త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

OTT | ఓటీటీలోకి మ‌ల‌యాళం హీరోయిన్ తెలుగు మూవీ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?

మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ న‌టించిన తెలుగు మూవీ ఛాంపియ‌న్ ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది.

N

Entertainment | Published On Jan 24, 2026, 2.40 pm IST

OTT  |  ఓటీటీలోకి మ‌ల‌యాళం హీరోయిన్ తెలుగు మూవీ – స్ట్రీమింగ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఏవంటే?
Advertisement

OTT | ఛాంపియ‌న్ మూవీతో మ‌ల‌యాళ హీరోయిన్ అన‌స్వ‌ర రాజ‌న్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ హీరో శ్రీకాంత్ త‌న‌యుడు రోష‌న్ క‌థానాయ‌కుడిగా న‌టించారు. ప్ర‌దీప్ అద్వైతం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది. జ‌న‌వ‌రి 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను నెట్‌ఫ్లిక్స్ అఫీషియ‌ల్‌గా ప్ర‌క‌టించింది. ఓ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేసింది.

టాక్ బాగున్నా...

డిసెంబ‌ర్ నెలాఖ‌రున థియేట‌ర్ల‌లోకి వ‌చ్చిన ఛాంపియ‌న్ మంచి సినిమాగా టాక్ వ‌చ్చినా నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌నే మిగిల్చింది. క‌థ‌ను న‌మ్మి న‌ల‌భై ఐదు కోట్ల భారీ బ‌డ్జెట్‌తో ప్రియాంక‌ద‌త్‌, జెమిని కిర‌ణ్ ఈ సినిమాను నిర్మించారు. కాన్సెప్ట్ తో పాటు టెక్నిక‌ల్‌గా మాత్రం బాగుంద‌నే టాక్ వ‌చ్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడించి ప్ర‌దీప్ అద్వైతం ఈ సినిమాను రూపొందించారు.
ఛాంపియ‌న్ మూవీలో...
ఛాంపియ‌న్ సినిమాలో నంద‌మూరి క‌ళ్యాణ‌చ‌క్ర‌వ‌ర్తి, సంతోష్ ప్ర‌తాప్‌, కేకే మీన‌న్‌, ప్ర‌కాష్ రాజ్ ముఖ్య పాత్ర‌ల్లో క‌నిపించారు. మ‌ల‌యాళం హీరో దుల్క‌ర్ స‌ల్మాన్ గెస్ట్ రోల్ చేశాడు. మిక్కీ జే మేయ‌ర్ మ్యూజిక్ ఈ సినిమాకు బిగ్గెస్ట్ ప్ల‌స్ పాయింట్‌గా నిలిచింది. గిరా గిరా సాంగ్ పెద్ద హిట్ట‌య్యింది.

పెళ్లి సంద‌డి త‌ర్వాత‌....

సీనియ‌ర్ డైరెక్ట‌ర్ రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందిన పెళ్లి సంద‌డి మూవీతో రోష‌న్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. అత‌డు హీరోగా న‌టించిన సెకండ్ మూవీ ఇది. ఇందులో ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌గా, పోరాట యోధుడిగా రెండు డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన పాత్ర‌లో క‌నిపించాడు మైఖేల్‌ (రోష‌న్‌) ఓ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్‌. ఇంగ్లండ్‌లో సెటిల‌వ్వాల‌ని అనుకుంటాడు. మైఖేల్ తండ్రిపై దేశ‌ద్రోహి అనే ముద్ర ప‌డ‌టంతో సాధ్యం కాదు. ఇంగ్లండ్ వెళ్ల‌డం కోసం హైద‌రాబాద్ నుంచి బీద‌ర్‌కు అక్ర‌మంగా ఆయుధాల‌ను స‌ర‌ఫ‌రా చేసేందుకు ఒప్పుకుంటాడు మైఖేల్‌. పోలీస్ ఆఫీస‌ర్‌తో గొడ‌వ కార‌ణంగా అనుకోకుండా భైరాన్‌ప‌ల్లిలో త‌ల‌దాచుకోవాల్సివ‌స్తుంది. ఆ ఊరిలో అడుగుపెట్టిన త‌ర్వాత మైఖేల్ జీవితం ఎలా మారిపోయింది అనే అంశాల‌తో ఛాంపియ‌న్ రూపొందింది.

Advertisement

తాజావార్తలు

Advertisement