Tollywood | టాలీవుడ్‌కు ఒక్క హిట్ కావాలి..! ఈ మూడునెల్లలో ఇండస్ట్రీకి మిశ్రమ ఫలితాలు
Tollywood | ఈ సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌లో పలు సినిమాలు విడుదలైనా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ ప్రసాద్ గారు’ మూవీ మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ రూ.300కోట్లకుపైగా వసూళ్లను సాధించి.. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
Entertainment | Published On Apr 1, 2026, 6.33 pm IST
- ‘మన శంకర్ ప్రసాద్ గారు’ మూవీ హిట్
- పర్వాలేదనిపించిన మరో రెండు చిత్రాలు
- రామ్ చరణ్ ‘పెద్ది’పైనే ఇండస్ట్రీ ఆశలు
- సమ్మర్‌లోనైనా టాలీవుడ్‌కు సక్సెస్ దక్కేనా?
Tollywood | ఈ సంక్రాంతి సీజన్‌లో టాలీవుడ్‌లో పలు సినిమాలు విడుదలైనా పెద్దగా ప్రభావం చూపించలేకపోయాయి. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర్ ప్రసాద్ గారు’ మూవీ మాత్రం మంచి విజయాన్ని నమోదు చేసింది. ఈ మూవీ రూ.300కోట్లకుపైగా వసూళ్లను సాధించి.. చిరంజీవి కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి కెమెడీ జానర్.. వెంకటేశ్ కేమియో రోల్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. సంక్రాంతికి ముందు రిలీజ్ అయిన రాజాసాబ్ సైతం పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రభాస్ కెరీర్‌లోనే డిజాస్టర్‌గా నిలిచింది. ఇదే సమయంలో ‘అనగనగా ఒక రాజు’, ‘నారీ నారీ నడుమ మురారి’ చిత్రాలు కూడా మంచి ఫలితాలు సాధించాయి. మరోవైపు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
మొత్తం మీద సంక్రాంతి సినిమాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. ఫిబ్రవరి నెల మాత్రం టాలీవుడ్‌కు పూర్తిగా నిరాశ కలిగించింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ‘యూఫోరియా’ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో విఫలమైంది. విశ్వక్ సేన్ నటించిన ‘ఫంకీ’కి మొదటి రోజే స్పందన లేకపోవడం గమనార్హం. ‘హే బలవంత్’, ‘విష్ణు విన్యాసం’ సైతం డిజాస్టర్స్‌గా నిలిచాయి. ‘కపుల్ ఫ్రెండ్లీ’కి మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కినా మూవీ కమర్షియల్‌గా సక్సెస్ సాధించలేకపోయింది. మార్చి నెలపై ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. పవన్ కల్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ హరీష్ శంకర్ దర్శకత్వంలో విడుదలై ‘గబ్బర్ సింగ్’ మ్యాజిక్‌ను మళ్లీ క్రియేట్ చేస్తుందని భావించారు. కానీ, ఈ మూవీ సైతం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. అదే సమయంలో విడుదలైన ‘మృత్యుంజయ’, ‘సాంప్రదాయిని సుప్పిణి సుద్దపూసాని’, ‘బ్యాండ్ మేళం’ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇదిలా ఉండగా.. హిందీ డబ్బింగ్ మూవీ ‘ధురంధర్ 2’ ఆదరణ లభించింది. తెలుగురాష్ట్రాల్లో మంచి ఓపెనింగ్స్ సాధించింది. టాలీవుడ్ సినిమాలకు అభిమాలను థియేటర్‌కు రప్పించలేకపోయినా ధురంధర్ మాత్రం కాస్త నిలకడను తీసుకువచ్చిందని ఇండస్ట్రీ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే, హిందీ వెర్షన్‌తో పోలిస్తే తెలుగులో వసూళ్లు ఆశించిన స్థాయికి చేరలేదని సమాచారం. సంక్రాంతి సినిమాలను మినహాయిస్తే, 2026 తొలి మూడు నెలల్లో టాలీవుడ్ నుంచి ఒక్క మూవీ కూడా సాలిడ్ హిట్‌ను అందుకోలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. తాజాగా అందరి అదృష్టి సమ్మర్ సినిమాలపైనే ఉంది. ముఖ్యంగా రామ్ చరణ్ ‘పెద్ది’పై భారీ అంచనాలున్నాయి. అయితే, ఈ మూవీ మే, జూన్‌కి రిలీజ్‌ని పోస్ట్‌పోన్ చేసే అవకాశం ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో డెకాయిట్, బైకర్, స్వయంభూ వంటి మూవీపైనే ఇండస్ట్రీ ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలు సైతం ఆడకపోతే టాలీవుడ్ మరోసారి సంక్షోభంలోకి వెళ్లే పరిస్థితి తలెత్తే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



