Bollywood | బాలీవుడ్‌లో విషాదం – ఛావా మూవీ నటి ఆత్మహత్య – సోషల్ మీడియాలో యాక్టివ్…అంతలోనే విషాదం!
బాలీవుడ్ టాప్ సీరియల్ యాక్టర్ సంచిత ఉగాలే ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ఆమె మరణానికి గల కారణాలేమిటన్నది తెలియరాలేదు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ ఛావాలో సంచిత నటించింది. కుంకుమ్‌భాగ్య, సుకున్ వంటి టీవీ సీరియల్స్‌తో సంచిత ఫేమస్ అయ్యింది.
Entertainment | Published On Jun 15, 2026, 2.16 pm IST
Bollywood | బాలీవుడ్‌లో విషాదం నెలకొంది. ప్రముఖ బుల్లితెర నటి, ఛావా మూవీ ఫేమ్ సంచిత ఉగాలే (30 ) ఆదివారం ఆత్మహత్య చేసుకుంది. ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. సంచిత ఉగాలే హఠాన్మరణం బాలీవుడ్ వర్గాలతో పాటు బుల్లితెర అభిమానులను షాక్‌కు గురిచేస్తోంది. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటన్నది వెల్లడికాలేదు. సూసైడ్ చేసుకోవడానికి కొద్ది గంటల ముందు కూడా సోషల్ మీడియాలో సంచిత యాక్టివ్‌గా ఉంది. డఫ్లీ వాలే డఫ్లీ బజా సాంగ్‌ను పాడుతున్నట్లుగా లిప్ సింక్ ఇచ్చిన ఓ రీల్‌ను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో చాలా సంతోషంగా కనిపించింది. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే సంచిత సూసైడ్ చేసుకుందనే న్యూస్ బయటకు రావడంతో ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు. సంచిత దూరమైందంటే నమ్మలేకపోతున్నామంటూ ఈ వీడియోకు కామెంట్లకు పెడుతోన్నారు.
సీరియల్స్‌తో ఫేమస్...
టీవీ సీరియల్ యాక్టర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన సంచిత ఛావాతో పాటు మరికొన్ని బాలీవుడ్ సినిమాల్లో నటించింది. జీ తెలుగులో టెలికాస్ట్ అయిన పాపులర్ సీరియల్ కుంకుమ్‌భాగ్యతో సంచిత ఉగాలే పేరు బుల్లితెరపై మారుమోగింది. ఈ సీరియల్‌లో దియా టాండన్ పాత్రలో నాచురల్ యాక్టింగ్‌తో ఫ్యాన్స్‌ను మెప్పించింది. ఆ తర్వాత వాగ్లే కీ దినియా, దిల్ వాలీ దుల్హా లే జాయేగీ, సుకున్ తో బాలీవుడ్‌లో టాప్ సీరియల్ యాక్టర్‌గా మారిపోయింది.
ఛావాలో...
విక్కీ కౌశల్, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ ఛావాలో ఓ కీలక పాత్రలో నటించింది. ఈ హిస్టారికల్ మూవీలో తార రాణిగా కనిపించింది. మనోజ్ బాజ్‌పేయి హీరోగా నటించిన సైలైన్స్ 2 మూవీలో సంచిత డిఫరెంట్ రోల్ చేసింది. సంచిత సూసైడ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారట. కెరీర్ ఆశించిన స్థాయిలో సాగకపోవడం, వ్యక్తిగత జీవితంలోని ఒడిదుడుకుల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..
- ●Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి
- ●White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..
- ●Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..
- ●Sreeleela | లెనిన్ రిలీజ్ వేళ - శ్రీలీలను ట్రోల్ చేస్తున్న నెటిజన్లు - ఎందుకంటే?
- ●Nora Fatehi | ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌లో మొరాకో ఓటమి - కన్నీళ్లు పెట్టుకున్న నోరా ఫతేహి - కారణం ఇదే!

Reverse Waterfall | రివర్స్ వాటర్‌ఫాల్.. ఆ అద్భుత దృశ్యం చూస్తే పులకించిపోవాల్సిందే..

Hyderabad | ఎగ్జామ్ ప్యాడ్‌ను విసిరేసిన టీచర్.. తెగిపోయిన విద్యార్థిని చెవి

White Cobra | నిర్మల్ జిల్లాలో అరుదైన శ్వేతనాగు ప్రత్యక్షం..

Hyderabad | కలిసి మద్యం సేవించారు.. స్నేహితుడిని హత్య చేశారు..





