త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nora Fatehi | యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నోరా ప్రేమాయణం..!

Nora Fatehi | బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్పెషల్‌ సాంగ్‌లతో అలరించడంతో పాటు పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ గుర్తింపును సాధించుకుంది. హిందీతో పాటు టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నది.

P

Entertainment | Published On Jan 14, 2026, 1.05 pm IST

Nora Fatehi | యంగ్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో బాలీవుడ్‌ హాట్ బ్యూటీ నోరా ప్రేమాయణం..!
Advertisement

Nora Fatehi | బాలీవుడ్‌ హాట్‌ బ్యూటీ నోరా ఫతేహి గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. స్పెషల్‌ సాంగ్‌లతో అలరించడంతో పాటు పలు సినిమాల్లో ప్రత్యేక పాత్రల్లో నటించి తనకంటూ గుర్తింపును సాధించుకుంది. హిందీతో పాటు టాలీవుడ్‌లో అవకాశాలను దక్కించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నది. సోషల్‌ మీడియాలో ఈ బ్యూటీ యాక్టివ్‌గా ఉంటూ ఫొటోలు, వీడియోలను అభిమానులతో పంచుకుంటుంది. తాజాగా ఈ బ్యూటీ ఫుల్‌బాల్‌ మ్యాచ్‌కు హాజరైంది. ఈ సందర్భంగా చేసిన పోస్ట్‌ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ బ్యూటీ ప్రస్తుతం డేటింగ్‌లో ఉందని టాక్‌ వినిపిస్తున్నది.

ఆ వ్యక్తి ఎవరో కాదు మొరాకో స్టార్‌ అష్రఫ్‌ హకీమీతో డేటింగ్‌లో ఉందని బాలీవుడ్‌ కోడై కూస్తున్నది. గతవారాంతంలో జరిగిన ఆఫ్రికా కప్‌ ఆఫ్‌ నేషన్స్‌ ఫుట్‌బాల్‌ టోర్నీలోని ఓ మ్యాచ్‌కు నోరా హాజరైంది. ఆ తర్వాత కొద్దిసేపటికే ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ పెట్టింది. తాను మద్దతు తెలిపిన మొరాకో జట్టు గెలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపింది. దాంతో ఆమె ప్రియుడి జట్టుకు మద్దతు తెలిపేందుకు మ్యాచ్‌కు హాజరైనట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. గతంలో పలువురితో డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా కొత్త బాయ్‌ఫ్రెండ్‌ మొరాకో ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ అష్రఫ్‌ హకీమీతో పీకల్లోతు ప్రేమలో ఉందని నమ్ముతున్నారు.

27 సంవత్సరాల అష్రఫ్‌ హకీమీ పారిస్‌ సెయింట్‌ జర్మైన్‌ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. నవంబర్ 4, 1998న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జన్మించిన అతనుడు.. మొరాకో జాతీయ జట్టుకు రైట్-బ్యాక్ డిఫెండర్‌గా వ్యవహరిస్తున్నాడు. దేశ ఫుట్‌బాల్ జట్టుకు కెప్టెన్‌ కూడా. అతని పూర్తి పేరు అష్రఫ్ హకీమీ మౌహ్. గతంలో రియల్ మాడ్రిడ్ యూత్ అకాడమీలో శిక్షణ పొందాడు. డిఫెండర్‌గా మారడానికి ముందు జట్టులో మిడ్‌ఫిల్డర్‌ (వింగర్‌)గా ఉన్నాడు. అతనికి సోదరుడు నబీల్‌ హకీమీ సైతం ఫుల్‌బాల్‌ ప్లేయరే. అలాగే, ఔయిదాద్‌ హకీమీ అనే సోదరి సైతం ఉంది. ఇక నోరా-అష్రఫ్‌ తమ రిలేషన్‌పై ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ కోసం నోరా మొరాకో పర్యటనకు వెళ్లిందని.. ఓ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌తో డేటింగ్‌లో ఉందని ఓ జాతీయ మీడియా కథనం పేర్కొంది.

అష్రఫ్‌ హకీమీతో డేటింగ్‌లో ఉందని.. ఇందుకు ఇన్‌స్టాలో నోరా పెట్టిన పోస్టుకు లైక్‌ కొట్టడంతో ఊహానాగాలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దాంతో ఇద్దరు డేటింగ్‌లో ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఇదిలా ఉండగా.. నోరా ఫతేహి సైతం మొరాకో నేపథ్యం ఉంది. ఆమె మొరాకన్ కెనడియన్ కుటుంబంలో పుట్టింది. మొరాకన్ కెనడియన్ సంతతికి చెందినదాన్నైనప్పటికీ తాను భారతీయురాలిలేనని గతంలో ఓ ఇంటర్వ్యూలో నోరా వ్యాఖ్యానించింది. నోరా ‘రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్‌బన్స్’ అనే బాలీవుడ్ మూవీతో సినీరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లోనూ ఐటమ్స్‌ సాంగ్స్‌లో కనిపించింది. ప్రస్తుతం తమిళ మూవీ కాంచన-4లో హీరోయిన్‌గా నటిస్తున్నది.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Advertisement

తాజావార్తలు

Advertisement