Telugu Web Series | ఓటీటీలోకి తెలుగు బిగ్బాస్ విన్నర్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ – స్ట్రీమింగ్ డేట్ ఇదే!
బిగ్బాస్ విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా నటించిన తెలుగు వెబ్సిరీస్ విక్రమ్ ఆన్ డ్యూటీ రిలీజ్ డేట్తో పాటు ప్లాట్ఫామ్ ఫిక్సయ్యాయి. మార్చి 6 నుంచి జియో హాట్స్టార్లో ఈ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
Entertainment | Published On Feb 27, 2026, 8.16 pm IST
Telugu Web Series | బిగ్ బాస్ 8 తెలుగు విన్నర్ నిఖిల్ మలియక్కల్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. సినిమాతో కాదు ఓ వెబ్సిరీస్ ద్వారా తెలుగు ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. నిఖిల్ లీడ్ రోల్లో విక్రమ్ ఆన్ డ్యూటీ పేరుతో ఓ వెబ్సిరీస్ రూపొందింది. ఈ వెబ్సిరీస్ రిలీజ్ డేట్తో పాటు ప్లాట్ఫామ్ కన్ఫామ్ అయ్యాయి. మార్చి 6 నుంచి జియో హాట్ స్టార్లో విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది.
ప్రోమో రిలీజ్...
విక్రమ్ ఆన్ డ్యూటీ ప్రోమోను శుక్రవారం జియో హాట్స్టార్ రిలీజ్ చేసింది. ఇందులో విక్రమ్వాసు అనే స్పెషల్ ఆఫీసర్ పాత్రలో పవర్ఫుల్గా కనిపిస్తూనే తన కామెడీ టైమింగ్తో నిఖిల్ ఆకట్టుకున్నాడు. మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్ జరుగుతోండగా...ఓ వైపు నిఖిల్ ఆటోవాడితో బేరాలు ఆడటం లాంటి సీన్లు నవ్వించాయి. మీకు యూనిఫామ్ లేదా సార్ అని ఓ కానిస్టేబుల్ అడగ్గా...వాడికి అవసరం లేదు అని సమీర్ సమాధానం ఇవ్వడం, పై ఆఫీసర్ను పేరు పెట్టి పిలిచి ఆ తర్వాత సార్ అంటూ తడబడే సీన్లతో ప్రోమో సరదాగా సాగింది.
స్పెషల్ ఇన్వేస్టిగేషన్ టీమ్...
విక్రమ్ ఆన్ డ్యూటీ వెబ్సిరీస్లో నిఖిల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా కనిపించనున్నట్లు చెబుతోన్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT)లో పనిచేసే అతడు కొన్ని క్లిష్టమైన కేసులను ఎలా సాల్వ్ చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురయ్యే పరిణామాలేమిటనే అంశాలతో ఈ మూవీ సాగనున్నట్లు సమాచారం. విక్రమ్ ఆన్ డ్యూటీ సిరీస్లో బిగ్బాస్ బ్యూటీ అషు రెడ్డి కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
తెలుగు సీరియల్స్తో...
కన్నడ యాక్టర్ అయిన నిఖిల్ సీరియల్స్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు. గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, చిన్ని, అనుపల్లవితో పాటు మరికొన్ని తెలుగు సీరియల్స్లో లీడ్ యాక్టర్గా కనిపించాడు. బిగ్బాస్ సీజన్ 8లో కంటెస్టెంట్గా పాల్గొన్న నిఖిల్ అందరి అంచనాలకు తలక్రిందులు చేస్తూ విన్నర్గా నిలిచాడు. బిగ్బాస్ తర్వాత సినిమాలు, వెబ్సిరీస్లపై నిఖిల్ ఫోకస్ పెడుతోన్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Naga Durga | ఓటీటీలోకి నాగదుర్గ తమిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పులపాలైన ప్రేమికుడి కథ
జులై 24, 2026

Bigg Boss | బిగ్బాస్ హోస్ట్గా టీమిండియా కెప్టెన్ – హయ్యెస్ట్ రెమ్యూనరేషన్తో రికార్డ్
జులై 20, 2026

OTT | థియేటర్లలో బ్లాక్బస్టర్ – అయినా నెల రోజుల్లోనే ఓటీటీలోకి సమంత మా ఇంటి బంగారం
జులై 12, 2026
తాజావార్తలు
- ●Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?
- ●Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?
- ●Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి
- ●Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల
- ●Harish Rao | ప్రజల్లో మార్పు తీసుకురావడమే నిజమైన రాజకీయం: హరీశ్ రావు
- ●Horoscope | జూలై 26 రాశి ఫలాలు.. కొన్ని ఆకస్మిక మార్పులు ఉండవచ్చు!

Jurala Project | జూరాలను తాకిన కృష్ణమ్మ.. కాలువలకు నీరు విడుదల చేస్తారా?

Pralhad Joshi | నూతన విద్యాశాఖ మంత్రి ఏం చదువుకున్నారంటే?

Cheruvugattu | చెరువుగట్టులో భారీ అగ్నిప్రమాదం.. 15 దుకాణాలు అగ్నికి ఆహుతి

Vemulawada Rajanna Temple | ఎములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి మరో 99.40 కోట్లు విడుదల



