త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Akhanda 2 OTT | అఫీషియ‌ల్ : అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – బాల‌కృష్ణ సినిమాను ఎందులో చూడాలంటే?

బాల‌కృష్ణ అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యింది. జ‌న‌వ‌రి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు

N

Entertainment | Published On Jan 4, 2026, 12.55 pm IST

Akhanda 2 OTT | అఫీషియ‌ల్ : అఖండ 2 ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ – బాల‌కృష్ణ సినిమాను ఎందులో చూడాలంటే?
Advertisement

Akhanda 2 OTT |బాల‌కృష్ణ హీరోగా న‌టించిన లేటెస్ట్ మూవీ అఖండ 2 థియేట‌ర్ల‌లో రిలీజై నెల రోజులు కూడా కాక‌ముందే ఓటీటీలోకి వ‌స్తుంది. ఫాంట‌సీ యాక్ష‌న్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌, ప్లాట్‌ఫామ్ ఆదివారం అఫీషియ‌ల్‌గా క‌న్ఫామ్ అయ్యాయి. జ‌న‌వ‌రి 9 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అఖండ 2 స్ట్రీమింగ్ కాబోతుంది.
అఖండ 2 మూవీకి బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సంయుక్త మీన‌న్ హీరోయిన్‌గా న‌టించిన ఈ సినిమాలో హ‌ర్షాలీ మ‌ల్హోత్రా ఓ కీల‌క పాత్ర‌లో న‌టించింది. ఆది పినిశెట్టి విల‌న్‌గా క‌నిపించాడు. బాల‌కృష్ణ - బోయ‌పాటి శ్రీను క‌ల‌యిక‌లో వ‌చ్చిన నాలుగో మూవీ ఇది.

చివ‌రి నిమిషంలో పోస్ట్‌పోన్‌...

బాల‌కృష్ణ‌, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌కు ఉన్న క్రేజ్‌తో పాటు అఖండ పార్ట్ 1 పెద్ద విజ‌యాన్ని సాధించ‌డంతో రిలీజ్‌కు ముందు అఖండ 2పై ఓ రేంజ్‌లో బ‌జ్ ఏర్ప‌డింది. ఫైనాన్షియ‌ల్ ఇష్యూస్ కార‌ణంగా చివ‌రి నిమిషంలో సినిమా విడుద‌ల వాయిదాప‌డ‌టంతో పాటు పార్ట్ 1 స్థాయిలో క‌థ, ఎమోష‌న్స్ వ‌ర్క‌వుట్ కాపోవ‌డంతో అఖండ 2 ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన అఖండ 2...90 కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ ద‌క్కించుకుంది. నిర్మాత‌ల‌కు న‌ష్టాల‌ను తెచ్చిపెట్టింది.

పాన్ ఇండియ‌న్ లీగ్‌లో...

అఖండ 2 మూవీలో బాల‌కృష్ణ డ్యూయ‌ల్ షేడ్ క్యారెక్ట‌ర్‌లో క‌నిపించారు. అఘోరాగా, ఎమ్మెల్యేగా రెండు పాత్ర‌ల్లోచ‌క్క‌టి వేరియేష‌న్ చూపిస్తూ త‌న న‌ట‌న‌తో అభిమానుల‌ను ఆక‌ట్టుకున్నారు. అఖండ 2 మూవీకి త‌మ‌న్ మ్యూజిక్ అందించాడు. 14 రీల్స్ ప్ల‌స్ బ్యాన‌ర్‌పై రామ్ ఆచంట‌, గోపీ ఆచంట ఈ సినిమాను నిర్మించారు. అఖండ 2 మూవీతోనే బాల‌కృష్ణ పాన్ ఇండియ‌న్ లీగ్‌లోకి అడుగుపెట్టారు. కానీ తెలుగు మిన‌హా మిగిలిన భాష‌ల్లో ఈ సీక్వెల్ స‌రైన క‌లెక్ష‌న్స్ రాబ‌ట్ట‌లేక‌పోయింది.

అఖండ 2 క‌థ ఇదే...

భార‌త్‌ను దెబ్బ‌తీసేందుకు చైనా ఓ బ‌యోవార్ కుట్ర‌కు ప్లాన్ చేస్తుంది. కుంభ‌మేళాను ల‌క్ష్యంగా చేసిన ఈ బ‌యోవార్ కార‌ణంగా చాలా మంది ప్రాణాల‌కు ప్ర‌మాదం ఏర్ప‌డుతుంది. ఈ బ‌యోవార్‌కు విరుగుడుగా సైంటిస్ట్‌లు వ్యాక్సిన్ క‌నిపెడ‌తారు. ఆ సైంటిస్ట్‌ల‌ను శ‌త్రువులు చంపేస్తారి. వారి బారి నుంచి జ‌న‌నిని రుద్ర సికింద‌ర్ అనే అఘోరా కాపాడుతాడు. అత‌డు ఎవ‌రు? జ‌న‌నికి రుద్ర సికింద‌ర్‌కు ఉన్న సంబంధం ఏమిటి? ఎమ్మెల్యే బాల‌ముర‌ళీకృష్ట జ‌న‌నికి ఏమ‌వుతాడు? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

Advertisement

తాజావార్తలు

Advertisement