త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cartoon Network Classics | 90ల‌లో అలరించిన కార్టూన్స్ మ‌ళ్లీ వ‌చ్చేశాయి.. ఎలా వీక్షించాలంటే..?

Cartoon Network Classics | చిన్నారులు కార్టూన్స్‌ను ఎంత ఆస‌క్తిగా వీక్షిస్తారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారు ఫోన్లు, యూట్యూబ్‌, స్మార్ట్ టీవీల‌లో కార్టూన్‌ల‌ను అధికంగా వీక్షిస్తున్నారు. శాటిలైట్ చానల్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటికి ఆద‌ర‌ణ త‌గ్గిపోతోంది. అయిన‌ప్పటికీ కార్టూన్స్‌కు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు.

S

Entertainment | Published On Dec 29, 2025, 4.59 pm IST

Cartoon Network Classics | 90ల‌లో అలరించిన కార్టూన్స్ మ‌ళ్లీ వ‌చ్చేశాయి.. ఎలా వీక్షించాలంటే..?
Advertisement

Cartoon Network Classics | చిన్నారులు కార్టూన్స్‌ను ఎంత ఆస‌క్తిగా వీక్షిస్తారో అంద‌రికీ తెలిసిందే. ప్ర‌స్తుతం వారు ఫోన్లు, యూట్యూబ్‌, స్మార్ట్ టీవీల‌లో కార్టూన్‌ల‌ను అధికంగా వీక్షిస్తున్నారు. శాటిలైట్ చానల్స్ ఉన్న‌ప్ప‌టికీ వాటికి ఆద‌ర‌ణ త‌గ్గిపోతోంది. అయిన‌ప్పటికీ కార్టూన్స్‌కు ఉన్న ఆద‌ర‌ణ మాత్రం త‌గ్గ‌డం లేదు. ఆ మాట‌కొస్తే చాలా మంది పెద్ద‌లు కూడా కార్టూన్స్‌ను తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఒక‌ప్పుడు.. అంటే 1990 నుంచి 2000వ సంవ‌త్స‌రం మ‌ధ్య కాలంలో వ‌చ్చిన కార్టూన్స్ చాలా వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌కు ల‌భించ‌డం లేదు. కానీ ఎయిర్ టెల్ డిజిట‌ల్ టీవీ మ‌ళ్లీ వాటిని అంద‌రికీ అందుబాటులోకి తెచ్చింది. ఒక‌ప్ప‌టి పాత త‌రం కార్టూన్‌ల‌ను మ‌ళ్లీ వీక్షించే అవ‌కాశం క‌ల్పిస్తోంది.

వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌తో భాగ‌స్వామ్యం..

టెలికాం సంస్థ భార‌తీ ఎయిర్‌టెల్ త‌న ఎయిర్‌టెల్ డిజిట‌ల్ టీవీ క‌స్ట‌మ‌ర్ల‌కు 1990ల నాటి కార్టూన్‌ల‌ను మ‌ళ్లీ వీక్షించే స‌దుపాయం క‌ల్పిస్తోంది. దీన్ని ఎయిర్ టెల్ డిజిట‌ల్ టీవీలో వాల్యూ యాడెడ్ స‌ర్వీస్‌గా ప్రత్యేక చాన‌ల్‌లో అందిస్తున్నారు. ఇందుకు గాను ఎయిర్ టెల్ డిజిట‌ల్ టీవీ సంస్థ వార్న‌ర్ బ్ర‌ద‌ర్స్‌, డిస్క‌వ‌రీ సంస్థ‌తో భాగ‌స్వామ్యం అయింది. ఈ క్ర‌మంలోనే పాత త‌రం కార్టూన్‌ల‌ను ప్రేక్ష‌కుల‌కు మ‌ళ్లీ అందుబాటులోకి తెచ్చారు. ఒక‌ప్పుడు కార్టూన్ నెట్ వ‌ర్క్ చాన‌ల్‌లో ప్రేక్ష‌కులు అత్య‌ధికంగా వీక్షించిన ప‌లు ప్ర‌ముఖ కార్టూన్‌ల‌ను ఈ స‌ర్వీస్ ద్వారా అందిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఎయిర్ టెల్ డిజిట‌ల్ టీవీ క‌స్ట‌మ‌ర్లు ప్ర‌స్తుతం టామ్ అండ్ జెర్రీ, ది ఫ్లిన్ స్టోన్స్‌, లూనీ టూన్స్‌, స్కూబీ-డూ, జానీ బ్రేవో వంటి కార్టూన్స్‌ను మ‌ళ్లీ చూసి ఎంజాయ్ చేయ‌వ‌చ్చు.

