లోడ్ అవుతోంది...


Sankranthi Movies OTT | సంక్రాంతికి రిలీజైన చిరంజీవి మన శంకర వరప్రసాద్‌గారుతో పాటు రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాలు ఒకే ఓటీటీలో రిలీజ్ కాబోతున్నాయి. ఈ రెండు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 ఓటీటీ సొంతం చేసుకుంది. నాలుగు నుంచి ఆరు వారాల గ్యాప్‌లో ఈ రెండు పండుగ సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి.
చిరంజీవి హీరోగా నటించిన మన శంకర వరప్రసాద్‌గారు మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీలో వెంకటేష్ గెస్ట్ రోల్‌లో కనిపించారు. చిరు, వెంకీ కాంబినేషన్‌కు టాలీవుడ్‌లో ఉన్న క్రేజ్ కారణంగా థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఓటీటీ హక్కులను దాదాపు 80 కోట్లకు జీ5 ఓటీటీ సొంతం చేసుకున్నట్లు సమాచారం. మన శంకర వరప్రసాద్‌గారు ఫిబ్రవరి నెలాఖరున లేదా మార్చి ఫస్ట్ వీక్‌లో ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఓటీటీ రిలీజ్ ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది.
సోమవారం రిలీజైన ఈ మూవీ తొలిరోజు ప్రీమియర్స్‌తో కలిపి వరల్డ్ వైడ్‌గా 84 కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ వెల్లడించారు. మన శంకర వరప్రసాద్‌గారు మూవీలో నయనతార హీరోయిన్‌గా నటించింది. కేథరిన్ కీలక పాత్రలో నటించింది.
రవితేజ, కిషోర్ తిరుమల కాంబినేషన్‌లో రూపొందిన భర్త మహాశయులకు విజ్ఞప్తి ఓటీటీ రైట్స్‌ను జీ5 ఓటీటీ దక్కించుకుంది. ఫిబ్రవరి మూడో వారంలో ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం. భర్త మహాశయులకు విజ్ఞప్తి మూవీలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయతి హీరోయిన్లుగా నటించారు.
ఈ సినిమా కోసం రవితేజ తన మాస్ మహారాజా ట్యాగ్‌ను పక్కనపెట్టారు. సెటిల్డ్ యాక్టింగ్‌తో ఆకట్టుకున్నారు. కానీ కిషోర్ తిరుమల అందించిన కథ, ఆయన టేకింగ్‌పై మాత్రం నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. మన శంకర వరప్రసాద్‌గారు, భర్త మహాశకులకు విజ్ఞప్తి ఈ రెండు సినిమాలకు భీమ్స్ మ్యూజిక్ అందించారు.

జనవరి 12, 2026

జనవరి 11, 2026

జనవరి 7, 2026





Developed & Published by TRINETHRA MEDIA HOUSE PVT. LTD,
Sai Madhu Towers, Plot No. 17, Rohini Layout Rd, Jaihind Enclave, Madhapur, Hyderabad, Telangana 500081.
Copyright © 2025 . All rights reserved. - Powered by : Veegam