త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jana Nayagan | విజయ్‌ ‘జన నాయగన్‌’ వచ్చేదెన్నడూ..? ఇంకా వీడని ‘సీబీఎఫ్‌సీ’ కష్టాలు..!

Jana Nayagan | తమిళ స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలకు కొద్దికాలం విరామం ప్రకటించనున్నారు. ప్రస్తుతం జననాయగన్‌ చివరి చిత్రంగా పేర్కొంటున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నది.

P

Entertainment | Published On Mar 10, 2026, 3.50 pm IST

Jana Nayagan | విజయ్‌ ‘జన నాయగన్‌’ వచ్చేదెన్నడూ..? ఇంకా వీడని ‘సీబీఎఫ్‌సీ’ కష్టాలు..!
Advertisement

Jana Nayagan | తమిళ స్టార్‌ హీరో విజయ్‌ రాజకీయ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సినిమాలకు కొద్దికాలం విరామం ప్రకటించనున్నారు. ప్రస్తుతం జననాయగన్‌ చివరి చిత్రంగా పేర్కొంటున్నారు. ఈ మూవీ రిలీజ్‌పై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉన్నది. దర్శకుడు హెచ్‌ వినోత్‌ తెరకెక్కించిన ఈ మూవీని మొదట ప్రపంచవ్యాప్తంగా జనవరి 9న విడుదల చేయాలని మేకర్స్‌ నిర్ణయించారు. అయితే, సెన్సార్‌ సర్టిఫికేట్‌ ఆలస్యం కావడంతో రిలీజ్‌ వాయిదా పడింది. గత కొన్ని రోజులుగా ‘జన నాయగన్’ చిత్రాన్ని త్వరలోనే సీబీఎఫ్‌సీ రివైజింగ్ కమిటీ వీక్షించనున్నట్టు ప్రచారం సాగింది. వీకెండ్‌కు ముందే సెన్సార్ సర్టిఫికేట్ వస్తుందని, వెంటనే కొత్త విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేశాయి.

తాజా సమాచారం ప్రకారం.. ఇవాళ (మార్చి 10) మధ్యాహ్నం 2 గంటలకు జరగాల్సిన రివైజింగ్ కమిటీ స్క్రీనింగ్ అనూహ్యంగా రద్దయినట్లు తెలుస్తోంది. సీబీఎఫ్‌సీ కమిటీకి చెందిన ఒక సభ్యుడు అస్వస్థతకు గురైనట్లు సమాచారం. ఈ క్రమంలో సర్టిఫికెట్‌ జారీ మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ పరిణామంపై విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘జన నాయగన్’ విడుదలను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేస్తున్నారని కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. దీంతో ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. ఇంతకుముందు చిత్రబృందం తమపై ఉన్న లీగల్ కేసును కూడా ఉపసంహరించుకుని, మరింత సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సినిమాను రివైజింగ్ కమిటీకి సమర్పించినట్లు అభిమానులు గుర్తు చేస్తున్నారు.

అయినా సెన్సార్ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని పేర్కొంటున్నారు. ఈ సమస్య మొదలై నెలలు గడుస్తున్నాయని.. ఇప్పటికీ చిత్రాన్ని బోర్డు పరిశీలించకపోవడం సరైంది కాదని విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రస్తుతం సెన్సార్ సర్టిఫికేషన్‌పై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. సెన్సార్ క్లియరెన్స్ కోసం ‘జన నాయగన్’ రిలీజ్‌ కోసం చిత్రబృందం ఆసక్తికరంగా ఎదురుచూస్తోంది. సర్టిఫికెట్ వచ్చాక రిలీజ్‌ డేట్‌ని ప్రకటించనున్నారు. ఈ మూవీని తెలుగులో బాలకృష్ణ నటించిన భగవంత్‌ కేసరికి రీమేక్‌గా తెరకెక్కిస్తున్నారు. మమితా బైజు, పూజాహెగ్డేతో పాటు పలువురు నటీనటులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.

Read Also : 

యూట్యూబ్‌లో రిలీజైన త‌ర్వాత ఓటీటీలోకి ఆమిర్‌ఖాన్ బాలీవుడ్ మూవీ - ఫ‌స్ట్ హిందీ సినిమా ఇదే

త్వ‌ర‌లోనే పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ స్పిన్న‌ర్ కుల్దీప్..! అమ్మాయి ఎవ‌రో తెలుసా..?

Advertisement
Advertisement