నెల‌కు రూ.59 రుసుము..

ఇక ఈ కార్టూన్‌ల‌ను ఫ్యామిలీ ప్రేక్ష‌కులు కూడా చూసే విధంగా మార్చి అందిస్తున్నారు. ఎయిర్‌టెల్ డిజిట‌ల్ టీవీ డీటీహెచ్ స‌ర్వీస్ వాడుతున్న‌వారు ఈ కార్టూన్‌ల‌ను 445 చాన‌ల్ ద్వారా వీక్షించ‌వ‌చ్చు. ఈ చానల్‌ను వీక్షించేందుకు నెల‌కు రూ.59 చెల్లించాల్సి ఉంటుంది. ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో కార్టూన్‌ల‌ను అందుబాటులో ఉంచారు. ఈ చాన‌ల్‌ను వీక్షించేందుకు ప్ర‌స్తుతం ఉన్న సెట్ టాప్ బాక్స్‌లు లేదా హార్డ్ వేర్‌ను అప్ గ్రేడ్ చేయాల్సిన ప‌ని కూడా లేదు. కేవ‌లం స‌బ్ స్క్రిప్ష‌న్ రుసుము చెల్లిస్తే చాలు, చాన‌ల్ యాక్టివేట్ అయిపోతుంది. వెంట‌నే కార్టూన్‌ల‌ను వీక్షించ‌వ‌చ్చు. ఎయిర్‌టెల్ ఎక్స్ స్ట్రీమ్ హెచ్‌డీ, ఎస్‌డీ సెట్ టాప్ బాక్సుల‌తోపాటు ఐపీటీవీలోనూ ఈ చాన‌ల్‌ను వీక్షించ‌వ‌చ్చు.

ప‌లు ర‌కాలుగా యాక్టివేష‌న్‌..

ఈ చాన‌ల్‌ను ప్రేక్ష‌కులు ప‌లు ర‌కాలుగా యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. సెట్ టాప్ బాక్స్‌లో నేరుగా దీన్ని యాక్టివేట్ చేయ‌వ‌చ్చు. లేదా డీటీహెచ్ స‌ర్వీస్ యాక్టివేట్ అయి ఉన్న ఫోన్ నంబ‌ర్‌తో సంబంధిత యాక్టివేష‌న్ నంబ‌ర్ కు మిస్డ్ కాల్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా కూడా చాన‌ల్ యాక్టివేట్ అవుతుంది. అలాగే ఎయిర్ టెల్ థాంక్స్ యాప్ ద్వారా కూడా ఈ చాన‌ల్‌ను యాక్టివేట్ చేసుకోవ‌చ్చు. చానల్ యాక్టివేట్ అయిన వెంట‌నే ఆయా కార్టూన్‌ల‌ను చూడ‌వ‌చ్చ‌ని, ఇక ఇందులో ఎలాంటి యాడ్స్ రావ‌ని ఎయిర్‌టెల్ డిజిట‌ల్ టీవీ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. ఇక త్వ‌ర‌లోనే మ‌రిన్ని పాత‌త‌రం కార్టూన్‌ల‌ను ఈ చాన‌ల్‌లో అందిస్తామ‌ని కూడా తెలిపారు.

Advertisement

తాజావార్తలు

Advertisement