త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Minister Ponnam | చ‌దువుకు ఆటంకం క‌లుగ‌కుండా ఫీజు రీయింబ్స్‌మెంట్

Minister Ponnam | పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్ స్ప‌ష్టం చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశలవారీగా చెల్లించడంతో పాటు.. ఇకపై విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిధులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 25, 2026, 5.07 pm IST

Minister Ponnam | చ‌దువుకు ఆటంకం క‌లుగ‌కుండా ఫీజు రీయింబ్స్‌మెంట్
Advertisement
  • ద‌శ‌ల‌వారీగా ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ చెల్లింపు
  • విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే అందేలా చర్యలు
  • కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యాయం చేస్తోంది
  • రాజకీయాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
  • మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్‌

Minister Ponnam | పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కొనసాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్‌గౌడ్ స్ప‌ష్టం చేశారు. గతంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను దశలవారీగా చెల్లించడంతో పాటు.. ఇకపై విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా నిధులు అందించే విధానాన్ని అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విషయంలో విద్యార్థుల సమస్యలను పట్టించుకోలేదని మంత్రి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెండింగ్‌ బకాయిల చెల్లింపుపై దృష్టి సారించడంతో పాటు.. భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చెల్లింపులు చేసే విధానాన్ని తీసుకొచ్చామని తెలిపారు.

విద్యా మౌలిక వసతులపై దృష్టి

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ స్కూళ్ల ఏర్పాటు, విద్యా మౌలిక వసతుల కల్పన, డైనింగ్‌ చార్జీల చెల్లింపు, ఉపాధ్యాయుల నియామకాలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. పేద పిల్లల చదువుకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారకుండా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు. పాత బకాయిలను కూడా దశలవారీగా చెల్లిస్తున్నామని.. కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల విద్యకు సంబంధించిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.

బీజేపీ రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా?

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అంశాన్ని కొందరు నేతలు రాజకీయ విమర్శలకు ఉపయోగించుకుంటున్నారని మండిప‌డ్డారు. రాజకీయంగా ఉనికిని చాటుకోవడం కోసమే విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తున్నారని విమర్శించారు. రాహుల్‌గాంధీ పేరును ప్రస్తావిస్తూ విమర్శలు చేసే ముందు.. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఇదే తరహాలో ఉచిత విద్య లేదా ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలు చేస్తున్నారా? అని ప్ర‌శ్నిచారు. తెలంగాణకు నిధులు, హక్కుల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని ఆరోపించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యతను విస్మరించి.. అంతర్గత రాజకీయాల కోసం కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. విద్యార్థుల భవిష్యత్తు, పేద ప్రజల విద్యాభివృద్ధే కాంగ్రెస్ ప్ర‌భుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడకుండా.. విద్యా రంగ అభివృద్ధికి అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. దేశంలో బీజేపీ ప్రభుత్వం విద్యార్థులు, యువతకు వ్యతిరేకంగా వ్యవహరిస్తుండటం వల్లే ‘జెన్‌-జీ’ తరహా ఉద్యమాలు వస్తున్నాయని మంత్రి విమ‌ర్శించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement