MSVP Day 1 Collections | మన శంకర వరప్రసాద్ ఫస్ట్ డే కలెక్షన్స్ – బాక్సాఫీస్ వద్ద మెగాస్టార్ ఊచకోత
చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారు మూవీ ఫస్ట్ డే రికార్డ్ కలెక్షన్స్ రాబట్టింది. సోమవారం రోజు ఈ సినిమాకు 84 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు మేకర్స్ వెల్లడించారు. ఫన్ ఫ్యామిలీ డ్రామాగా రూపొందిన ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు.
Entertainment | Published On Jan 13, 2026, 2.34 pm IST
MSVP Day 1 Collections | మన శంకర వరప్రసాద్ గారు బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డే కుమ్మేసింది. చిరంజీవి కెరీర్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా సోమవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తొలిరోజు ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా 84 కోట్ల కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోస్టర్‌ను అభిమానులతో పంచుకున్నారు.
నైజాంలో హయ్యెస్ట్...
నైజాంలో మన శంకర వరప్రసాద్‌గారు రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రీమియర్స్‌తో కలిపి ఇరవై కోట్లకుపైగా గ్రాస్...9.3 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది. సైరా, ఆచార్య సినిమాల రికార్డులను బ్రేక్ చేసింది.
మొదటి రోజే ఈ సినిమా 42 శాతం వరకు రికవరీ సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మన శంకర వరప్రసాద్‌గారు ప్రీ రిలీజ్ బిజినెస్ 125 కోట్ల వరకు జరిగింది. మొదటి రోజు ఓపెనింగ్స్ జోరు చూస్తుంటే ఈ వీకెండ్ లోగా ఈ సినిమా లాభాల్లోకి అడుగుపెట్టడం ఖాయంగానే కనిపిస్తోంది. ప్రభాస్ రాజాసాబ్‌తో పాటు మంగళవారం రిలీజైన రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలకు నెగెటివ్ టాక్ రావడంతో మన శంకర వరప్రసాద్‌గారుకు కలిసివచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతి రిలీజ్‌లలో మన శంకర వరప్రసాద్‌గారు హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
చిరంజీవి కామెడీ టైమింగ్...
ఫన్ ఫ్యామిలీ డ్రామా ఎలిమెంట్స్‌తో దర్శకుడు అనిల్ రావిపూడి మన శంకర వరప్రసాద్‌గారును రూపొందించారు. తనకు దూరమైన భార్య పిల్లలకు తిరిగి భర్త ఎలా దగ్గరయ్యాడనే కాన్సెప్ట్‌కు తనదైన మార్కు ఎంటర్‌టైన్‌మెంట్ ను జోడించి ఈ సినిమాను తెరకెక్కించారు అనిల్ రావిపూడి. చిరంజీవి కామెడీ టైమింగ్, స్వాగ్‌తో పాటు వెంకటేష్ గెస్ట్ రోల్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అంటూ అభిమానులు ట్వీట్స్, కామెంట్స్ పెడుతున్నారు.
మన శంకర వరప్రసాద్‌గారులో నయనతార హీరోయిన్‌గా నటించింది. కేథరీన్, హర్షవర్ధన్, శరద్ ఖేల్కర్ కీలక పాత్రల్లో కనిపించారు. భీమ్స్ ఈ సినిమాకు మ్యూజిక్ అందించారు. సాహు గారపాటితో కలిసి చిరంజీవి కూతురు సుస్మిత కొణిదెల మన శంకర వరప్రసాద్‌గారు నిర్మించింది.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



