Thalapathy Vijay | దళపతి విజయ్‌కి సీబీఐ నోటీసులు – కారణం ఇదే
కరూర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి టీవీకే పార్టీ అధినేత, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కి సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఢిల్లీలోని సీబీఐ ఆఫీస్‌కు వ్యక్తిగత విచారణకు హాజరుకావాలంటూ ఈ నోటీసులో పేర్కొన్నారు.
Entertainment | Published On Jan 6, 2026, 3.46 pm IST
Thalapathy Vijay | కరూర్ తొక్కిసలాట ఘటనలో కోలీవుడ్ సినీ నటుడు, టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్‌కి సీబీఐ అధికారులు షాకిచ్చారు. ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరుకావాలంటూ విజయ్‌కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 12న ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ని సీబీఐ అధికారులు విచారించబోతున్నారు. వ్యక్తిగతంగానే ఈ విచారణకు హాజరు కావాలని నోటీసులలో సీబీఐ అధికారులు పేర్కొన్నట్లు సమాచారం.
ఇటీవలే సినిమాలకు గుడ్‌బై చెప్పి పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు విజయ్ ప్రకటించాడు. విజయ్ అనౌన్స్ చేసిన కొద్ది రోజులకే సీబీఐ నుంచి అతడికి నోటీసులు అందడం తమిళనాడు సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
41 మంది మరణం...
గత ఏడాది సెప్టెంబర్‌లో తమిళనాడులోని కరూర్‌లో విజయ్ టీవీకే ప్రచార సభను ఏర్పాటు చేశారు. ఈ ప్రచార సభకు భారీగా జనం తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 41 మంది మరణించగా , 60 మందికిపైగా గాయపడ్డారు. ఈ తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇటీవలే సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశాలను జారీ చేసింది. మాజీ న్యాయమూర్తి అజయ్ రస్తోగి నేతృత్వంలో విచారణ కొనసాగుతోంది.
సెన్సార్ చిక్కులు...
కాగా విజయ్ హీరోగా నటిస్తున్న చివరి మూవీ జననాయగన్ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పొలిటికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి సెన్సార్ పరంగా అభ్యంతరాలు ఎదురయ్యాయి. ఈ సినిమాలోని పొలిటికల్ డైలాగ్స్ తొలగించాలంటూ సెన్సార్ సభ్యులు డిమాండ్ చేసినట్లు సమాచారం. సినిమా పోస్ట్‌పోన్ కానున్నట్లు ప్రచారం జరిగింది. చివరకు మంగళవారం రోజు సెన్సార్ నుంచి క్లియరెన్స్ వచ్చింది. జననాయగన్ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోంది. హెచ్ వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ బాలకృష్ణ తెలుగు మూవీ భగవంత్ కేసరికి రీమేక్‌గా తెరకెక్కుతోంది.
సంబంధిత వార్తలు

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

TVK | రెబల్ ఎమ్మెల్యేలకు కేబినెట్లో చోటు.. సీపీఎం హెచ్చరికలతో ప్రచారానికి చెక్‌పెట్టిన టీవీకే
మే 20, 2026

NEET UG | అన్నీ సేమ్.. గెస్ పేపర్లో అడిగిన కెమిస్ట్రీ ప్రశ్నలే నీట్ యూజీలో కూడా!
మే 20, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



