Bigg Boss | యూట్యూబ్‌లో రిలీజైన బిగ్‌బాస్ విన్నర్ తెలుగు మూవీ – జీరో బడ్జెట్ – 17 నిమిషాలే రన్‌టైమ్!
బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు విన్నర్ నిఖిల్ (Nikhil Maliyakkal)హీరోగా మారాడు. ప్రేమద్రోహి పేరుతో ఓ సినిమా చేశాడు. యూట్యూబ్‌లో(Youtube) ఈ మూవీ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది.
Entertainment | Published On Dec 7, 2025, 6.54 pm IST
ప్రేమ ద్రోహి
Bigg Boss |బిగ్‌బాస్ (Bigg Boss) తెలుగు సీజన్ 8 విన్నర్ నిఖిల్ (Nikhil Maliyakkal) హీరోగా ఓ సినిమా చేశాడు. ప్రేమద్రోహి పేరుతో ఈ మూవీ తెరకెక్కింది.ఈ రొమాంటిక్ కామెడీ మూవీకి సీరియల్ యాక్టర్ శివకుమార్ దర్శకత్వం వహించాడు. ప్రేమ ద్రోహి మూవీలో నిఖిల్‌తో పాటు బుల్లితెర నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ (Priyanka Jain) కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తూనే ఇందులో శివకుమార్ కూడా నటించాడు.
ప్రేమ ద్రోహి మూవీ డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో రిలీజైంది. ఈ విషయాన్ని శివకుమార్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియల్‌గా ప్రకటించాడు. ప్రేమ ద్రోహి మూవీ రన్‌టైమ్ పదిహేడు నిమిషాలే కావడం గమనార్హం. ఈ మినీ మూవీని జీరో బడ్జెట్‌తో తెరకెక్కించినట్లు శివకుమార్ ప్రకటించాడు.
నిఖిల్, ప్రియాంకజైన్‌తో పాటు ఇందులో నటించిన యాక్టర్స్ ఎవరికి రెమ్యూనరేషన్ ఇవ్వలేదట. అంతే కాకుండా ఒక్క రోజులోనే ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసినట్లు డైరెక్టర్ కమ్ యాక్టర్ శివకుమార్ తెలిపాడు. ప్రేమద్రోహి మూవీ ప్రస్తుతం యూట్యూబ్‌లో ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతుంది. ఇందులో నిఖిల్ యాక్టింగ్ బాగుందంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు పార్ట్ 2 కూడా చేస్తే బాగుంటుందని కామెంట్స్ పెడుతున్నారు. ప్రేమ ద్రోహితోనే శివకుమార్ డైరెక్టర్‌గా మారాడు.
శివకుమార్, ప్రియాంక జైన్ ...బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని జంటగా పేరుతెచ్చుకున్నారు. మౌనరాగం సీరియల్‌తో ఈ జోడీ ఆడియెన్స్‌ను మెప్పించింది. ఈ సీరియల్ షూటింగ్‌లోనే శివకుమార్, ప్రియాంక మధ్య మొదలైన పరిచయం ప్రేమగా మారింది. ప్రస్తుతం వీరిద్దరు లివింగ్ రిలేషన్‌లో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు చెబుతున్నారు. మౌనరాగం తర్వాత ఇంటికి దీపం ఇల్లాలు సీరియల్‌లో శివకుమార్ నటించాడు. జానకి కలగనలేదు సీరియల్ ప్రియాంక జైన్ కు మంచి పేరు తీసుకొచ్చింది. బిగ్‌బాస్ సీజన్ 7లో ఓ కంటెస్టెంట్‌గా పాల్గొన్నది. బిగ్‌బాస్ టైటిల్ గెలిచిన నిఖిల్ ప్రస్తుతం సినిమాలతో పాటు కొన్ని వెబ్‌సిరీస్‌లు చేస్తున్నాడు. వేరే లెవెల్ ఆఫీస్ పేరుతో ఓ వెబ్‌సిరీస్ చేశాడు. ఆహా ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత వార్తలు

YouTube | పీసీలలో యూట్యూబ్‌ను వాడుతున్నారా.. దీన్ని గమనించకపోతే నష్టమే..
మే 4, 2026

YouTube Picture-in-Picture | యూట్యూబ్‌లో బిగ్ అప్డేట్.. ప్రీమియం పీఐపీ ఫీచర్ ఇక అందరికీ..
మే 1, 2026

YouTube Shorts | యూట్యూబ్ షార్ట్స్ కు కొత్త అప్డేట్.. వీడియోలను అసలు చూడకుండా ఆపొచ్చు..
ఏప్రిల్ 18, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



