసైన్డ్ భూముల సేకరణపై స్పష్టమైన విధానం తయారు చేసుకోవాలి. న్యాయపరమైన చిక్కులు రాకుండా చూసుకోవాలి. మూసీ ప్రాజెక్టు ఫేజ్-2 కు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలి. ప్రాజెక్ట్‌లకు అతి తక్కువ వడ్డీకి వచ్చే రుణాలపైన దృష్టి పెట్టాలి. టీడీఆర్ పైన ప్రతి వారం సమీక్ష జరగాలి.
మంచిరేవుల ఓంకారేశ్వరస్వామి ఆలయం టెండర్లు తక్షణం పిలవాలి. కొత్వాల్ గూడా బర్డ్స్ పార్క్‌కు మరింత ప్రచారం కల్పించాలి.

ఈ స‌మీక్షా స‌మావేశానికి సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, HMDA కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, GHMC కమిషనర్ ఆర్.వి.కర్ణన్, మల్కాజ్‌గిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, సైబరాబాద్ కమిషనర్ సృజన, రంగా రెడ్డి జిల్లా క‌లెక్ట‌ర్‌ నారాయణ రెడ్డి, మేడ్చల్‌ కలెక్టర్‌ మను చౌదరి, ఎంఆర్డీసీఎల్ ఎండీ ఈ.వి.నరసింహ రెడ్డి, ఎంఆర్డీసీఎల్ జేఎండీ గౌత‌మి, ఇతర ఉన్నతాధికారులు హాజ‌ర‌య్యారు.

Advertisement
Advertisement