త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Richest Comedian | ఇండియాలోనే రిచెస్ట్ క‌మెడియ‌న్ ఎవ‌రంటే? – టాప్ టెన్‌లో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క‌డు

ఇండియాలోనే రిచెస్ట్‌ క‌మెడియ‌న్ల లిస్ట్‌లో తెలుగు హాస్య‌న‌టుడు బ్ర‌హ్మానందం నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో ఉన్నాడు. బ్ర‌హ్మానందం మొత్తం ఆస్తి విలువ ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ని టాక్‌.

N

Entertainment | Published On Mar 2, 2026, 6.06 pm IST

Richest Comedian |  ఇండియాలోనే రిచెస్ట్ క‌మెడియ‌న్ ఎవ‌రంటే? – టాప్ టెన్‌లో టాలీవుడ్ నుంచి ఒకే ఒక్క‌డు
Advertisement

Richest Comedian | క‌మెడియ‌న్లు లేకుండా సినిమాను ఊహించ‌లేము. క‌మెడియ‌న్ల వ‌ల్లే హిట్ట‌యిన సినిమాలు ప్ర‌తి భాష‌లో క‌నిపిస్తుంటాయి. స్టార్ హీరోల రేంజ్‌లో క్రేజ్‌, ఇమేజ్ ఉన్న హాస్య‌న‌టులు చాలా మందే ఉన్నారు. క‌మెడియ‌న్ల రెమ్యూన‌రేష‌న్లు కూడా భారీ స్థాయిలోనే ఉన్నాయి. కోటి నుంచి ఐదు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్లు తీసుకునే క‌మెడియ‌న్లు వెన్నెల‌కిషోర్‌, బ్ర‌హ్మానందం లాంటి టాలీవుడ్ హాస్య‌న‌టులు త‌మ రెమ్యూన‌రేష‌న్‌ను రోజువారి ప్ర‌తిపాదిక‌న తీసుకుంటున్నారు. ఒక్క రోజు షూటింగ్‌కు వెన్నెల‌కిషోర్ 15 నుంచి ఇర‌వై ల‌క్ష‌ల మ‌ధ్య ఛార్జ్ చేస్తుంటాడు.

నంబ‌ర్ వ‌న్‌...

కాగా ఇండియాలోనే టాప్‌టెన్ రిచెస్ట్ క‌మెడియ‌న్ల లిస్ట్‌లో కూడా టాలీవుడ్ హాస్య‌న‌టుడు నంబ‌ర్ వ‌న్ ప్లేస్‌లో నిల‌వ‌డం గ‌మ‌నార్హం. ఆ క‌మెడియ‌న్ మ‌రెవ‌రో కాదు బ్ర‌హ్మానందం. ఆయ‌న మొత్తం ఆస్తుల విలువ ఐదు వంద‌ల కోట్ల‌కుపైనే ఉంటుంద‌ట‌. లెజెండ‌రీ యాక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న బ్ర‌హ్మానందం సుదీర్ఘ సినీ ప్ర‌యాణంలో వెయ్యికిపైనే సినిమాలు చేశాడు. అత్య‌ధిక సినిమాలు చేసిన న‌టుడిగా గిన్నిస్ బుక్ రికార్డులో చోటు ద‌క్కించుకున్నాడు. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్న టైమ్‌లో ఒక్కో సినిమాకు కోటి నుంచి రెండు కోట్ల వ‌ర‌కు రెమ్యూన‌రేష‌న్ స్వీక‌రించాడు బ్ర‌హ్మానందం. గ‌త కొన్నేళ్లుగా రోజుకు ప‌ది ల‌క్ష‌ల చొప్పున పారితోషికం తీసుకుంటూ సినిమాలు చేస్తున్నారు.

అంద‌రూ బాలీవుడ్ నుంచే....

టాప్ టెన్ రిచెస్ట్ క‌మెడియ‌న్ల లిస్ట్‌లో బ్ర‌హ్మానందం మిన‌హా టాలీవుడ్ నుంచి ఎవ‌రూ లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఈ లిస్ట్‌లో ఉన్న మిగిలిర వారంద‌రూ బాలీవుడ్ హాస్య‌న‌టులే కావ‌డం గ‌మ‌నార్హం. బ్ర‌హ్మానందం త‌ర్వాత సెకండ్ ప్లేస్‌లో మూడు వంద‌ల కోట్ల‌తో క‌పిల్ శ‌ర్మ కొన‌సాగుతోన్నాడు. జానీ లివ‌ర్ (245 కోట్లు), భువ‌న్ బామ్ (130 కోట్లు), వీర్ దాస్ ( 100 కోట్లు) ఆ త‌ర్వాత ప్లేస్‌ల‌లో ఉన్నారు.
వీరితో పాటు రాజ్‌పాల్ యాద‌వ్‌, జాకీర్ ఖాన్‌, సునీల్ గ్రోవ‌ర్‌, భార‌తీ సింగ్‌, కీకూ శ‌ర్దా కూడా ఈ లిస్ట్‌లో కొన‌సాగుతోన్నారు.

Advertisement
Advertisement