Chiranjeevi | చరణ్ బర్త్‌డే స్పెషల్‌గా సెలబ్రేట్ చేసిన చిరంజీవి – తనయుడి కల నెరవేర్చిన మెగాస్టార్
తనయుడు రామ్‌చరణ్ పుట్టినరోజును ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. కొడుకు కలను నెరవేర్చారు. అంతే కాకుండా ఎన్టీఆర్ అవార్డు తాలూకు ప్రైజ్‌మనీని రామ్‌చరణ్ పుట్టినరోజు నాడు ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు చిరంజీవి.
Entertainment | Published On Mar 27, 2026, 5.40 pm IST
Chiranjeevi | తనయుడు రామ్‌చరణ్ బర్త్‌డేను మెగాస్టార్ చిరంజీవి గుర్తుండిపోయేలా సెలబ్రేట్ చేశారు. చరణ్ పుట్టినరోజు సందర్భంగా స్వగృహంలో ఓ హోమం నిర్వహించారు. అంతే కాకుండా ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లో భాగంగా తాను స్వీకరించిన ఎన్టీఆర్ నేషనల్ అవార్డు తాలూకు ప్రైజ్‌మనీని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా అందజేశారు. రామ్‌చరణ్‌ను కలవాలని చాలా రోజులుగా ఎదురుచూస్తోన్న కొందరు వృద్ధులను కొడుకు పుట్టినరోజునాడు మెగాస్టార్ కలిశారు. వారికి స్వయంగా భోజనం వడ్డించడమే కాకుండా నూతన వస్త్రాలు అందజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతోన్నాయి.
శ్రీరామనవమి రోజున హోమం...
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా శుక్రవారం స్వగృహంలో కొడుకు చేత ప్రత్యేకంగా ఓ హోమం చేయించారు. ఇందుకు సంబంధించిన వీడియోను అభిమానులతో పంచుకున్నారు చిరంజీవి. ఈ ఏడాది శ్రీరామనవమి రోజు యాదృచ్చికంగా చరణ్ పుట్టినరోజు కలిసి రావడం ఎంతో సంతోషంగా ఉందంటూ ఓ పోస్ట్ పెట్టారు.
ఎంతో మందికి స్ఫూర్తి...
తనయుడు రామ్‌చరణ్‌కు ఎమోషనల్‌గా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు చిరంజీవి. రామ్‌చరణ్‌తో కలిసి దిగిన కొన్ని రేర్ ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు నా చేయి పట్టుకుని నడిచిన స్థాయి నుండి, ఈరోజు ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచే స్థాయికి నువ్వు ఎదిగిన తీరు చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉందంటూ చరణ్‌ను ఉద్దేశించి సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు చిరంజీవి.
సినిమాను, పర్సలైఫ్‌ను నువ్వు బ్యాలెన్స్ చేసుకునే తీరు... కుటుంబం పట్ల నీకున్న బాధ్యత గౌరవం, దైవభక్తి, క్రమశిక్షణతో పాటు నువ్వు పాటించే విలువలు చూస్తుంటే ఆనందంగా ఉంది.. ఇవన్నీ చూసిన ప్రతిసారీ నీపై నాకున్న ప్రేమాభిమానాలు పెరుగుతూనే ఉన్నాయంటూ ఈ ట్వీట్‌లో చిరంజీవి పేర్కొన్నారు.
పది లక్షలు విరాళం...
ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రదానం చేసిన గద్దర్ అవార్డ్స్‌లో చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. ఈ పురస్కారంతో పాటు ప్రభుత్వం ఆయనకు పది లక్షల ప్రైజ్‌మనీ ఇచ్చింది. ఈ ప్రైజ్‌మనీని చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఐదు స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇస్తున్నట్లు చిరంజీవి వెల్లడించారు. సర్వ్ ఫౌండేషన్‌కు చెందిన వృద్ధులు కొందరు గేమ్ ఛేంజర్ షూటింగ్ సమయంలో రామ్‌చరణ్ కలిశారు. తన పుట్టినరోజును వారితో సెలబ్రేట్ చేసుకుంటానని ఆ టైమ్‌లో రామ్‌చరణ్ మాటిచ్చారు. కొడుకు ఇచ్చిన మాటను చిరంజీవి నిజం చేశారు. 30 మంది వృద్ధులను హైదరాబాద్‌కు రప్పించారు. వారికి స్వయంగా భోజనం వడ్డించడమే కాకుండా నూతన వస్త్రాలు బహుకరించారు.
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



