త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ar Murugadoss | శివ‌కార్తికేయ‌న్ సినిమాకు న‌ష్టాలు – ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్‌పై నిర్మాత‌ కంప్లైంట్‌

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్‌పై మ‌ద‌రాసి నిర్మాత త‌మిళ‌నాడు సినీ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌తో పాటు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో ఫిర్యాదుచేశారు. మురుగ‌దాస్ వ‌ల్లే మ‌ద‌రాసి సినిమా బ‌డ్జెట్ పెరిగి న‌ష్టాలు వ‌చ్చాయ‌ని త‌న కంప్లైంట్‌లో నిర్మాత పేర్కొన్నార‌ట‌.

N

Entertainment | Published On Mar 29, 2026, 7.40 pm IST

Ar Murugadoss | శివ‌కార్తికేయ‌న్ సినిమాకు న‌ష్టాలు – ద‌ర్శ‌కుడు ఏఆర్ మురుగ‌దాస్‌పై నిర్మాత‌ కంప్లైంట్‌
Advertisement

Ar Murugadoss |  కోలీవుడ్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ ఏఆర్ మురుగ‌దాస్ చిక్కుల్లో ప‌డ్డారు.  మురుగ‌దాస్‌పై త‌మిళ‌నాడు సినీ డైరెక్ట‌ర్స్ అసోసియేష‌న్‌తో పాటు ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లో మ‌ద‌రాసి నిర్మాత‌ కంప్లైంట్  చేశారు. శివ‌కార్తికేయ‌న్ హీరోగా మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన మ‌ద‌రాసి మూవీ గ‌త ఏడాది థియేట‌ర్ల‌లో రిలీజైంది. దాదాపు 170 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ వంద కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచిన మ‌ద‌రాసి నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది. ఈ న‌ష్టాల‌కు మురుగ‌దాస్ కార‌ణ‌మంటూ నిర్మాత ఎన్ఎస్ ప్ర‌సాద్ డైరెక్ట‌ర్ అసోసియేష‌న్‌లో ఫిర్యాదు చేశార‌ట‌. ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్‌లోనూ కంప్లైంట్ ఇచ్చార‌ట‌.

ప్లానింగ్ లేకుండా...

మ‌ద‌రాసి సినిమాను 115 కోట్ల బ‌డ్జెట్‌లోపే కంప్లీట్ చేస్తాన‌ని మురుగ‌దాస్ మాటిచ్చాడ‌ని, కానీ ఆ హామీని నిల‌బెట్టుకోలేక‌పోయాడ‌ని నిర్మాత త‌న కంప్లైంట్‌లో పేర్కొన్నారు. ఒక‌వైపు స‌ల్మాన్‌ఖాన్‌తో సికంద‌ర్ సినిమా చేస్తూనే మ‌రోవైపు మ‌ద‌రాసి షూటింగ్‌ను మురుగ‌దాస్ కొన‌సాగించార‌ని అది కూడా సినిమా ప‌రాజ‌యానికి ఓ కార‌ణ‌మ‌ని నిర్మాత ఆరోపించారు. ప్రాప‌ర్ ప్లానింగ్ లేకుండా మురుగ‌దాస్ సినిమా చేయ‌డంతోనే వ‌ర్కింగ్ డేస్ పెర‌గ‌డంతో పాటు బ‌డ్జెట్ కూడా 170 కోట్ల‌ను దాటింద‌ని అన్నారు. న‌ష్టాల భ‌ర్తీకిగాను 10 కోట్లు మురుగ‌దాస్ తిరిగి చెల్లించాల‌ని త‌న కంప్లైంట్‌లో నిర్మాత పేర్కొన్నారట. ఈ సినిమా న‌ష్టాల‌కు శివ‌కార్తికేయ‌న్‌తో ఎలాంటి సంబంధం లేద‌ని  నిర్మాత చెప్పినట్లు సమాచారం.

ర‌మ‌ణ సీక్వెల్‌...

నిర్మాత కంప్లైంట్‌పై ప్రొడ్యూస‌ర్ కౌన్సిల్ విచార‌ణ జ‌రిపిన‌ట్లు స‌మాచారం. ఈ విచార‌ణ‌కు మురుగ‌దాస్ హాజ‌ర‌య్యార‌ట‌. ప‌ది కోట్ల‌కు బ‌దులుగా త‌న నెక్స్ట్ మూవీ క‌థ‌ను నిర్మాణ సంస్థ‌కు ఉచితంగా ఇవ్వ‌డానికి మురుగ‌దాస్ అంగీక‌రించిన‌ట్లు చెబుతున్నారు. మ‌ద‌రాసి త‌ర్వాత ర‌మ‌ణ 2 మూవీని చేయ‌బోతున్నారు మురుగ‌దాస్‌. విజ‌య్ కాంత్ హీరోగా న‌టించిన ర‌మ‌ణ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కుతోంది. ర‌మ‌ణ మూవీ తెలుగులోనూ ఠాగూర్ పేరుతో రీమేక్ అయ్యింది.

Advertisement

తాజావార్తలు

Advertisement